డైలీ సీరియల్

ట్విన్‌టవర్స్ 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజానికి ఆవిడ నాకు పెద్ద వదిన. అయినా మంచి ఫ్రెండ్. మంచి గైడ్. ఆవిడ మాట ఎప్పుడూ వింటాను. నేనేమిటి మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఆవిడ మాట వినడం. అమ్మ వచ్చి వరండాలోకి రమ్మంది. మామూలుగా వెళ్లాను.
మెంటల్‌గా ఎటువంటి ప్రిపరేషన్ లేదు. అసలు నాకు ఏ విషయం తెలియదు. కాలేజీ నుంచి వస్తూ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ గురించి ఆలోచించడం తప్ప. అదీ ఒకందుకు మంచిదే! ముందునుంచి ఆలోచిస్తూ ఉంటే కొంచెం నెర్వస్‌గా అనిపించేదేమో! యాంటిసిపేషన్‌తో.
బయటనుంచి వచ్చిన వారిలో ఒక ఆవిడ- నేను ఏ కుర్చీలో కూచోవాలో ఆవిడే చూపింది. తరువాత అనుకున్నాను. నేను కూర్చుని ఉన్న కుర్చీపై బాగా వెలుతురు పడుతుంది. దానికి నాలుగు అడుగుల దూరంలో ఒక కుర్రాడు కూచుని ఉన్నాడు.
కళ్ళెత్తి చూశాను అందరి వంక. నన్ను పలకరించిన ఆవిడ మొహం సంతృప్తిగా, సంతోషంగా ఉంది. ఆవిడ చాలా డిగ్నిఫైడ్‌గా ఉంది. చక్కని పట్టుచీర, మెళ్ళో నల్లపూసలు, సూత్రంగొలుసు. పెద్దగా నగలు పెట్టుకోలేదు. చేతికి మాత్రం నిండుగా బంగారం గాజులు ఉన్నాయి.
ఆవిడ పక్కన కూర్చున్న ఆయనని చూడగానే ఇంప్రెసివ్‌గా ఉన్నాడు. ఆ పక్కన మామయ్య. క్షణకాలం ఒళ్ళు మండింది. ఈ హడావిడికంతా మూల కారకుడు ఆయన అయి ఉంటాడు. ఆయన మాత్రం ‘‘ఏం కళ్యాణీ’’ అంటూ పలకరించాడు. ‘బాగా చదువుతున్నావా?’ అని- తల ఊగించాను.
ఆయనకు పక్కగా, ఒకతను కూర్చుని ఉన్నాడు. కూర్చుని కాళ్ళు కుర్చీ కిందకు పెట్టుకోవడంతో ఎత్తు తెలియలేదు.
కాని వదిన అన్నట్లు చాలా బాగున్నాడు. రోజూ చదివే నవలల్లో హీరోల్లా ఉన్నాడు. అందమైన అబ్బాయిలు కథల్లోనూ, నవలల్లో కాక భూమి మీద కూడా ఉంటారా అనుకున్నాను. అప్రయత్నంగా నా పెదవులు మీద చిరునవ్వు వచ్చిందట (తరువాత అతనే చెప్పాడు, చెప్పి ఎందుకని అని కూడా అడిగాడు).
ఆ తరువాత అతి సామాన్యంగా మరో పావుగంట గడిచింది, మామూలు సంభాషణతో.
ఆ రోజు ఇంట్లో వాళ్లంతా చాలా ఆనందంగా ఉన్నారు. కుర్రాడు నచ్చాడు. కుటుంబం నచ్చింది. తన్నుకుంటూ వచ్చి తలుపు కొట్టిన అదృష్టం వచ్చింది.
ఆ తరువాత 48 గంటలు చాలా స్లోగా నడిచాయి ఇంట్లో వాళ్లందరికి!
నేను మాత్రం మామూలుగానే కాలేజీకి వెళ్ళాను. తమాషా.. నాకెందుకో అంత ఆత్రుత అనిపించలేదు! మూడో రోజు మామయ్య ఊడిపడ్డాడు. భూమిమీద నిలవ లేకుండా!
వారి కుటుంబంకి నేను చాలా నచ్చానుట. వాళ్ళ అబ్బాయికి తగ్గట్టుగా, పొడుగాటి అమ్మాయి దొరకదేమో అని కంగారు పడిపోయిందట అతని తల్లి. నన్ను చూడంగానే ఆవిడకి చాలా నచ్చేశానుట.
మా మామ్మకి అదే బెంగ! నేను రెండంగుళాలు పెరిగితే చాలు, ‘‘దీనికి మొగుడు దొరకడం కష్టంరా’’ అనేది.
ఏమిటో పెద్దవాళ్ళ చాదస్తం. మగాడు కొద్దిగా పొట్టయినంత మాత్రం నష్టం ఏమిటి? వయసులో పెద్ద అవ్వాలి. సైజులో పొడుగు అవ్వాలి. బహుశా మగవాళ్ళ మెదళ్లమీద అనుమానం ఉందేమో! అందుకే మగాళ్ళు చదువులో కూడా ఎక్కువయి ఉండాలి అనుకుంటారు. మగవాడి ఇన్‌సెక్యూరిటీ పుట్టుకతో వచ్చిందేమో! అది కప్పిపుచ్చుకునేందుకే ఈ ఆచారాలన్నీ వచ్చి ఉంటాయి.
పెళ్లి వారం రోజుల్లో జరిపించేయాలి అన్నారుట. 10 రోజుల్లో అతను అమెరికా వెళ్లిపోతున్నాడు.
అమ్మ తెల్లబోయింది. వారం అంటే ఎలా? డబ్బు అది సమకూర్చుకోవాలా! ఏర్పాట్లు ఎలా జరుగుతాయి అని.
కాని, అవతల వాళ్ళ ఆదేశం ప్రకారం అన్నీ జరిగాయి. ఇందులో నా ఇష్టా అయిష్టాల ప్రసక్తి రాలేదు. పిల్లవాడు అందంగా, సినిమా హీరోలా ఉంటే, ఆడపిల్ల ఇంకేమీ ఆలోచించదు అని పెద్దవాళ్ళ అంచనా.
అందరూ నాకు ఆ అబ్బాయి నచ్చాడనే అనుకున్నారు. అసలు ఆ విషయంలో అభ్యంతరం ఉంటుందని కూడా ఎవరూ అనుకోలేదు.
మామయ్య చెప్పాడు. అతనికి నేను నచ్చానుట కాని, రెండేళ్లలో వెనక్కి వచ్చి పెళ్లి చేసుకుంటానని అన్నాడట. కాని వాళ్ళ ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదుట. వాళ్ళ మామ్మ, తాతయ్య అసలు ఒప్పుకోవటంలేదు. నచ్చాక, ఇంక ఆలస్యం ఎందుకు అంటూ వాళ్ళ అమ్మ కూడా అడ్డు చెప్పింది.
కాని, నాకు మాత్రం అతని ఆలోచన చాలా నచ్చింది. నాన్నతో అన్నాను. ‘‘ఇంత హఠాత్తుగా ఈ పెళ్ళేమిటి నాన్న. నా పరీక్షలకు నెల రోజులు కూడా లేవు. పైగా అతను కూడా రెండు ఏళ్ళ తరువాత అన్నపుడు అదే బాగుంది కదా! నాకిప్పుడు ఇష్టం లేదు’’ అని స్పష్టంగా అన్నాను.
నిజానికి నాన్న మనసులో కూడా అదే ఉండి ఉండచ్చు.
కానీ అమ్మలు! వాళ్ళంతట వాళ్ళు వచ్చారు మన ఇంటికి, మన వైపు నుండి ఏ ప్రయత్నం లేకుండా ఇంత మంచి సంబంధం వదులుకోవటం సరైనది కాదు కదా! అన్నారు.
‘‘కానీ నాన్నా, వదులుకోవటం లేదు కదా! రెండేళ్ళ తరువాత అని కానీ..’’
‘‘కాదమ్మా, వాళ్ళు మన ఇంటికి వచ్చిందే వెంటనే పెళ్లిచెయ్యాలని. నిన్ను మామయ్య ఇంటిలో పెళ్లిలో చూశారుట. అతని తల్లికి నువ్వు చాలా నచ్చావని మామయ్య ద్వారా కబురు పంపింది’’.

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి