Others

నైతిక విలువల పతనానికి కారకులెవ్వరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో నైతిక విలువలు నానాటికి పతనం అవుతున్నాయని అందరూ ఆవేదన వ్యక్తం చేసేవారే తప్ప, విలువలు దిగజారిపోవడానికి తాము కూడా కారణమనే విషయాన్ని గుర్తించకుండా ‘గురివింద’లా వ్యవహరిస్తుండటం గమనార్హం. గురివింద తాను మొత్తం ఎర్రగా ఉన్నానని విర్రవీగుతుంది. అయితే, తన అడుగు భాగంలో ఉన్న నలుపు సంగతి మరిచిపోతుంది. ప్రస్తుతం మనం కూడా అలాగే వ్యవహరిస్తున్నాం అనడంలో సందేహం లేదు. పిల్లలు అన్ని విషయాలలో తమ తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఇతర పెద్దల్ని అనుకరిస్తారు. పిల్లలు అనుకరణ ద్వారానే అన్ని నేర్చుకొంటారు. పిల్లల్లో ఆధ్యాత్మికత అనేది కూడా అనుకరణ ద్వారానే ప్రారంభం అవుతుంది. తండ్రి దేవతార్చన లేక ప్రార్థన చేసేవాడు అయితే, పిల్లలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తారు. అమ్మవారి వద్ద కూర్చొని దీపం పెట్టే తల్లిని కూతురు అనుకరిస్తుంది. మతం ఏదైనా, కులం ఏదైనా ఆధ్యాత్మికతకు మొదటి బడి తల్లి బడి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకొంటారు. తమ పిల్లలలో థార్మికపరమైన భావాలు పెంపొందించాలంటే, మొదట తల్లిదండ్రులు వాటిని అనుసరించాలి.
పిల్లల్లో ఆధ్యాత్మిక భావన కలిగినపుడు వారికి విలువలు పాటించాల్సిన అవసరం ఏమిటో తెలుస్తుంది. తద్వారా పిల్లలు నైతిక విలువలు పాటిస్తారు. అప్పుడు సమాజంలో కూడా విలువలు, నైతికత అనేది పెరుగుతుంది. ప్రజలలో రాక్షస ప్రవృత్తి కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా తండ్రులు సప్త వ్యసనాలతో ఏదో ఒకదాని ద్వారా కృత్రిమ ఆనందాన్ని పొందటం, తల్లులు బుల్లితెరకు అంకితం అయితే, వారి పిల్లలు కూడా అదేవిధంగా మారతారు. దీనివలన పిల్లలకు నైతికత అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితులే నేడు సమాజంలో నైతిక విలువలు దిగజారిపోవడానికి ప్రధాన కారణం. ప్రియమైన తల్లిదండ్రులారా మీకోసం కాకపోయినా, మీ పిల్లలకోసం అయినా మీ జీవనశైలిని మార్చుకోండి. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటుకు సహకరించండి.

- పి.మస్తాన్‌రావు