నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటి నదీతటంబు బొడగంటిని భద్రానగాధివా సమున్
గంటి నిలా తనూజ మరు కార్ముక మార్గణ శంఖ చక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి, కృతార్థుడనైతి, నో జగ
త్కంటక దైత్య నిర్దళన! దాశరథీ కరుణాపయోనిధీ!
భావము:లోక హింసకులైన రాక్షసులను నిర్మూలించి దయా సముద్రడవై యొప్పుచున్న ఓ దశరథరామా! గోదావరీ నదీ తీరాన్ని, నీకు శ్రేష్ఠమైన నివాసమైన, నీవు వేంచేసి వున్న భద్రాచలమనే పుణ్యక్షేత్రాన్ని దర్శించినాను. భూదేవి కుమార్తె అయిన సీతాదేవిని చూచినాను. నీవు ధరించిన గొప్ప ధనుస్సును, బాణములను చూచాను. నిన్ను నీ సోదరుడైన లక్ష్మణుని సేవించి ధన్యుడనైనాను. నా కోరికలు నెరవేరినవి.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము