భక్తి కథలు

హరివంశం - 44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంధువులూ, వివిధ దేశాల శ్రీమంతులైన సాటివారూ, ఆమెను తమ కోడలిగా చేసుకుందామని ఉవ్విళ్ళూరుతున్నారు. పడుచు గోపాలురు తమ అదృష్టాన్ని నిరీక్షించుకుంటున్నారు. పరీక్షించుకుంటూ ఉన్నారు. కాని వాళ్ళ ఆశలు నెనరవేరలేదు.
ఇది ఇట్లా ఉండగా తారకామయం పేరిటి దేవాసుర ఘోర యుద్ధంలో దేవదేవుడి చక్రాయుధ నిహతికి మడిసిన కాలనేమి కొడుకులు ఏడుగురు శౌరిపై పగ సాధించటానికి కుంభకుడి ఆలమందలో ఏడు ఆబోతులై పుట్టి శౌరి మేనమామ ఈ కుంభకుడు, వీళ్ళ ఇంటికి వెన్నుడు ఎప్పుడో రాకమానడు. అట్లా రాగానే మీద పడి పొడిచి చంపివేయాలని సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇట్లా దురాలోచనలలో నిమగ్నులై శ్రీకృష్ణుడు ఇక్కడకు త్వరగా వచ్చే ఉపాయం ఆలోచించారు. ఇక్కడి జనులను, పశువులను క్రూరంగా గగ్గోలు పరిస్తే, హింసిస్తే అతడు మేనమామ ఇంటికి వెంటనే వస్తాడని వాళ్ళు తలచారు. ముందుగా పశువుల మందలలో చేరి వాటికి ఉత్పాతాలు కలిగించారు. దూడలను, ఆవులను పొడిచి చంపటం సాగించారు.
ఆబోతులను ఎదుర్కొని అవి తోక ముడిచి పారిపోయేట్లు విజృంభించారు. పశుల కొష్టాలలో దూరటానికి ఈ ఆబోతులకు కంచెలు ఆటంకం కాలేదు. నీటిలో తాబేళ్ళు ఎంత సులభంగా ఈదుతాయో, అంత చడీ చప్పుడూ లేకుండా ఈ రాక్షసపు ఆబోతులు పశువుల కొష్టాలలో ప్రవేశించగలిగేవి. వాటిని పట్టి బంధించాలని చుట్టుముట్టే ఎటువంటి బలశాలురను అవి లెక్క చేసేవి కావు. గోడలను కూడా అవి అవలీలగా లంఘించి ప్రజలను భయభ్రాంతులను జేసేవి. పంట పొలాలకు కాపున్న వాళ్ళను చంపి వేసి పంటనంతా నాశనం చేసేవి. పచ్చపైరులన్నిటినీ మొక్క కూడా మిగలకుండా తినివేసేవి. కృషీవలురు ఈ ఆబోతులు పెట్టే బాధలు ఓర్చుకోలేక పోయినారు. అందరూ విదేహ రాజ్యాధిపతి కొలువుకు వెళ్లి దీనంగా మొరపెట్టుకున్నారు. కుంభకుడి మందలలో పొగరుపట్టిన ఆబోతులు మా పొలాలన్నింటినీ బీడు చేస్తున్నాయి. ఒక్క గింజ కూడా ఇంటికి చేర్చుకునే విధంగా కనపడటంలేదు. యముడే వచ్చినా వాటినేమీ చేయలేడేమో నన్నంత భీకరంగా ఆ ఆబోతులు చెలరేగిపోతున్నాయి.
ఇక మాకు దిక్కూ దెసా కనపడటంలేదు. ప్రభువులవారు మమ్ముల్ని ఆదుకోవాలని అని వాళ్ళు ఆ మిథిలాపధిపతికి మొరపెట్టుకున్నారు. అపుడు మిథిల ప్రభువు కుంభకుడిని తన కొలువుకు పిలిపించుకున్నాడు. నీవేమో పెద్ద హోదా కల మాన్యుడవు. నిన్ను తప్పపట్టానికి నాకు మనస్కరించడంలేదు. నేరారోపణ అసలు చేయలేము. వాటిని ఏదో విధంగా బంధించే ఏర్పాటుచేయాలి. శిక్షించాలి. అట్లా వాటిని నియంత్రించటం సాధ్యం కాకపోతే, గోజాతిని హింసించటానికి ఇష్టపడకపోతే వాటిని అరణ్యంలోకి తరిమివేయాలి. నీకు పెద్ద బంధు బలగమున్నది. ఎందరో పోటుబంట్లు నీ అధీనంలో ఉన్నారు.
ఈ ఆబోతులను కట్టడి చేయటం నీకు సాధ్యం కాకపోదు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదు. ఈ పని సాధించకపోతే మాత్రం నీకు మాట వస్తుంది అని రాజుగారు కుంభకుణ్ణి హెచ్చరించి పంపివేశాడు. కుంభకుడు తన పల్లె చేరి చాలా బలశాలురైన వారిని నియోగించి ఆంబోతుల నెట్లానైనా బంధించాలని చాలా ప్రయత్నాలు చేశాడు. వాళ్ళు ఆ ఆబోతులను పట్టి బంధించే నేర్పులు ఎన్నో ప్రయోగించారు. మాయా కందకాలు తవ్వారు. పదిమంది ఒక్కొక్క ఆబోతు చుట్టు చేరి పగ్గాలు విసిరి బంధించేవాటిని పడవేసే యత్నాలు సాగించారు.
ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు