మంచి మాట

భోగి పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిలో రంగ హరి అంటూ వచ్చే హరిదాసులు, జంగందేవరలు, సన్నాయ మేళంవారు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల వారు, పగటివేషగాండ్లు, తోలు బొమ్మలాటవారు, వీధిభాగోతం వారు, ఏకాపాత్రాభినయం అభినయంచేవారు ఇలా ఎన్నో సంప్రదాయ కళలను ఆవిష్కరించే రంగస్థలమే, కళావేదికనే పెద్దపండుగ. లోకులందరికీ అన్నం పెట్టే రైతన్న మహాదానందంతో తాను కష్టించి పండిన పంటను ఇంటికి తీసుకొచ్చే పండుగ సంక్రాంతి. బీదబిక్కి, పండిత పామరులు అన్న భేదం లేకుండా అందరూ కలసి సంతోషంగా జరుపుకునే పండుగే పెద్దపండుగ.పిల్లలంతా కలసి పక్షుల కోసం వరికంకులను వాకిళ్లకు కట్టి వాటికి విందుచేసే అపూర్వమైన సంతోషదాయక సమయమే సంక్రాంతి పర్వదినం.
ఈ పండుగను భారతదేశమంతా జరుపుకున్నా తెలుగులోగిళ్లలోని రెండు వాకిళ్లనిండా అందమైన ముగ్గులు పరిచి మధ్యలో గొబ్బెమ్మలను అలంకరించి రంగవల్లులనిండా రంగులు నింపి అందంగా ఆకర్షణీయంగా ఆహ్వానించే పండుగనే సంక్రాంతి. కొంగొత్త కాంతులను వెదజల్లే ఈ సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. భోగి రోజున రంగనాథుణ్ణి మెప్పించిన రంగనాయకి, ఆండాళ్ అమ్మవారు, విల్లి పుత్తూరు లోని విష్ణుచిత్తుని పట్టి గోదాదేవి రంగనాథుణ్ణి పరిణయమాడిన రోజు. నెలరోజులనుంచి తిరుప్పావైను అనుసం ధానిస్తూ వైష్ణవాలయాలన్నీ భోగి రోజున భోగపురుషుడు అలంకారప్రియుడైన రంగనాథునికి వివిధోపచారాలను నిర్వహిస్తూ పుంసాం మోహనరూపాయా అన్నట్టుగానే మహావిష్ణువును రంగనాథునిగా అలంకరించి అమ్మను చల్లని తల్లినిచ్చి అంగరంగవైభోగంగా గోదారంగనాథుల వివాహమహోత్సవాన్ని జరుపుతారు.
భోగి పొద్దునే్న పీడనివారణ కోసం భోగిమంటలు వేసి, వాటిలో పనికిరాని వస్తువులు, ఎండిన ఆకులు, కొమ్మలు వేసిమంటచేస్తూ ఆ చీడపీడలు విరగడైనట్లు భావించడం ఒక ఆచారం. సాయంత్రం పూట చిన్నపిల్లలకు బాలారిష్టాలు తొలగడానికి భోగిపండ్లు పోస్తారు. రేగుపండ్లు, చిల్లర నాణెలు, బొరుగులు, శనగపప్పు, కలిపి బోగిపండ్లు అంటూ పిల్లలకు కిసరు తీస్తారు. ఇలా చేయడం వల్ల దృష్టిదోషం దూరమవుతుందంటారు. కొత్తఅల్లుళ్లను కూతుర్లను పిలిచి నవధాన్యాలతో నవకాయపిండివంటలు చేసి పెడ్తారు. సాయంత్రం వేళ పేరంటం చేసి ముతె్తైదువులను పిలిచి వారికి నువ్వులుండలను, నానిన శనగలు పండు తాంబూలాలతో పాటు పసుపుకుంకుమలను పంచుకుంటారు. కొందరు బొమ్మల కొలువులుకూడా అమరుస్తారు. గోవర్థనపర్వతానె్నత్తి రేపల్లె వాసులను రక్షించాడని గుర్తుచేసుకొంటూ శ్రీకృష్ణుని పూజను చేస్తారీ భోగినాడు. తమిళనాడు ఇంద్రపూజలు చేస్తారు. మరికొందరు వామనావతారం తల్చుకుంటూ వామనపురాణాలు చదువుతారు.
సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశించటమే మకర సంక్రమణం లేక ‘సంక్రాంతి’. మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తరాభిముఖుడై, భూమిపైన ఉత్తరార్థ గోళంలో ప్రవేశిస్తాడు. సంక్రమణం రోజున శ్రీమద్భగవద్గీత పఠనం, గంగాస్నానం, గాయత్రి సంధ్యావందనం, తర్పణవిధిని ఆచరించడం, గోవిందనామ స్మరణంవంటివిఆచరిస్తే పునర్జన్మ వుండదని శాస్తవ్రచనం. సంక్రాంతిరోజున జానపద కళాకారులను, కర్మచారులను పిలిచి వారికి కొత్తబట్టలను పెట్టి వారిని గౌరవించడమూ ఆచారమే. సంక్రాంతి మూడోరోజున కనుమ పశుగణాలను పూజచేసే రోజుది. కనుమ రోజున కోడి పందేలు, పొట్టేళ్ల పరుగులు, ఆంబోతుల ప్రదర్శనకూడా చేస్తుంటారు. పశువులను కడిగి అలంకరించి వాటిని పూజించి సాయంత్రంవేళ ఎడ్లబండ్లకు కట్టి ఊరు ఊరంతా తిప్పుతారు. దీన్ని బండ్లు తిప్పే పండుగ అనీ అంటారు. జాజు, సున్నం పట్టీల అలంకరణతో ఈ బండ్లు ఎంతో కన్నుల పండువుగా కనిపిస్తాయ. దానాదికార్యాలు, కళాసంస్కృతుల పరిరక్షణ చేయాలని చెప్పే సంక్రాంతి సామాజిక బాధ్యతను గుర్తుచేస్తుంది. త్యాగమనే గొప్పగుణాన్ని అలవర్చుకునే వీలును కలిగించే పర్వమే సంక్రాంతిపండుగ.

- చరణ శ్రీ