మంచి మాట

రక్షణ కవచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామనామము కల్పవృక్షము. ధర్మార్థ కామ మోక్షములనిచ్చునది, శంకరుడు సైతము రామనామానే్న పరమావధిగా ఎంచుకున్నాడు. తెలిసిన వారికైనా, తెలియని వారికైనా రామనామం మంచిని మాత్రమే కలుగచేస్తుంది. సద్భావనలు ప్రేరేపిస్తుంది. సజ్జనులను దరిచేరుస్తుంది. సజ్జనసాంగత్యానికి దారి చూపుతుంది. ఇప్పటివరకు చేసిన కలుషితమై న చర్యలను కాలరాస్తుంది. ఎన్నో జన్మల నుంచి సంచితంగా వస్తున్న పాపరాశిని భస్మీపటలం కావిస్తుంది. మళ్లీ మళ్లీ దుశ్చర్యలను దురాలోచనలను కలుగనివ్వకుండా రామ అన్నశబ్దం రక్షిస్తుంది. అందు కే మహామంత్రమని, తారక నామమని, పరంధాముని సాయుజ్యానికి ధారి చూపుతుందని అనడంలోని ఆంతర్యమిదే.
ఒక్కరామ నామాన్ని పట్టుకుంటే చాలు ఏ ఒక్కరు పట్టుకున్నా వారి వంశంమంతా రక్షించబడుతుంది. రామ అని ఒక సారి పిలిస్తే రామ పరివారం అంతా ఫరుగెత్తుకు వస్తుంది.అందులో ముఖ్యంగా హనుమంతుడు ముందు ఉంటాడు. రామ అన్న శబ్దం వినిపించగానే కన్నీరు కారుస్తూ రామభక్తులకు సదా సేవ చేస్తానని హనుమన్న వస్తాడు. తన పనుల ద్వారా, తన శీలంద్వారా, తన నడవడి ద్వారా ఆదర్శప్రాయమైనవాడు ఆ హనుమంతుడే. రామనామాన్ని జపించని వారు జనన మరణ చక్రమునందు ఇరుక్కొని దుఃఖభాజనులవుతారు. భవబంధాల్ని త్రెంచుకొనుటకు రామనామమే సులభోపాయంగా కనిపిస్తుందని పండితులు పామరులు అనుభవపూర్వకంగా చెప్తారు. రామనామానికి మించిన పతిత పావన శక్తి మరియొకటి లేదు. మనసా!అంటూ ఎందరో గాయకులు వేనోళ్లతోరామనామ గొప్పతనాన్ని ఉపదేశిస్తున్నారు.
రామనామాన్ని జపిస్తే సమస్త సుఖములు చేకూరును. రామనామము చలికి అగ్నివంటిది. దాని స్పర్శనుండియే కలిపురుషుడు తన పరివారంతో సహా దూరమై పోతున్నాడు. అంధులకు నేత్రాలవంటిది రామనామం. భవసాగరము దాటుటకు సేతువై ముక్తికి హేతువై నిలిచి ఉన్నది ఒక్క రామనామమే. ఇహలోకంలో సుఖాలను పొందుటకు రామనామమే దిక్కు. పరలోకంలో సుఖాలను పొందుటకు కూడా రామనామమే దిక్కు.అందువలనే కాశీక్షేత్రంలో చనిపోతున్నవారి చెవిలో రామతారక మంత్రాన్ని శివుడు ఉపదేశిస్తాడు. ఇంతటిశక్తిశాలియైన రామనామమను కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే ఇహపర సౌకర్యాలను పొందుతాయని అనడంలో అంతరార్థం ఇదే. రామనామంలో మాధుర్యం కనుగొన్నాడు కనుకనే విభీషణుడు రామపాదదాసుడైనాడు. గోపన్న రామనామగొప్పతనం తెలుసుకొన్న వాడు కనుకనే రామదాసుగా మారిపోయాడు శబరి ఎన్నో యేండ్లు తపస్సు చేసి రాముని కనులారా గాంచి మంచి మాగిన పండ్లను ఏరుకొని వచ్చి మాధుర్యాన్ని ముందుగానే చూచి ఆ రామునికి పెట్టడంలోని ఆంతర్యమిదే రామనామమే ఇంత మధురమైతే రామదర్శనం ఇంకెంత అధికఫలమో కదా.
వాలి తన్ను సంహరించిన రాముడిని చూచి అమితానందపడుతూనే ఓ రామా నీవు ఇంతకుముందెపుడు నన్ను చూచి వుండలేదు.నీకు నాకు వైరమున్న సూచనయేలేదు. నేను వనచరుడను. నీవు నగరజీవివి. అట్లాంటి నీవు నన్ను వధించావు. భార్యను దూరం చేసుకొన్న నీవు ఇంతటి శక్తి శాలివయ్యఉండి కూడా సుగ్రీవునితో స్నేహం చేసావంటే నీలో ధర్మమూర్తి నాకు కనిపిస్తున్నాడు. ఆ రావణాసురుణ్ణి నేను ఒంటి చేత్తో పట్టివ్వగలనని తెలిసీ కూడా నన్ను సంహరించి సుగ్రీవునికి నీ చేదోడు అయ్యావంటేనే నీలోని ధర్మమూర్తి నాకు కనిపిస్తున్నాడని వాలి అన్నాడంటే రాముడే పోతపోసిన ధర్మమూర్తి కనుక రాముని పాలనలో జారులు, చోరులు, కల్లలాడే వారు నిలువలేక పోయేవారట. రాముని రాజ్యంలో అవిద్య మచ్చుకు కూడా వుండేది కాదట. అక్షరాస్యత లేనివారు అంటూ ఎవరూ వుండేవారు కారు. సోమరులు, పందలు కూడా వుండేవారు కారు.దీనికంతా కారణం రామునిలో ధర్మపరిపాలనయే. కనుక ధర్మాన్ని ఆచరిస్తే ధైర్యం, సైర్థ్యం వాటికవే వస్తాయ. శక్తి ఒనగూడుతుంది. దారిద్య్రం తోకముడిచిపోతుంది. అపజయం అన్నమాటఆరుఆమడల దాకా కూడా ఉండదు. ఇవన్నీ కలి యుగంలోను జరగాలంటే రామనామోచ్చారణతోపాటు ధర్మాచరణ కావాల్సిందే.

- ఎ. రాజమల్లమ్మ