వారం వారం గోచారం

వారం వారం గోచారం (30-9-2018 నుంచి 6-10-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలపై దృష్టి. ఆర్థిక నిల్వలపై ఆసక్తి. గృహ వాహన వ్యవహారాల్లో సంతృప్తి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల ఒత్తిడులుంటాయి. కార్యనిర్వహణలో సమర్థత. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. మంగళవారం సంప్రదింపులకు అనుకూలం. జన సహకారం లభిస్తుంది. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. బుధవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. ప్రయాణావకాశాలలు. గురువారం ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. పనుల్లో కొంత అసంతృప్తి. ఆలస్యం. సౌకర్య లోపాలకు అవకాశం. శుక్రవారం వ్యాపారాదుల్లో ఒత్తిడులున్నా గుర్తింపు లభిస్తుంది. శ్రమతో సౌఖ్యం. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. విందులు, విహారాలు పెట్టుబడులు సంతోషాన్నిస్తాయి. ప్రయాణావకాశాలు. సోమవారం వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. కార్యనిర్వహణ దక్షత. మంగళవారం కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. లాభాలు కోల్పోయే అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్త. బుధవారం పెద్దలతో సంప్రదింపులకు అవకాశం. ఇతరుల సహకారం లభిస్తుంది. అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. గురువారం సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త. పిల్లల కోసం కాలం ధనం వెచ్చించే సూచనలు. అసంతృప్తి ఉంటుంది. శుక్రవారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాట తీరులో స్ఫురణ శక్తి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీలు, వత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. పోటీ రంగంలో ఇబ్బందులకు అవకాశం. సోమవారం కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో తొందరపాటు కూడదు. నిల్వధనం కోల్పోయే అవకాశాలు. మంగళవారం భాగస్వామ్యాల్లో సమస్యలు. పరిచయాలు, అనుబంధాల్లో అనుకోని ఇబ్బందులు. ఊహించని సంఘటనలుంటాయి. బుధవారం అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలుంటాయి. గురువారం నిర్ణయ లోపాలకు అవకాశం. అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలు. అన్ని పనుల్లో జాగ్రత్త. శుక్రవారం సామాజిక గౌరవం కోసం ప్రయత్నం. సమస్యలను జాగ్రత్తగా చూడాలి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనుల బాధ్యతలు సంతృప్తినిస్తాయి. శ్రమాధిక్యం. దగ్గరి ప్రయాణాదులకు అవకాశం. సోమవారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ప్రయాణాదుల్లో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాదులు వద్దు. అసంతృప్తి ఉంటుంది. మంగళవారం సంప్రదింపులకు అనుకూలం. సహకారం ఆశించినట్లుగా అందదు. వార్త కలవరపెడుతుంది. బుధవారం పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో అనుకూలత. గురువారం అనుకోని సమస్యలకు అవకాశం. అనారోగ్య భావనలు. సంప్రదింపుల్లో జాగ్రత్త. సహకార లోపాలు. శుక్రవారం అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ అనుకూలత. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. మంచి వార్తలు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం ఉన్నత విద్య ఉద్యోగాదులపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉపాసనలకు అనుకూలం. కీర్తి ప్రతిష్టలు విస్తరించే స్థితి. ప్రయోజనాలుంటాయి. సోమవారం మానసిక వత్తిడులుంటాయి. విద్యారంగంలో శ్రమతో గుర్తింపు. సంతాన వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. మంగళవారం లాభాలపై దృష్టి వల్ల హోదా తగ్గిపోతుంది. ప్రయోజనాలు ఆశించినంతగా ఉండవు. గౌరవ లోపాలు. బుధవారం కుటుంబంలో సంతోషం. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. పదోన్నతులు. మాట తీరులో అనుకూలత. గురువారం సౌకర్య లోపాలకు అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ప్రయోజనాలు కోల్పోవచ్చు. ఒత్తిడులు. శుక్రవారం నిర్ణయాదులకు అనుకూలం. అన్ని పనుల్లో లాభాలుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యవహారాలలో సంతోషం. కొత్త పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యవహారాల్లో అనుకూలత. సోమవారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. సృజనాత్మకత లోపించే అవకాశం. బాధ్యతల్లో ఒత్తిడులు. మంగళవారం భాగస్వామ్యాల్లో ఇబ్బంది అధికం. పోటీ రంగంలో కొంత గుర్తింపు ఉంటుంది. వ్యతిరేకతలు అధికం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకతలపై విజయం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గురువారం కాలం ధనం వ్యర్థం కావచ్చు. పరామర్శలుంటాయి. భాగస్వామ్యాల్లో ఇబ్బంది. వ్యర్థమైన ప్రయాణాలు. శుక్రవారం లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులకు అనుకూలం. కుటుంబంతో ప్రయాణాలకు అవకాశం. నిల్వధనం విహారాలకు వినియోగించవచ్చు. మాట తీరులో అనుకూలత. సోమవారం అనుకోని సమస్యలు. తొందరపాటు వల్ల ప్రమాదాలకు అవకాశం. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. మంగళవారం నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కుటుంబంలో సమస్యలుంటాయి. బుధవారం అభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత. సంతానవర్గ సంతృప్తి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. గురువారం కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో లోపాలు. భాగస్వామ్యాల వల్ల జాగ్రత్తగా మెలగాలి. నిల్వధన లోపాలు. శుక్రవారం సౌకర్యాలపై దృష్టి. ఆర్థిక నిల్వలను పెంచుకునే ప్రయత్నం. వ్యాపార వ్యవహారాలపై దృష్టి. శనివారం సంప్రదింపులు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలుంటాయి. నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. సోమవారం సౌకర్య లోపాలు. ఆహార విహారాదుల్లో జాగ్రత్త. మాతృవర్గం నుండి సమస్యలుంటాయి. నిర్ణయ లోపాలుంటాయి. మంగళవారం ఉన్నత లక్ష్యాలపై దృష్టి. వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. అనేక కార్యక్రమాల ఒత్తిడులు, గుర్తింపు. బుధవారం శ్రమ ఉన్నా గౌరవం లభిస్తుంది. సామాజిక వ్యవహారాల్లో సంతృప్తి. ఉన్నత విద్యలు, ఉద్యోగాదులుంటాయి. గురువారం సేవక వర్గ సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్త. వృత్తిలో శ్రమతో గౌరవం. శుక్రవారం వ్యాపార వ్యవహారాల్లో పెట్టుబడులకు అనుకూలం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం వ్యతిరేకతలున్నా సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ఆహార విహారాల్లో అనుకూలత. సౌకర్యాలను పెంచుకుంటారు. గృహ వాహనాదుల్లో మంచి నిర్ణయాలుంటాయి. సోమవారం సౌఖ్యం కోసం వ్యర్థంగా కాలం ధనం వెచ్చించే అవకాశం. తొందరపాటు కూడదు. ప్రయాణ లోపాలు. మంగళవారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలు ఫలిస్తాయి. పోటీల్లో విజయం. బుధవారం ఉన్నత వ్యవహారాలుంటాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. వ్యవహారాలనుకూలత. గురువారం ఆశించిన లాభాలుండవు. పోటీ రంగంలో జాగ్రత్త. పెద్దల సేవ అవసరం. దానధర్మాల వల్ల మేలు. శుక్రవారం వ్యాపార వ్యవహారాల్లో లోపాలు. వ్యతిరేకతలు పెరిగే అవకాశం. సంతాన సమస్యలు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం లాభాలు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులుంటాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. ప్రణాళికలు. సోమవారం భాగస్వామ్యాల్లో ఒత్తిడుల వల్ల లాభాలు తగ్గిపోయే సూచనలు. పరిచయాలు. అనుబంధాల్లో జాగ్రత్త. మంగళవారం నిర్ణయ లోపాలు. తొందరపాటు కూడదు. వ్యర్థంగా పెట్టుబడులకు అవకాశం. విహారాలుంటాయి. బుధవారం సౌకర్యాల కోసం ఖర్చులు పెట్టుబడులుంటాయి. ఆహార విహారాలకు అనుకూలం. ప్రయాణాల్లో సంతోషం. గురువారం వ్యతిరేకతలు అధికం. నిర్ణయాదుల్లో మొండితనం పనికిరాదు. గుర్తింపు లభిస్తుంది. శ్రమాధిక్యం. శుక్రవారం సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. వ్యవహారాల్లో అనుకూలత.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు అనుబంధాలు విస్తరించే అవకాశం. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలుంటాయి. కొత్త పనులపై దృష్టి. దూర ప్రయాణావకాశాలు. సోమవారం సోదరవర్గ సహకార లోపాలు. సంప్రదింపుల్లో ఒత్తిడులు. వార్తలు కలవరపెడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. మంగళవారం అనుకోని సమస్యలు. వ్యాపార లోపాలు. ఊహలు అపోహలు మారే సూచనలు. లక్ష్యాలలో లోపాలు. బుధవారం పెట్టుబడుల్లో అనుకూలత. ధార్మికమైన ఖర్చులకు అవకాశం. ఆధ్యాత్మిక ప్రయాణాలుంటాయి. గురువారం కుటుంబంలో అననుకూలత. మాట తీరులో ఇబ్బంది. దానధర్మాల వల్ల మేలు. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించాలి. శుక్రవారం వ్యాపార లాభాలుంటాయి. స్ఫురణ శక్తి పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం అభీష్టాలు నెరవేరుతాయి. సంప్రదింపుల్లో సంతోషం. దగ్గరి ప్రయాణాలుంటాయి. నూతన కార్యక్రమాల నిర్వహణ. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. సోమవారం లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండదు. కమ్యూనికేషన్స్‌లో కొంత జాగ్రత్త. వార్తలు ఇబ్బంది పెట్టే సూచనలు. మంగళవారం సౌకర్యాలున్నా సంతోషం ఉండదు. సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. బుధవారం గౌరవ లోపాలు కలుగకుండా చూసుకోవాలి. నిర్ణయాదుల్లో జాగ్రత్త. సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణ. ఒత్తిడి. గౌరవ లోపాలకు అవకాశం. సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త. శ్రమ. శుక్రవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు అనుబంధాల్లో సంతోషం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744