డైలీ సీరియల్

పూలకుండీలు- 44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి మీరు నాకోసం సంబంధాలేం వెతకొద్దు. నావల్ల నీలూ పెళ్లి ఆలస్యం అవుతుందనుకుంటే దానికి చేసెయ్యండి నాకేం అభ్యంతరం లేదు. అయినా జీవితానికి పెళ్ళొక్కడే పరమావధి అన్నట్టు మాట్లాడతారేంటి? ఇప్పుడిప్పుడే నేను పెళ్లి చేసుకోను. ఏది ఏమైనా నేను ఖచ్చితంగా అమెరికా వెళ్లి ఎం.ఎస్. చెయ్యాల్సిందే’’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పింది.
‘‘అంటే మా ఇష్టా ఇష్టాలతో నీకు సంబంధం లేదంటావా? చిన్నప్పటినుండి నీకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ నువ్వే నిర్ణయాలు తీసుకున్నావా? కన్నబిడ్డకు సంబంధించిన ప్రతి విషయంలో మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే తల్లిదండ్రులు తీరా పెళ్లి విషయం దగ్గరకొచ్చేసరికి పనికిరాకుండా పోతారా! ఈ కాలం పిల్లలందరికీ ఇదో ఫ్యాషనైపోయింది’’ ఇరవై రెండేండ్లుగా కంటికి రెప్పగా కాపాడుకుంటూ వచ్చి అడిగిందల్లా సమకూర్చి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా తమ అనుభవాన్ని, పెద్దరికాన్నీ తృణీకరిస్తూ మాట్లాడ్డంతో బాణం దెబ్బతిన్న పక్షుల మాదిరిగా కదిలిపోతూ అన్నారు అనిత తల్లిదండ్రులు.
‘‘మీ పెద్దరికాన్ని నేను కాదనడంలేదు. అలాగని నా పెళ్లి విషయంలో కూడా మీరే నిర్ణయం తీసుకుంటానంటే మాత్రం ఒప్పుకునేది లేదు’’ మరింత నిక్కచ్చిగా తేల్చి చెప్పింది అనిత.
అనిత మాట తీరుకు మరింతగా కుంగిపోయిన తల్లిదండ్రులు ‘‘ఒకవేళ నీకు నచ్చినవాడు, నీకు పరిచయమైనవాడు ఎవరన్నా వుంటే పోనీ అదన్నా చెప్పు, కులగోత్రాలు కూడా చూడకుండా అతనికే ఇచ్చి పెళ్లి చేస్తాం. ఆ తరువాత అతనికిష్టమైతే అమెరికా కాకుంటే ఆస్ట్రేలియా వెళ్ళు, మాకేం అభ్యంతరం లేదు’’ అంటూ వాళ్ళూ అంతే పట్టుదలగా మాట్లాడారు.
‘‘మీరనుకుంటున్నట్టు నాకలాంటి పరిచయాలేం లేవు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా చెబుతాను’’ అంటూ ముక్తసరిగా బదులిచ్చింది అనిత.
ఈ వాదాల మధ్యనే హైదరాబాద్ వెళ్లి జి.ఆర్.ఐ కోచింగ్ తీసుకున్న అనిత ఫస్ట్ ఎటెంప్ట్‌లో క్వాలిఫై కాలేకపోయింది. అయినా సరే అక్కడే వుండి ఓ డిగ్రీ కాలేజీలో పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీగా చేరి మళ్లీ టెస్ట్ వ్రాసి క్వాలిఫై అయింది.
అనిత పట్టుదలను గమనించిన మేనమామలు అక్కా బావలను ఒప్పించి చివరికి ఎమ్.ఎస్ కోసం అమెరికా పంపించారు.
అలా అమెరికా చేరుకున్న అనిత మొదటి సంవత్సరం పూర్తిచేసింది.
ఈమధ్యే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జూనియర్ ప్రోగ్రామర్‌గా చేరింది.
చూస్తుండగానే రెండు శీతాకాలాలు ఇట్టే గడిచిపోయాయి.
కిషోర్, అనితల ఎం.ఎస్.లు పూర్తయ్యాయి.
ఈ రెండేళ్లలో అనిత, కిషోర్‌ల పరిచయం కాస్తా వయసు అడ్డంకులను కూడా అధిగమించి ముందుగా స్నేహనికి స్నేహం నుండి క్రమంగా ప్రేమలోకి దారితీసింది.
ఆ ప్రేమ చివరికి సహజీవనం కొనసాగించే స్థాయికి చేరుకుంది.
అలా కొంతకాలం గడిచిన తరువాత కొద్దిమంది స్నేహితుల సమక్షంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యేంతవరకు ఈ విషయాలెవీ ఇరువైపులా పెద్దవాళ్ళకూ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
అనిత జూనియర్ ప్రోగ్రామర్‌గా చేరి మంచి పెర్‌ఫార్మెన్స్ చూపిస్తుండడంతో కంపెనీ వాళ్ళు వెంట వెంటనే ప్రమోషన్స్ ఇస్తూ వచ్చారు. తనిప్పుడు సీనియర్ టీమ్ మేనేజర్‌గా చేస్తుంది.
అదే కంపెనీలో ప్రోగ్రామ్ ఎనలిస్ట్‌గా చేరిన కిషోర్ కూడా మంచి ఔట్‌పుట్ చూపించడంతో అతణ్ణి ప్రమోషన్ మీద వాషింగ్టన్ డిసిలో వున్న ఇంకో బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఆ విధంగా అనిత, కిషోర్‌లు ఎడమయ్యారు.
ఒక ఊళ్ళో ఒక ఆఫీసులో పనిచేసేటప్పుడే వాళ్ళిద్దరూ ఇంట్లో కలిసుండే సమయం చాలా తక్కువగా వుండేది. ఎందుకంటే ఇద్దరిదీ చెరో టీమ్. ఎవరి ప్రాజెక్టు వాళ్ళదే. ఎవరి పని ఒత్తిడివారిదే. ఇంటిసోయి, వంటిసోయి ఆఖరికి కడుపుకింద తిండి సోయి కూడా లేకుండా ప్రాజెక్టులతో కుస్తీలు పడుతుంటారు.
ఇంక్రిమెంట్లు, వీకెండ్ పార్టీలకు బానిసల్లా మారిపోయి రోజుకు పనె్నండు గంటలకుపైగా గోడలమీద బల్లుల్లా కంప్యూటర్లకు అతుక్కుపోయే వాళ్ళు. ఆ పని వత్తిడిలో నెల మొత్తంలో ఏకాంతంగా గడిపే అవకాశం ఒకటి, రెండు రోజుల కంటే ఎక్కువగా వాళ్ళకు దొరికేది కాదు.
దొరికిన ఆ ఒకటి, రెండు రోజులు నెల రోజుల పని ఒత్తిడికి అలిసిపోయి ఒకే బెడ్‌మీద వున్న రెండు శవాల మాదిరిగా గంటలకు గంటలు నిద్రపోయేవాళ్ళ. చివరికి వాళ్ళు తామిద్దరం భార్యాభర్తలం, తాము తీర్చుకోవాల్సిన కొన్ని శారీరక అవసరాలుంటాయి. వాటిని తీర్చుకోకపోతే అది క్రమంగా ఇరువురిమధ్య ఉండే సున్నితమైన భావ ప్రకంపనల ఆవిరికి దారితీసి, బ్రతుక్కి అర్థమే లేకుండా పోతుందన్న స్పృహను కూడా కోల్పోయేటంతవరకొచ్చింది.
అసలే నానాటికీ పలుచబారుతున్న అనిత, కిషోర్‌ల దాంపత్య బంధం సంతాన బంధం కూడా లేకపోవడంతో కిషోర్ ట్రాన్స్‌ఫర్ కారణంగా అది మరింత పలుచబారసాగింది.
మొదట్లో ‘‘ఇప్పుడే పిల్లలు కలిగితే మన కెరీర్‌కి వాళ్ళో పెద్ద ఆటంకంగా మారిపోతారు. మనకిప్పుడిప్పుడే పిల్లలు వద్దు’’ అన్న అనిత ఆలోచన వాళ్ళకు పిల్లలు కలగకపోవడానికి కారణమైంది. అది అనేక అనర్థాలకు కారణమైంది.
ఇప్పడు అనిత అభిప్రాయాన్ని కిషోర్ కూడా ఆమోదించాడు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు