వారం వారం గోచారం

వారం వారం గోచారం (28-10-2018 నుంచి 3-11-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం కుటుంబంలో అనుకూలత. మాట తీరులో తొందరపాటు. వృత్తి ఉద్యోగాదుల్లో రాణింపు. శ్రమాధిక్యం. అధికారిక వ్యవహారాలపై దృష్టి. కార్యనిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. సోమవారం సంప్రదింపులుంటాయి. దగ్గరి ప్రయాణాలకు అనుకూలం. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. మంగళవారం గౌరవ లోపం కలుగకుండా చూసుకోవాలి. ఊహించని సంఘటనలుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణావకాశాలు. బుధవారం సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలకు అనుకూలం. దైవ కార్యాలపై ప్రత్యేక దృష్టి. గురువారం వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. గృహ వాహనాది నిర్ణయాదుల్లో ఆచితూచి మెలగాలి. శుక్రవారం అభీష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ప్రభావితం చేస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. వ్యతిరేకతలు అధికం. పోటీ రంగంలో జాగ్రత్త అవసరం. విజయ సాధన ఉన్నా శ్రమ తప్పకపోవచ్చు. సామాజిక గౌరవం పెరుగుతుంది. సోమవారం లాభాలు కనిపించినా వ్యర్థంగా వెచ్చించాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. మంగళవారం సౌకర్యాలు పెంచుకుంటారు. గృహ వాహనాది ప్రయోజనాలుంటాయి. ఆహార విహారాలకు అనుకూలం. బుధవారం ఆలోచనల్లో ఒత్తిడులు. ఆలస్య నిర్ణయాలు. ఖర్చులు పెట్టుబడుల్లో కొంత జాగ్రత్త అవసరం. పరామర్శలు. గురువారం ఆహార విహారాల్లో అనుకూలత. సౌకర్యాలు పెంచుకుంటారు. సౌఖ్యంగా గడుపుతారు. విశ్రాంతి. శుక్రవారం నిర్ణయాదులకు అనుకూలం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. మాటల్లో తొందరపాటు కూడదు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. నిల్వధనం కోల్పోయే అవకాశం. అప్పులు తీర్చాలి. సోమవారం పరిచయాలు స్నేహానుబంధాలు పెంచుకునే ప్రయత్నం. అనుకోని సమస్యలుంటాయి. జాగ్రత్త అవసరం. మంగళవారం ధార్మికమైన ఖర్చులు పెట్టుబడులుంటాయి. భాగస్వామి కోసం వెచ్చిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. బుధవారం నిర్ణయాదుల్లో ఆలస్యం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లో జాగ్రత్త. గురువారం వ్యాపారాదుల కోసం పెట్టుబడులుంటాయి. కొత్త పనుల నిర్వహణ వాయిదా వేయడం మంచిది. శుక్రవారం కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా మెలగాలి. లక్ష్యాలను సాధించే యత్నం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం కార్యనిర్వహణ బాధ్యతలు అధికం. లక్ష్యాల సాధనలో తొందరపాటు కూడదు. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. సోమవారం కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. సంప్రదింపులకు అనుకూలం. ప్రయాణావకాశాలు. మంగళవారం పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. పెద్దలతో సంప్రదింపులుంటాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. బుధవారం సంప్రదింపుల్లో జాగ్రత్త. ఊహించని సమస్యలు. అన్ని పనుల్లోనూ లోపాలు, ఆలస్యాలుంటాయి. గురువారం వ్యాపార భాగస్వామ్యాల్లో అనుకూలత. సృజనాత్మక శక్తి. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి. ఇతరుల సహకారం లభిస్తుంది. శుక్రవారం సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత విద్య, ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. ధార్మిక వ్యవహారాలపై దృష్టి ఉన్నా కొంత ఉద్రిక్త భావన ఉంటుంది. ఆలోచనల్లో ఒత్తిడి తగ్గాలి. సోమవారం సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. శ్రమ రహితమైన అధిక ప్రయోజనాలను ఆశిస్తారు. జాగ్రత్త. మంగళవారం పెద్దల సహకారం లభిస్తుంది. నూతన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. గౌరవం. బుధవారం సౌకర్యాలు శ్రమ పెట్టే అవకాశం. ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. ప్రయోజనాలు ఇబ్బంది పెట్టవచ్చు. గురువారం సంప్రదింపులకు అనుకూలం. అత్యధిక లాభాలుంటాయి. కమ్యూనికేషన్స్ వల్ల ప్రయోజనాలు అధికం. శుక్రవారం ఖర్చులు పెట్టుబడులకు అవకాశం. దానధర్మాలవల్ల మేలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. ఆత్మవిశ్వాసం ఉన్నా అతి ప్రవర్తన వల్ల సమస్యలుండే అవకాశం. మనోభీష్టాలు నెరవేర్చుకుంటారు. సోమవారం పరిచయాలు స్నేహానుబంధాల్లో తొందరపాటుకు అవకాశం. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. మంగళవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యవహారాల్లో అనుకూలత. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. శ్రమాధిక్యం. బుధవారం వ్యర్థమైన ఖర్చులు, ప్రయాణాలుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో ఒత్తిడులకు అవకాశం. గురువారం లాభాలు అనుకూలం. అన్ని పనుల్లో ప్రయోజనాలకు అవకాశం. వ్యాపార భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. శుక్రవారం అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలకు అవకాశం. శారీరక శ్రమ.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. అనుకోని ఇబ్బందులుంటాయి. చిన్న ప్రమాదాలకు అవకాశం. పరామర్శలుంటాయి. విశ్రాంతి లోపం. అప్రమత్తంగా మెలగాలి. సోమవారం నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. బాధ్యతలు అధికం. కుటుంబ ఆర్థికాంశాల్లో ఇబ్బందులుంటాయి. మంగళవారం పోటీ రంగంలో గుర్తింపు. వ్యవహారాల్లో ఒత్తిడులున్నా శుభ పరిణామాలుంటాయి. విజయ సాధన. బుధవారం కుటుంబ ఆర్థికాంశాల్లో అప్రమత్తంగా మెలగాలి. భాగస్వామ్యాల్లో సమస్యలుంటాయి. అన్ని పనుల్లో ఆలస్యం. గురువారం వ్యాపారాదుల్లో అనుకూలత. మాటల్లో చమత్కారం ఉంటుంది. కార్యనిర్వహణలో గుర్తింపు. విజయం. శుక్రవారం సంప్రదింపులకు అనుకూలం. ఊహించని సంఘటనలుంటాయి. కొంత నైరాశ్య ధోరణి. సహకార లోపాలు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సంఘటనలు. సౌకర్య లోపాలు. శారీరక శ్రమ తప్పకపోవచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. సోమవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సంతృప్తిగా గడుపుతారు. దూర ప్రయాణాలుంటాయి. అనేక కార్యక్రమాల బాధ్యతలు. మంగళవారం కుటుంబ ఆర్థికాంశాల్లో ఉన్నతి. దైవిక, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి. మాట వల్ల గౌరవం పెరుగుతుంది. బుధవారం సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. సంప్రదింపుల్లో జాగ్రత్త. సమాచారం వల్ల సమస్యలుంటాయి. గురువారం ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. సామాజిక హోదా, గౌరవాలు పెంచుకునే సూచనలు. పదోన్నతులుంటాయి. శుక్రవారం లాభాలపై దృష్టి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. కొంత నిరాశ.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం సౌకర్యాల కోసం వ్యర్థంగా వెచ్చిస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. విశ్రాంతి లోపం. గృహ వాహనాదుల కొనుగోలు విషయంలో జాగ్రత్త. సోమవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ అనుకూలత. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. సంతోషం. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సృజనాత్మకత. నూతన కార్యక్రమాల ప్రణాళికలుంటాయి. బుధవారం లాభాలు ఇబ్బంది పెట్టే అవకాశం. వ్యతిరేక ప్రభావాలు అధికవౌతాయి. ప్రయోజనాలు అందకపోవచ్చు. గురువారం అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. వ్యాపార భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. సామాజిక గౌరవం. శుక్రవారం భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. విశ్రాంతి లోపం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం అన్ని పనుల్లో ప్రయోజనాలు కోరుకుంటారు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు అధికం. పరిచయాలు స్నేహానుబంధాల్లో తొందరపాటు కూడదు. లాభాలు కోల్పోయే అవకాశం. సోమవారం ఖర్చులు పెట్టుబడులు అధికం. ప్రయాణాదులకు అవకాశం. విశ్రాంతి లోపం. నిర్ణయాదులను సమీక్షించుకోవాలి. మంగళవారం అభీష్ట సిద్ధి. ఆధ్యాత్మిక ధార్మిక వ్యవహారాలు, ప్రయాణాలు, దాన ధర్మాలకు అవకాశం. సంతోషం. బుధవారం నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. పోటీ రంగంలో ఇబ్బందులకు అవకాశం. వ్యతిరేకతలు అధికవౌతాయి. గురువారం బాధ్యతల నిర్వహణలో అనుకూలత. సృజనాత్మకత. కొత్త పనులపై దృష్టి. సంతానవర్గ సంతోషం. శుక్రవారం కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్యాల్లో కొంత నిరాశ ఎదురవుతుంది.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు స్నేహానుబంధాల్లో అప్రమత్తం. తొందరపాటు కూడదు. సోమవారం అన్ని పనులను వాయిదా వేసుకోవాలి. దూర ప్రయాణ భావనలు. ఉన్నత విద్యా వ్యవహారాల్లో అడ్డంకులు. సంతృప్తి లోపం. మంగళవారం నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అనుకోని సంఘటనలు. అనారోగ్య భావనలు. బుధవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కుటుంబ ఆర్థికాంశాల్లో అప్రమత్తంగా మెలగాలి. ఆధ్యాత్మిక ప్రయాణాలు. గురువారం బాధ్యతలను ఆనందంగా నిర్వహిస్తారు. గౌరవం పెంచుకునే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. లాభాలు శ్రమకు గురి చేస్తాయి. సహకారం లభిస్తుంది. కొత్త వార్తలు అందుతాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. సోమవారం ఆలోచనల్లో వత్తిడులుంటాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో అనుకూలత. శ్రమాధిక్యం. మంగళవారం లక్షఒ్యలను సాధించే ప్రయత్నం. ఉన్నత విద్య ఉద్యోగావకాశాలు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త వహించాలి. మానసిక ఒత్తిడులుంటాయి. ఆలోచనల్లో ఘర్షణలుంటాయి. గురువారం సృజనాత్మకత. సంతానవర్గ సంతృప్తి. ఉన్నత వ్యవహారాలు, కీర్తి ప్రతిష్ఠలు. దూర ప్రయాణావకాశాలు. శుక్రవారం వ్యతిరేక ప్రభావాలు అధికం. గుర్తింపు లభిస్తుంది. లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744