భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! .....12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోషంతో తిరిగి వచ్చి వరగర్వంతో విజృంభించి స్వర్గాన్ని ఆక్రమించింది మహిషి! భూలోకంలో తన శాసనాన్ని అమలు చేసింది!
‘‘ఇప్పటికి నా పగ చల్లారింది! నా సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాను! హ.. హ.. హ! ఇక మూడు లోకాలలో నన్ను ఎదిరించే వారు లేరు!’’ అంటూ యధేష్టంగా వివరిస్తూ అందరినీ భయభ్రాంతులను చేయసాగింది మహిషి!
****
‘‘తండ్రీ! మీరిచ్చిన వరప్రభావంతో మహిషిలో గర్వాహంకారాలు విజృంభించి ఆమె చేస్తున్న దురాగతాలు హద్దుమీరిపోతున్నాయి! హరిహరులు, జగన్మాత కూడా చూస్తూ వున్నారు గానీ ఏ విధంగాను ఆ మహిషిని నిర్జించే మార్గం తెలియజేయటం లేదు! ఈ పరిస్థితిలో మీరే మాకు తరుణోపాయం తెలియజెప్పాలి!’’ అంటూ బ్రహ్మ దగ్గరకు వచ్చి దీనంగా మొరపెట్టుకున్నారు ఇంద్రాది దేవతలు!
వాళ్లవైపు చిరునవ్వుతో చూస్తూ అభయం ప్రసాదించాడు బ్రహ్మదేవుడు!
‘‘దేవతలారా! నిరాశ చెందకండి! ప్రస్తుతం మహిషి తన కఠోర తపస్సుకు ఫలంగా సుఖభోగాలనుభవిస్తున్నది! ఆమె కోరిక అసాధారణ కోరిక తీరే సమయం కూడా దగ్గరపడుతున్నది. ఆ విషయం ఆమెకు తెలియకుండా ఉండడానికి తాత్కాలికంగా ఆమె దృష్టిని మరల్చే సమర్థుడు రాబోతున్నాడు! అలా చూడండి!’’ అంటూ కళ్లు మూసుకుని ధ్యనించాడు.
దేవతలందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా సుందరదత్తుడు అక్కడకు వచ్చిన బ్రహ్మకు నమస్కరించాడు.
‘‘సుందరదత్తా! నీవల్ల కావలసిన దైవకార్యం ఒకటి వున్నది! నీ శాపం చేత నీ భార్య లీలావతి మహిషిగా జన్మించి స్వర్గ, మర్త్యలోకాలలో శాంతి భద్రతలు కరువయ్యేలా చేస్తున్నది! నీవు వెంటనే సుందర మహిష రూపాన్ని ధరించి ఆమె ఆగడాలు అరికట్టడానికి ప్రయత్నించవలసింది’’ అని ఆదేశించాడు బ్రహ్మదేవుడు!
‘‘మీ ఆజ్ఞ శిరసావహిస్తాను! కానీ విధాతా! మోక్షాన్ని కోరి నేను చేస్తున్న తపస్సు విఘ్నమవడం నాకు చాలా విచారాన్ని కలిగిస్తున్నది! ఆమెనుండి నాకెప్పుడూ విముక్తి లభిస్తుందో తెలియజేయండి!’’ అని వేడుకున్నాడు సుందరదత్తుడు!
‘‘దత్తా! నీ తపస్సు భంగమైనందుకు విచారించవద్దు! లీలావతి నీకిచ్చిన ప్రతి శాపాన్ని అనుభవించేవరకు నీ కర్మ పరిహారం కాదు! అందుచేత మహిష రూపంలో ఆమెతో కలిసివున్నా నీ మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఎప్పుడూ ముక్తస్థితిలోనే వుంటుంది! నీ కార్యం పూర్తవగానే నీవు పరమాత్మలో ఐక్యం కాగలవు!’’ అని సమాధానపరిచాడు బ్రహ్మదేవుడు!
దత్తుడు సుందర మహిష రూపాన్ని పొంది మహిషి నివాసాన్ని చేరుకున్నాడు! అల్లంత దూరం నుండి మహిషాన్ని చూస్తూనే మహిషిలో ఆనందం పొంగివచ్చింది! పరుగు పరుగున అతడిని చేరింది! స్వర్గ్భోగాలను, పరివారాన్ని విడిచి తనను కవ్విస్తున్న సుందర మహిషం వైపు అడవిలోకి వెళ్లిపోయింది! అక్కడ ఆ జంట ఏకాంతాన్ని భంగపరిచే వారు లేరు! బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని సంవత్సరాలు ఆనందంగా విహరిస్తూ గడిపేసాయి!
***
‘‘మహిషి బెడద తాత్కాలికంగా తీరినా దాని అంతం మాత్రం మీ ఇరువురికి జన్మించే పుత్రుని చేతిలో మాత్రమే వుంది గదా! హరిహరులారా! ఇద్దరు పురుషులకు పుత్రుడు జన్మించే అవకాశం లేదనీ, అది ప్రకృతి విరుద్ధమనీ తెలిసే అటువంటి వరం కోరింది ఆ మహిషి! ఆ అసాధ్యమైన కార్యం ఎట్లా సాధ్యవౌతుంది? మహిషి మరణం ఏ విధంగా సంభవిస్తుంది స్వామీ!’’ కుతూహలంగా హరిహరులవైపు చూస్తూ ప్రశ్నించాడు నారదుడు!
‘‘అవును స్వామీ! సుందర మహిషాన్ని కూడి వున్న మహిషి ఎప్పుడు తిరిగి విజృంభిస్తుందో తెలియదు!

-ఇంకాఉంది

-డా. టి.కళ్యాణీసచ్చిదానందం