భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా!...15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరినీ కలియజూశాడు సూతమహర్షి!
‘‘మహర్షి! గణపతి, కుమారస్వాములకు ఇద్దరిద్దరు పత్నులున్నట్లుగానే భూతనాధునికి ఇద్దరు పత్నులున్నట్లు తెలిపారు గదా! భూతనాథుడే భూలోకానికి వచ్చి అయ్యప్పస్వామిగా అవతరిస్తాడని అనుకుంటున్నాము! ఆ స్వామి ఎందుకు వివాహం చేసుకోలేదు? ఆ సంగతులు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ వింటున్న వారిలో కొందరు మునులు అడిగాడు!
‘‘మీరనుకుంటున్నట్లు భూతనాధుడే భూలోకంలో అయ్యప్పగా పూజింపబడతాడు! మునులారా! పురుషుని చేరే ప్రకృతిలో రెండు భాగాలు విలీనమై ఉంటాయి. వాటిని పరాప్రకృతి, అపరాప్రకృతి అంటారు! భక్తులకోసం ఈ రెండు భగవంతునికి పత్నులై భక్తుల కోరికలు సంపూర్ణంగా నెరవేర్చి వారి సఖజీవనానికి కావలసిన ధన, ధాన్య భోగాలను పుష్కళంగా అనుగ్రహిస్తారు! పూర్ణ, పుష్కళములు అయిన పరా, అపరా ప్రకృతులను తనలోనే విలీనం కావించుకుని భూతనాధుడు భూలోకంలో అవతరించడం జరిగింది! చిత్ర విచిత్రమైన సంఘటనలతో పనె్నండు సంవత్సరాలపాటు భూమిపై ఆ స్వామి కావించిన లీలల గూర్చి చెబుతాను! సావధానులై వినండి!
‘‘విప్ర పూజ్యం విశ్వవంద్యం
విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్రప్రసాద నిరతం
శాస్తారం ప్రణమామ్యహం!!’’
అంటూ కళ్లు మూసుకుని ధ్యానించి చెప్పసాగాడు సూతమహర్షి!
***
రెండవ అధ్యాయము
భూలోకంలో మణికంఠునిగా భూతనాథుని అవతరణం!హరిహర స్తుతి:రాజశేఖరుని వృత్తాం తం ‘‘అభ్రంకశంబైన యాలబోతు నీతండు ద్రుంచినాడీతండు పెంచినాడు!
సాధుసమ్మతంబుగ సారుజంబు నీతండు గాచినాడీతండు ద్రోచినాడు! బర్హిర్ ముఖార్ధమై పర్వతేశునీతండు దాల్చినాడీతండు వ్రాల్చినాడు! ఫణి పరంపర తోడి పన్నగేంద్రుడు నీతండు మెట్టినాడీతండు సుట్టినాడు! నేడు నాడును, నాడును నేడు జూడ జెప్పంగ జెప్పంగ జూడగలిగెననుచు
గొనియాడు సంయమి జనులకొదవె రజతగిరి మీద హరిహారారాధనంబు
పూజా కార్యక్రమం ముగించి లేచారు రాజశేఖరుడు, ఆయన పత్ని! పాండ్య వంశస్థుడు, పందల రాజ్యాన్ని పాలిస్తున్న ఆ రాజును సంతానం లేని కొరత ఎంతగానో బాధిస్తున్నది! ‘‘రాకుమారుడు స్వస్థుడైనాడు! ఇక మనకే చింతా లేకుండా చూస్తాడు!’’ వాళ్ళలో వాళ్లనుకుంటుంటే చిరునవ్వు నవ్వి ‘‘అవును! ఇక ఏ చింతా దరిచేరదు. మీ ప్రియతమ నాయకుడిని’’ అంటూ అందరిని ఆశీర్వదించి బయలుదేరుతున్న వృద్ధుడికి పళ్ళెరం నిండా బంగారు నాణాలు పోసి బహూకరించబోయాడు రాజు! ‘‘మహారాజా! వాటిని మీ ప్రజలకే దానం చేయండి?’’ అని వడివడిగా నడుస్తూ వెళ్లిపోయాడు వృద్ధుడు!
విషయం తెలిసిన మంత్రి, సేనాపతులలో పరివర్తన కలగకపోగా మణికంఠునిపై ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైనాయి. అతనిని తుదముట్టించడానికి మరో పథకం ఆలోచించసాగారు!
***
మంత్రి దురాలోచన
మణికంఠుడు ప్రజలను కన్నబడ్డలలాగా చూసుకునేవాడు! పనె్నండు సంవత్సరాల ప్రాయంలోనే ఎంతో పరిణతి చెందిన వ్యక్తిత్వంతో ప్రజాక్షేమం కోసం అతను తీసుకునే నిర్ణయాలు, జరిపే కార్యక్రమాలు దక్షతగల పాలకునిగా గుర్తింపు కలిగించాయి! ఒక రోజు నిండు సభలో..‘‘మణికంఠుడు లేత వయస్సులోనే మాకంటే ముందుచూపుతో ప్రజారంజకమైన కార్యాలు చేస్తూ అందరి మన్ననలు పొందటం తండ్రిగా నాకెంతో ఆనందం కలిగిస్తున్నది! ఇక ఆలస్యం చేయకుండా అతనికి పరిపాలనా బాధ్యత అప్పగించి నేను విశ్రాంతి తీసుకోవాలను కుంటున్నాను! శుభముహూర్తం నిర్ణయించి త్వరలోనే పట్ట్భాషేక మహోత్సవం వైభవంగా జరిపించాలని సంకల్పించాను! నా నిర్ణయం అందరికీ ఆనందం కలిగిస్తుందని నమ్ముతున్నాను’’ అంటూ ప్రకటించాడు రాజశేఖరుడు సభాసదుల సమక్షంలో!
అందరూ హర్షాధ్వానాలతో సమ్మతిని తెలియజేశారు!

-ఇంకాఉంది
.........................................................................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-డా. టి.కళ్యాణీసచ్చిదానందం