డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంత్రానికి అతని మేనమామ కుటుంబం వచ్చింది. మా పెళ్లయిన ముహూర్తానికే అతని భార్య వైపు కుటుంబంలో మరో వివాహం ఉండటంతో మా పెళ్లకి రాలేకపోయారుట.
వారి సంభాషణలు చూస్తే ఏదో చేయిజారిన అదృష్టం కోసం వాపోతున్నట్లు కనిపించింది. దాన్ని నిరోధించే ప్రయత్నం గట్టిగా చేయలేదని నిష్ఠూరం ధ్వనిస్తూనే ఉంది. చివరికి, అత్తగారు, ‘‘ఒరే శివా నీకు తెలియనిదేముంది?’’ పెళ్ళిళ్ళు దైవనిర్ణయం. అవి మన చేతుల్లో లేవు’’ అంది.
‘‘అంతేలే అక్కయ్యా! ఇపుడు ఆ మాట అనక ఇంకేమాట అంటావు? నువ్వు బాగా గట్టిగా చెబితే వాడు ఎప్పుడైనా నీ మాట కాదన్నడా! అసలు మీకే అంతగా ఇష్టం లేదు’’ అన్నాడు నిష్ఠూరంగా. ఆయన భార్య కూడా వంత పాడింది. ఇంతలో మేనల్లుడు రావడంతో అన్ని మాటలు ఆగిపోయాయి.
మామయ్య కూతురు జడ పట్టుకు గుంజుతూ ‘‘ఏం అత్తా మామయ్య కోపం తగ్గిందా. ఇంకా ధూమ్ ఢాం అంటున్నాడా?’’ అని అందరినీ కలిపి ఒకేసారి పలకరించాడు.
‘‘మామయ్య డూం డాంలు నినే్నం చెయ్యలేవని మీ మామయ్యకు తెలియదు’’ అంది అతని అత్త.
అప్పుడు తల ఎత్తి చూచాను ఆ అమ్మాయి వంక. ఆ పిల్ల నాకంటే చిన్నది. ఇంకా హైస్కూల్‌లో ఉందేమో. పొట్టిగా, సన్నగా చాలా చిన్నగా కనిపిస్తోంది.
తరువాత తెలిసింది. చిన్నప్పటినుంచి ఆ అమ్మాయిని రఘుకి ఇచ్చి పెళ్లిచేయాలని అనుకున్నారట. ఇతను మాత్రం ససేమిరా వీల్లేదు అన్నాడుట.
రక్తసంబంధంలో పెళ్లి చేసుకోకూడదని. అతని మాటకు పెద్ద విలువ ఇవ్వకుండా చూద్దాంలే ఇంకా చాలా సమయముంది. అప్పటికి అతన్ని ఒప్పించలేమా అని అనుకున్నారుట.
తీరా అమెరికా ప్రయాణం అనగానే- అందరికీ తొందరెక్కువైంది. అమెరికా వెళ్ళే ముందు ససేమిరా పెళ్లి చేసుకుని మాత్రమే వెళ్లాలని తల్లిదండ్రులు, తాత, మామ అందరూ పట్టుపట్టారు.
ఇక గెలవలేనని తెలిశాక, మామయ్య కూతురిని తప్ప, మరెవరినైనా చూడండి, చేసుకుంటాను. దాన్ని మాత్రం చేసుకోను. తెగేసి చెప్పాడు రఘు.
‘‘ఎవరినో ఒకరిని చేసుకునే వెళ్తాను’’ అన్నాడు కదా అని అదే పదివేలు అనుకుని వేట మొదలుపెట్టారు. ఇంత తక్కువ వ్యవధిలో ఎలా కుదరుతుందిలే అని అనుకుని ఉంటాడు. లేకపోతే అంత భరోసాగా చెప్పేవాడు కాదేమో! తీరా, నేను ఎదురవంగానే అతనికేం చేయాలో తెలిసి ఉండదు. నన్ను వద్దని అనాలనిపించలేదు, పెళ్లిచేసుకోవాలని లేదు. అతని సందిగ్ధం- అవకాశంగా తీసుకున్నారు అతని తల్లిదండ్రులు.
మొదటగా, గుర్తుకు వచ్చినదాన్ని నేను. ఆ విధంగా నాకు అతనికి పెళ్లయిపోయింది. తరువాత మాటల్లో తనే అన్నాడు. ‘అసలు పెళ్లిచేసుకుందామనే అనుకోలేదు నేను. కానీ నిన్ను చూశాక, ఆ విషయమే మర్చిపోయాను’ అని.
ఆ రోజంతా బిజీగా గడిచిపోయి బయట పనులుమీద తిరిగి తిరిగి ఆ రాత్రి గదిలోకి వచ్చిన అతనికి, ఎప్పుడు మంచంమీద పడిపోదామా అన్నట్లు వచ్చాడు. ముందు రాత్రి కూడా నిద్ర చాలకపోవడంతో అలాగనే నిద్రపోయాడు.
నాకు మాత్రం ఏమిటో మనసు గజిబిజిగా ఉంది. మన వివాహ వ్యవస్థ గూర్చి ప్రశ్నలు ముసురుతూనే ఉన్నాయి.
ఏ మాత్రం పరిచయం లేని ఇద్దరిని ఓ శుభ ముహూర్తంలో భార్యాభర్తలంటారు.
ఒకరికి ఒకరకంటే ఎటువంటి అవగాహన ఉండదు. ఒక్కొక్కసారి ఆలోచనల్లో ఎటువంటి పొంతనా ఉండదు. ఫిజికల్‌గా మెంటల్‌గా కంపాటబిలిటి ఉండదు.
అయినా చాలాభాగం సంసారాలు బాగానే సాగుతూ ఉంటాయి. మరి అందరూ సంతోషంగానే ఉన్నారా? నిజంగా?
ఒక కప్పు కింద ఉన్నంత మాత్రాన అందరూ సంతోషంగా ఉన్నట్లేనా లెక్క?
ఏమో! తమ ఇంట్లో అందరూ బయటికి బాగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. కనిపించనివేవో చిన్న చిన్న గొడవలు తప్ప చెప్పుకోతగ్గ రిగ్రెట్ ఎవరిలోనూ కనిపించేది కాదు.. ఇది ఎలా సాధ్యం. నిజంగా ఇది మంత్రాల మహిమేనా? నమ్మబుద్ధి కావడంలేదు.
ఆడవాళ్ళల్లో సర్దుకుపోయే గుణం వుండటమే కావచ్చు. కానీ, అది పూర్వపు ఆడవాళ్లకి వర్తిస్తుందేమోగాని, ఈ తరం వారికి కాదు.
మరి వాటన్నిటి మించినదేదో ఉంది మన పెళ్లిళ్లలో.
కమిట్‌మెంట్! అదే అయి ఉండాలి. లేకపోతే ఇంత విభిన్న మనస్తత్వాలతో కూడిన వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా నిలుస్తాయి?
మూడోరోజు- రఘు రోజంతా చాలా క్వైట్ మూడీగా ఉన్నాడు. సూట్‌కేసులో అన్నీ సర్దుకోవడం మొదలుపెట్టాడు. అతనితోనే అదే గదిలో ఉన్నా నాకు వాటి గురించి, అతనికి కావాల్సిన వాటి గురించి ఎక్కువ తెలియదు. ఎక్కువగా ప్రేక్షకురాలిగానే ఉండిపోయాను.
ఇంతలో క్రిందనుంచి నన్ను పిలిచినట్లనిపించి, క్రిందకు దిగి వెళ్లాను. మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు ఒక చేత్తో కాఫీ, మరో చేత్తో ఐరన్ చేసిన బట్టలతో పైకివచ్చాను.
గదిలో అడుగుపెట్టేటప్పటికి, రఘు నుంచుని ఉన్నాడు. చేతిలో వాళ్ళ ఫామిలీ ఫొటో ఉంది. దానివంకే తదేకంగా చూస్తున్నాడు. నేను గదిలో అడుగుపెట్టింది కూడా గమనించలేదు.
దగ్గరగా అతని మొహం చూడలేదు కాని, ఆ ఫొటో వంకే చూస్తున్న ఆ కళ్ళల్లో, సన్నటి నీటి తెర కూడా ఉందేమోననిపించింది.
ఇన్నాళ్ళు ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్‌మీద అమెరికా వెడుతున్నానంటే సరదాగా, సగర్వంగా అనిపించింది. ఇవాళ నిజంగా వెడుతున్నాను అనేది రియాలిటీ అయ్యేటప్పటికి ఒక విధమైన భయం, నెర్వస్‌నెస్ ఆవరిస్తోంది.
తను చాలా ఎదిగిపోయానని, తనకు ఇంక ఎవరితోనూ పెద్దగా అవసరాలు ఉండవు అనుకునే మనసు, ఒక్కసారి తన కుటుంబం వెనుక ఉన్నదీ అన్న ఊహ ఎంత బలాన్నిస్తుందో తెలుస్తోంది.

- ఇంకాఉంది