జాతీయ వార్తలు

ఉత్తరాది రాష్ర్టాల్లో వరద బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి : కుండపోత వర్షాలకు ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ర్టాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. వారణాసి వద్ద గంగానది ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. అలహాబాద్‌లో చాలా చోట్ల నివాస ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించింది. మందాకినీ నది పొంగి ప్రవహిస్తుండడంతో అలహాబాద్‌, చిత్రకూట్‌ మధ్య రవాణాకు అంతరాయం కలిగింది. బీహార్‌లోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. వర్షాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 8 మంది మృతి చెందారు. సుమారు 56 గ్రామాలు నీట మునిగాయి. దీంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 67 మందిని ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది రక్షించింది. భక్షర్‌, భోజ్‌పూర్‌, పట్నా, శరణ్‌, వైశాలి, ముంగర్‌, భాగల్‌పూర్‌ జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. పట్నా, భాగల్‌పూర్‌ జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. రాజస్థాన్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.