మంచి మాట

స్నేహం విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతాయుగంలో రాజ్యమేలిన రాముడు, చారిత్రిక పురుషుడుగా చరిత్ర ప్రసిద్ధికెక్కిన రాముడు, ఆదర్శజీవిగా ఉన్న రాముడు పురాణ పురుషుడు. ఆయన ఎదుటివారిని తానే ముందుగా పలుకరించేవాడట. పూర్వభాషి అన్న పేరు తెచ్చుకున్నాడు. అట్లాఅని ఆయన మితభాషి నే సుమా. ఎంత వరకు అవసరమో అంతే మాట్లాడేవాడట. ఎవరైనా తన గురించి మాట్లాడినా దేని గురించియైనా చెప్పినా పూర్తిగా వారు చెప్పేదంతా వినేవాడట. అందుకే ఆయన్ను వినయభూషణుడని అన్నారు. అవతలవారు చెప్పేదంతా వింటే గాని వారు ఏమి చెబుతున్నారో ఎందుకు కోసం చెబుతున్నారో తెలియదు. మొదట రెండుమాటలు పలుకగానే నాకు నాకు తెలుసు తెలుసు అంటే లేక అహంకారంతోనో, అలసత్వంతోనో వినకపోతే అవతల వారు ఏమి చెబుతున్నారో తెలుసుకొనే అవకాశమే కాదు. వారితో స్నేహసంబంధాన్ని గూడా వదులుకునే పరిస్థితులు వస్తాయ. ధనబలమున్నా, కండబలమున్నా, అంగబలమున్నా తనను మించిన వారు లేరని విర్రవీగేవారికి పతనం వారి దరిదాపుల్లోనే ఉంటుంది. అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉన్నట్లే అంతా తెలిసినా ఇంకా ఎంతో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవారు అందరిచేత ప్రశంసించబడుతారు. అట్లానే ఎదుటివారిని తక్కువగా అంచనా వేయకూడదు. అందరిలోను ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని వెలికి తెచ్చి వారిని మంచివారిగా నిలబట్టగలిగితే వీరిలో ఉన్న నాణ్యత వెలికివస్తుంది. సృష్టిలో పనికిరాని వస్తువు అంటూ ఏమీ లేదు. ప్రతిదీ ఏదో ఒక వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. ఒకరికి ఉన్న ప్రజ్ఞ మరొకరికి లేకపోవచ్చు. కాని ప్రతివారిలోను ఏదో ఒక నేర్పు ఉండనే ఉంటుంది. మనుషులందరిలోను మంచి చెడు గుణాలు ఉంటాయ. సజ్జనులు మంచిగుణాలను మాత్రమే ఎక్కువగా ప్రదర్శించి చెడు ఆలోచన్లు కలిగి నపుడు వాటిని నియంత్రించి వాటిని ఆచరణలోకి తేకపోవడం వల్లనే సజ్జనులుగా కీర్తించబడుతారు. ఆలోచనలు ఎన్నైనా వస్తాయ. మనసు అతి చంచలమైనది కనుక ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కాని వాటినన్నింటినీ ఆచరణలో పెడితే ఎటువంటి ఫలితాలు వస్తాయన్నది బుద్ధితో ఆలోచించి హృదయంతో చేసినపుడు మంచిని మాత్రమే చేయగలుగుతారు.
చెడు చేసినందువల్ల ఎదుటివారు మాత్రమే కాదు చేసినవారు కూడా ఎంతో కొంత బాధపడక మానదు. ఉదా. ఎవరినైనా తూలనాడినపుడు ముందు బాగున్నట్టు అనిపించినా చివరకు మనం ఎందుకు ఇంత కొరగాని మాటలు మాట్లాడాము అనో లేక ఎంత సమయాన్ని నష్టపోయామో అని కాని బాధ పడకుండా ఉండలేము. పైగా కోపం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. రక్తప్రసరణ లో మార్పులు జరిగి ఎన్నో అనారోగ్యాలు దరిచేరుతాయ. కోపం వల్ల వివేకం నశిస్తుంది. ఏమి చేస్తున్నామో తెలియక చేయవలసింది చేయక పనుల్లో జాప్యం జరిగి కావాల్సిన పొందవలసిన ఫలితాలను పొందే అవకాశాన్ని కోల్పోతారు.
కనుక ఏవిషయం అయనా, ఎవరితోనైనా ఎంత వరకు మాట్లాడాలో ఏమి మాట్లాడాలో ముందే నిర్ణయంచుకోవాలి. చెడు ఉద్దేశం ఉన్నవారిని దగ్గరకు రానివ్వకూడదు. వారితో ఎలాంటి వివాదాలు చేయకూడదు. ఎంత వారికి దూరంగా ఉంటే అంత మంచిదనుకోవాలి. జ్ఞానవంతు లతో నైనా మాట్లాడవచ్చు. వివేకమే లేనివారితో నైనా మాట్లాడవచ్చు. కాని మిడిమిడి జ్ఞానం ఉన్నవారితో మాట్లాడకూడదు అనే మాటలోని ఆంతర్యం ఇదేనన్నమాట.
సజ్జనులతో స్నేహం వెలుగుతున్న దీపంతో పోలుస్తారు. రామచరిత్ మానస్ రచించిన తులసీదాసు పరుసవేది ఇనుమును బంగారంగా మార్చినట్లుగా మంచివారు చెడ్డవారిని కూడా మంచివారుగా మారుస్తారని సజ్జన స్నేహం వల్ల శుభాలు కలుగుతాయని, మల్లెలు కట్టిన గుడ్డకు ఎలా మల్లెల వాసన సోకుతుందో సజ్జనుల సుగుణాలు దుర్జనులకు కూడా వస్తాయని అంటారు. సజ్జనుల సాంగత్యమహిమను త్రిమూర్తులుకూడా వర్ణించలేరని అంటారు. అందుకనే సజ్జన స్నేహం విలువను గ్రహించి సజ్జన స్నేహాన్ని మాత్రమే చేయాలి. అపుడే మనసు బుద్ధి సరియైన తోవలో నడుస్తాయ.ఎవరితో ఎలా ఉండాలన్న విషయం అర్థం అవుతుంది.

- కె. యాదయ్య