డైలీ సీరియల్

ఒయాసిస్ 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రేమ వివాహమే. పెళ్లికి కూడా వెళ్ళాను. ఆయన సంపన్న కుటుంబానికి చెందినవాడు. రాజకీయాల్లోనూ, చిన్న వయసులోనే పెద్ద పదవులు చేపట్టి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత ఆ నర్సింగ్ హోం కట్టించాడు. ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెట్టారు. అసలే ఉన్నవాళ్లు.. రాజకీయాల్లోనూ బాగానే సంపాదించాడు. నర్సింగ్ హోం, కాలేజీ.. అన్నీ బాగా కలసి వచ్చాయి..’’ అని చెప్పింది.
‘‘శే్వతగారి తరఫున బంధువులు ఎవరూ లేరా? తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, బ్రదర్సూ..’
‘‘శే్వత తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి ఏదో చిన్న ఉద్యోగం చేసేది. భర్త చనిపోయాక, ఆయన ఆఫీసులోనే కాంపాషినేట్ గ్రౌండ్స్ మీద చిన్న ఉద్యోగం వచ్చింది. నిజానికి శే్వతను పెద్ద చదువులు చదివించగల స్తోమత ఆమెకు లేదు. బంధువులు, తెల్సినవాళ్ళు ఆదుకున్నారు.. ముఖ్యంగా శే్వత పట్టుదల, చదువుపట్ల గల ఆసక్తి కొంతమంది బంధువులు ఆదుకునేలా చేసేది. చాలా కష్టపడి చదువుకుంది కాబట్టే ఎంత కష్టపడి రూపాయి వస్తుందో శే్వతకు తెల్సు. అప్పటినుంచే డబ్బు పట్ల ఎంతో శ్రద్ధ చూపేది. ఎంత కష్టపడిందంటే, తెల్సిన వాళ్లింట్లో ఒకామెకు పక్షవాతం వచ్చి లేవకపోతే, శే్వత వెళ్లి కుడి, ఎడమ అని చూసుకోకుండా ఆమెకు సేవ చేసింది. కేవలం డబ్బు కోసం.. దేవుడు శే్వతకు అన్ని కష్టాలు పెట్టినా, అందమైన రూపం ఇచ్చాడు. అదే ఆమెకు వరం. అహోబలరావు దృష్టిలో పడటంతో జాతకం తిరిగి తిరిగిపోయింది. ఊహించని స్థితికి వెళ్లింది. ఈమధ్యనే ఆమె తల్లి కూడా చనిపోయింది..’’
‘‘అహోబలరావుగారికీ, శే్వతగారికీ- మధ్య అనుబంధం ఎలా వుండేది?..’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఏం? బాగానే ఉన్నారు. దేవ వర్ హాపీ..’’ అన్నది రోహిణి.
‘‘సంతానం కలగలేదన్న లోటు ఏమన్నా ఉండేదా?’’
‘‘ఆ.. విషయంలో వాళ్లింకా తొందరపడలేదనుకుంటాను.. ఈ రోజుల్లో చాలామందికి ఆ వయస్సు వాళ్లు పెళ్లి కూడా చేసుకోవటంలేదు..’’ అన్నది రోహిణి.
‘‘శే్వత అందమైన అమ్మాయి కదా. ఆమె ప్రేమ వ్యవహారాలేమన్నా మీ దృష్టికి వచ్చాయా?’’’
‘‘స్టూడెంట్స్ అందరూ ఫ్రెండ్లీగానే ఉంటుంటారు. అబ్బాయిలు, అమ్మాయిలు సరదాగా తిరుగుతుంటారు. అవసరమైనప్పుడు చిన్న చిన్న విషయాల్లో హెల్ప్ చేసుకుంటుంటారు. ఫ్రెండ్స్‌లాగా మూవ్ అవుతుంటారు గదా..’’’
‘‘శే్వతకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేవారా?’’
‘‘క్లోజ్ ఫ్రెండ్స్ అంటే... అందరూ క్లోజ్‌గానే ఉండేవారు.. కొంతమంది కొన్ని విషయాల్లో ఒకళ్ళతో ఒకళ్లు పోటీ పడుతుంటారు.. దట్సాల్ హెల్డీ కాంపిటీషన్..’’
‘‘శే్వతతో పోటీపడ్డ మేల్ డాక్టర్ ఎవరన్నా ఉన్నారా?’’
‘‘శే్వతతో డాక్టర్ హేమంత్ చనువుగా వుండేవాడు. కానీ పెళ్లి తర్వాత కూడా వాళ్ళు మంచి ఫ్రెండ్స్‌గానే ఉండేవాళ్ళు. ఏదో ఒక సెమినార్‌కి ఇద్దరూ స్టేట్స్‌కి వెళ్లొచ్చారు.. బట్.. ఐ డోంట్ థింక్.. ఎనీథింగ్ రాం విత్ దెమ్. హేమంత్ ఈజే వెరీ నైస్ బాయ్.. మా కాలేజ్ స్టూడెంట్ కదా అతను కూడా..’’ అన్నది రోహిణి.
‘‘ఇంకా ఏమన్నా చెబుతారా శే్వతగారి గురించి..’’
‘‘మీరేదన్నా అడిగితే నాకు తెల్సిన విషయం ఏమన్నా ఉంటే చెబుతాను..’’ అన్నది రోహిణి.
‘‘వాళ్ల జీవితం అంతా సంతోషంగా, ఆనందంగా గడిచిపోతుంటే, హఠాత్తుగా శే్వతగారు ఇలా హత్యకు గురి కావటానికి కారణం ఏమిటంటారు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘నాకూ ఇదొక మిస్టరీగానే ఉంది. ఎంతో కసి, కోపం ఉంటేగానీ అంత ఉన్మాదానికి ఎవరూ దిగరు... శే్వతకు అంత పెద్ద శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను..’’ అన్నది రోహిణి.
‘‘సో.. ఐ విల్ టేక్ లీవ్.. ఇంతకీ మీరు అశ్వినీ హాస్పిటల్‌కు తరచూ వెళ్తుంటారా?’’’
‘‘లేదండీ.. శే్వతకు నా దగ్గర చనువు ఎక్కువ.. ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం కాంప్లికేటెడ్ కేసు ఉంటే పిలుస్తుంటుంది. వెళ్లొస్తుంటాను..’’’
‘‘వారానికి ఒకటి రెండుసార్లు వెళ్తుంటారా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘లేదండీ.. నాట్ సో ఫ్రీక్వెంట్లీ..’’ అన్నది రోహిణి.
అంతకన్నా ఎక్కువ చెప్పటం ఆమెకు ఇష్టం లేదని రణధీర్ గ్రహించాడు.
అవసరమైతే మళ్లీ కలుస్తానని చెప్పి, రణధీర్ బయటకు వచ్చాడు.
రణధీర్ ఆఫీసుకు వచ్చేటప్పటికి నలుగురు మనుషులు వరండాలో నిలబడి ఉన్నారు.
రూంలోకి వెళ్లి కూర్చున్నాక రాజు వచ్చి చెప్పాడు. అశ్వినీ హాస్పిటల్ దగ్గరున్న పేదల కాలనీలోని వాళ్ళు వచ్చారని. రణధీర్ వాళ్లని లోపలికి పిలిపించాడు.
‘‘మీలో ఎవరి భార్య ఆ రోజు హాస్పిటల్ ముందు కాన్పు అయి చనిపోయింది?..’’ అని అడిగాడు.
‘‘నా భార్య అండి..’’ అన్నాడొక యువకుడు.
‘‘నీ పేరు?’’
‘‘సాంబయ్యండి...’’’
‘‘ఏం చేస్తుంటావు?’’
‘‘ప్లంబర్ అండి..’’
‘‘ఆ రోజు అసలేం జరిగింది సాంబయ్యా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘రేత్తిరి పది గంటలప్పుడు సారూ.. నా భార్యకు నొప్పులొచ్చాయి. ఇంకా ఒక వారం పట్టుద్దనుకున్నాం. కానీ అనుకున్నదానికన్నా ముందే ప్రసవం అవుతుందని తెల్సి, అప్పటికప్పుడు ఆస్పతాల్‌కి తీసుకెళ్లాం.. ఆటలో.. నా దగ్గర డబ్బుల్లేవు. సుట్టుపక్కల ఉన్నోళ్లు కూడా పేదోళ్లే. డబ్బు లేకపోయినా ఆళ్లకి మానవత్వం మంచితనం ఉన్నాయి.

- ఇంకాఉంది

శ్రీధర