మంచి మాట

గంగానది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తూ యజ్ఞాశ్వాన్ని వదిలిపెట్టాడు. ఆ విషయం ఇంద్రుడికి తెలిసింది. యజ్ఞం పూర్తయితే ఉపద్రవం వస్తుందనుకున్న ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించి కపిలముని ఆశ్రమంలో కట్టివేశాడు. సంగతి తెలియని సగరమహారాజు తన పుత్రులను యాగాశ్వాన్ని వెదకమని పంపించాడు. అలా వెళ్లిన సగర చక్రవర్తి పుత్రులు 60వేలమంది యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ భూమిని తవ్వారు. ఒకచోట కపిల ముని తపస్సుచేసుకొంటూ వారికి కనిపించారు. ఆయన పక్కనే ఉన్న యాగాశ్వాన్ని వారు చూచారు. కపిలమునే యాగాశ్వాన్ని దొంగలించాడని ఆయన మీదికి వీరు వెళ్లారు. తపస్సు భగ్నం అయ కపిలముని కళ్లు తెరిచారు. వీరిని చూచి ఒక్క హుంకారం చేశాడు. ఆ హుంకారానికి సగర పుత్రులు అరవైమంది భస్మీపటలం అయ్యారు. వారెంతకూ తిరిగి రాకపోతే సగరుని మనుమడు అంశుమంతుడు వారిని అనే్వషిస్తూ కపిలముని ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ జరిగినదంతా తెలుసుకున్నాడు. పరమ పావని యైన గంగను భూమిమీదకు తెస్తే ఆ జలంతో సగర పుత్రుల భస్మాన్ని తడిపితే వారు ముక్తులవుతారు అనే తరుణోపాయం ఆయనకు తెలిసింది. చేసేది ఏమీ లేక వెనక్కు వచ్చి గంగను తేవడానికి మార్గాలను అనే్వషించాడు.
కొన్నాళ్ల తరువాత ఇక్ష్వాకు వంశంలోనే భగీరథుడు జన్మించాడు. అతడు తన పూర్వులను ముక్తులు చేయడానికి గంగను దివినుంచి భువికి రప్పించడంకోసం బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొనడానికై తీవ్ర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై భగరీథుడు కోరిన వరం ప్రసాదించాడు. నా జలధార ను భూమి భరించలేదు కనుక ఈశ్వరుడిని ప్రసన్నుడిని చేసుకుని మార్గం ఉపదేశించమని అడుగమని భగీరథునితో గంగాదేవి చెబుతుంది. భగరథుని ప్రార్థనకు ఈశ్వరుడు సంతృప్తుడై గంగానదీ జలాలను తన జటాజూటంలో పడేట్టు చేసి అందుండి భువిమీదకు పారేట్టుగా శివుడు చేస్తాననే వరం ఇచ్చాడు. అట్లానే చేశాడు. గంగ భువిపై పారుతూ వస్తున్న సమయంలో ఆ మార్గంలో ఉన్న జహ్నుమహర్షి యజ్ఞవాటిక మునిగిపోయింది. జహ్ను కోపించి గంగను కనిపించకుండాచేశాడు. ఆతరువాత మళ్లీ భగీరథుని విన్నపం మేరకు జహ్ను గంగను పారేట్టుగా చేశాడు. అందువలన గంగానదికి జాహ్నవి అన్న పేరు వచ్చింది. భగీరథుడి తీవ్ర ప్రయాసవలన స్వర్గంలోకంలోంచి భూలోకం వచ్చినందున దాన్ని భగీరథి అని వ్యవరిస్తారు.
భగీరథుడు హరిద్వార్ నుండి గంగను నడిపించి కాశీ క్షేత్రమందు మణికర్ణికలో విడిచిపెట్టాడు. అప్పటినుంచి మణికర్ణికా క్షేత్రం దేవతలకు కూడా ప్రశస్తమైంది. మోక్షప్రదాయియైన కాశీ క్షేత్రం గంగానది కారణంగా మరింత ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ముక్త్ధిమంగా ద్విగుణీకృత శక్తితో విరాజిల్లుతోంది.
గంగ సమస్త జగత్తులకు మాతృ స్వరూపిణి, త్రిశక్తి, కరుణాత్మిక, ఆనందామృతరూప, శుద్ధ ధర్మ స్వరూపిణి. ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయిన గంగను విశే్వశ్వరుడు వహిస్తున్నాడు. మూడు లోకాలలోని సర్వతీర్థములు, పుణ్యక్షేత్రములు, సమస్త ధర్మములు, యజ్ఞములు, సుతపస్సులు, చతుర్వేదములు, అఖిల దేవతాగణములు, సకల శక్తులు, చతుర్విధ పురుషార్థములు అన్నీ సూక్ష్మరూపంలో గంగలోనున్నాయి. ఈ నదిలో స్నానమాచరించినవాడు పుణ్యఫలములు పొందుతాడు.గంగానదిలో స్నానం చేసే అవకాశం లేనివారుఏ ఇతర జలాలనైనా తీసుకుని గంగాదేవి మంత్రాన్ని పఠిస్తూనో లేదా గంగ గంగ గంగ అని మూడుసార్లు జపిస్తూ స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసి పుణ్యం లభిస్తుంది. పూజలు, దానములు, యజ్ఞములు చేయడానికి ఇంతకుమించిన క్షేత్రం వేరొకటి లేదు.
ఒక ఐతిహ్యంలో నీరు దానం చేయకపోవడం వల్ల దానవీరుడని పేరుతెచ్చుకున్న కర్ణుడు కూడా స్వర్గలోకాన్ని పొందినప్పటికీ నీటికోసం పరితపించాడట.అందుకే నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే కాక నీటిని కలుషితం చేయకూడదు. ఇంతటి పవిత్ర గంగను ఆధునిక కాలంలోనేడు కలుషితం అవుతున్నది. మానవుడు తన స్వార్థం కొరకు గంగాదేవిలోనే కాదు అన్ని స్వచ్ఛజలాలలోను మురుగును చేర్చి తాగుటకు నీరు లేకుండా చేస్తున్నాడు.
భగవంతుడు మనకు అమూల్య వరంగా ఇచ్చిన నీటిని వృథా చేయకుండాను, ఆ నీటితో మేలైనా కార్యక్రమాలు చేయాలి. నీటి వల్లనే మన నాగరికత పరిఢవిల్లుతుంది. అన్నం లేక నాలుగురోజులు ప్రాణాలు నిలుపుకోవచ్చు. కాని నీరు లేకుండా కొన్ని గంటలనైనా గడుపలేము. కనుక నీటిని జాగ్రత్తగా ఉపయోగించాలి. నీటికొరతను లేకుండా జాగ్రత్త చేయాలి.

-గుమ్మా ప్రసాదరావు