వారం వారం గోచారం

వారం వారం గోచారం (18-11-2018 నుంచి 24-11-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం ఖర్చులు పెట్టుబడుల్లో సంతృప్తి. ధార్మిక ప్రయాణాలు. గౌరవం నిలుపుకోవడానికి ప్రయత్నం. కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఒత్తిడి. దానధర్మాల వల్ల మేలు. సోమవారం ప్రయాణాలు. పరామర్శలకు అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. సంతృప్తి లోపం. మంగళవారం వ్యాపారాదుల్లో జాగ్రత్త. విశ్రాంతి లోపానికి అవకాశం. సంప్రదింపుల్లో సమస్యలు. పోటీ రంగంలో ఒత్తిడి. బుధవారం నిర్ణయాదులపై దృష్టి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యం. గురువారం పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. విహార యాత్రలకు అవకాశం. భాగస్వామితో కొంత జాగ్రత్త. శుక్రవారం ప్రభుత్వ, అధికారికమైన ఒత్తిడులు తప్పకపోవచ్చు. కుటుంబ ఆర్థికాంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం భాగస్వామ్యాలపై దృష్టి. ఊహించని ఇబ్బందులు. శ్రమ రహిత ప్రయోజనాలు. విద్యారంగంలో ఒత్తిడులుంటాయి. ఆహార విహారాలు ఉన్నప్పటికీ ఇబ్బందులకు అవకాశం. సోమవారం ఆలోచనల్లో ఒత్తిడులు. నూతన నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. సంతాన వర్గం వల్ల సమస్యలకు అవకాశం. మంగళవారం సౌకర్యాదులు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాదుల్లో ఒత్తిడులు. శ్రమతో కార్యక్రమాలుంటాయి. బుధవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ఆధ్యాత్మిక ప్రయాణాదుల వల్ల మేలు. గురువారం స్ర్తి వర్గంతో సంప్రదింపులు. విందులు విహారాలుంటాయి. సంతోషంగా గడుపుతారు. ఉన్నత విద్యపై దృష్టి. శుక్రవారం శారీరక, మానసిక సౌఖ్యం కోల్పోయే అవకాశం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం పెద్దలతో సంప్రదింపులుంటాయి. ప్రయాణావకాశాలు. ఆహార విహారాలపై దృష్టి. విశ్రాంతి లభిస్తుంది. ధార్మికమైన ఖర్చులుంటాయి. దానధర్మాల వల్ల మరింత మేలు. సోమవారం నిర్ణయాదుల్లో ఆలస్యం. తొందరపాటు కూడదు. ప్రయాణాదుల్లో ఒత్తిడులు అధికవౌతాయి. జాగ్రత్త. మంగళవారం వ్యాపార వ్యవహారాలు పెట్టుబడులు తప్పవు. విహార యాత్రలకు అవకాశం. సౌఖ్యంగా గడుపుతారు. బుధవారం కొత్త ప్రణాళికలపై దృష్టి. ఆలోచనలున్నా రూపం దాల్చడం కష్టం. మాట తీరులో కొంత నిరాశ ఉంటుంది. గురువారం అన్ని పనుల్లో ప్రయోజనాలు. పెద్దల ఆశీస్సులు. సంతోషంగా గడుపుతారు. సంతానంతో సంతృప్తి. శుక్రవారం పెట్టుబడుల్లో జాగ్రత్త. వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. శారీరక, మానసిక ఒత్తిడులు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. లాభాలు సంతోషాన్నిస్తాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సోమవారం ప్రయోజనాలు కోల్పోయే అవకాశం. అనుకోని సమస్యలు, సంఘటనలుంటాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. మంగళవారం వ్యాపార భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం. బుధవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలపై దృష్టి. విశ్రాంతి లోపాలుంటాయి. నిరాశ. గురువారం వ్యతిరేకతలు అధికం. పోటీ రంగంలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. చికాకులను ఖర్చులతో అధిగమించాలి. శుక్రవారం అధికారులు, పెద్దలతో పరిచయాలకు అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఆత్మవిశ్వాసం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం అన్ని పనుల్లో పోటీ పడాల్సి వస్తుంది. భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుకుంటారు. సంప్రదింపులుంటాయి. సోమవారం ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. సౌఖ్య లోపం. సామాజిక అనుబంధాల్లో కొంత ఒత్తిడి. మంగళవారం వ్యాపార వ్యవహారాలుంటాయి. దగ్గరి ప్రయాణావకాశాలు. శుభ వర్తమానాలుంటాయి. సంతోషం. బుధవారం అనుకోని ఇబ్బందులు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ప్రయాణాది సౌకర్యాల లోపాలుంటాయి. గురువారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాటల విషయంలో జాగ్రత్త వహించాలి. ఊహించని సంఘటనలు. శుక్రవారం ఉన్నత విద్య. ఉద్యోగం, వ్యవహారాలపై దృష్టి. అధికారిక సంప్రదింపులకు అవకాశం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. సంప్రదింపులుంటాయి. ప్రయాణావకాశాలు. లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాల్లో అనుకూలత. సోమవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. కాలం ధనం వ్యర్థంగా పోయే అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. మంగళవారం వ్యాపారాదుల్లో ప్రయోజనాలుంటాయి. సంప్రదింపులకు అవకాశం. కొత్త వార్తలుంటాయి. పెద్దల ఆశీస్సులు. బుధవారం ఆహార విహారాలపై దృష్టి. నిర్ణయాదుల్లో ఇబ్బందులు. కార్యక్రమాల ఒత్తిడులు అధికం. నిరాశ. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో సంతోషం. అన్ని పనులు సులువుగా పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుక్రవారం మానసికమైన సంతోషం. సంతాన వర్గంతో గడుపుతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. గుర్తింపు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం ఉన్నత లక్ష్యాలు, కీర్తి ప్రతిష్టలపై దృష్టి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. రుణాలు తీరుతాయి. సోమవారం అధికారిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. పరిచయాలు, అనుబంధాలు ఇబ్బంది పెట్టే అవకాశం. మంగళవారం సామాజిక గౌరవం పెంచుకుంటారు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. బుధవారం అన్ని పనుల్లో ప్రయోజనాలపై దృష్టి. నిర్వహణ లోపాలు. అనుకోని ఒత్తిడులు. నిరాశతో సాగుతుంది. గురువారం అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గంతో సంతోషం. అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. సృజనాత్మకత. శుక్రవారం పోటీలు, ఒత్తిడులు, చికాకులున్నా శ్రమతో గుర్తింపు. విజయం సాధిస్తారు. ఖర్చులు, పెట్టుబడులుంటాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వ్యవహారాలపై దృష్టి. పోటీ రంగంపై దృష్టి. కుటుంబ ఆర్థికాంశాల్లో శ్రమతో గుర్తింపు. నిల్వధనం పెంచుకునే ప్రయత్నాలు. సోమవారం వ్యతిరేకతలు అధికవౌతాయి. గుర్తింపు కోసం ప్రయత్నం. రుణ రోగాదులు ఇబ్బంది పెట్టవచ్చు. మంగళవారం కుటుంబంలో అనుకూలత. మాట తీరు వల్ల కొంత ఒత్తిడిని తగ్గించుకుంటారు. పోటీలున్నా విజయం సాధిస్తారు. బుధవారం భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు, అనుబంధాలు విస్తరించే అవకాశం. సౌకర్య లోపాల వల్ల నిరాశ. గురువారం భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విందులు విహారాలపై ప్రత్యేక దృష్టి. నూతన కార్యక్రమాలు. శుక్రవారం అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. బాధ్యతలు అధికం. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. నిల్వధనం పెరుగుతుంది. గౌరవ మర్యాదలుంటాయి. శ్రమాధిక్యం. సోమవారం మాట విలువ పెంచుకునే ప్రయత్నం. లాభాలున్నా ఆశించిన సంతోషం ఉండదు. పెద్దలతో జాగ్రత్త. మంగళవారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అనేక బాధ్యతల నిర్వహణ. బుధవారం సంప్రదింపులకు అనుకూలం. ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక వాతావరణం. కాలం కోల్పోవచ్చు. గురువారం చాలా సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు. సంప్రదింపులుంటాయి. శుక్రవారం అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త. శనివారం వ్యతిరేకతలు పెరిగే సూచనలు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. నూతన వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే యత్నం. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. నూతన ప్రణాళికలకు అనుకూలం. సోమవారం సుదూర ప్రయాణ భావన. వ్యతిరేకతలుంటాయి. గుర్తింపు కోసం ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలు. మంగళవారం అభీష్ట సిద్ధి. వ్యాపారాదులకు అనుకూలం. క్రియేటివిటీ పెరుగుతుంది. నూతన వార్తలు అందుతాయి. బుధవారం వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్యాల్లో నిరాశ. గురువారం సౌకర్యాలు విస్తరించే ప్రయత్నం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. కార్యనిర్వహణలో సంతోషం. శుక్రవారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. ఆందోళన ఇబ్బంది పెడుతుంది. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. మంచి ఆలోచనలు. కొత్త పనులకు ప్రణాళికలు. సంతానంతో సంతోషంగా గడుపుతారు. గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు అధికవౌతాయి. సోమవారం మాట తీరు వల్ల సమస్యలు. నిల్వధనం కోల్పోయే అవకాశం. విద్యాత్మకమైన కృషి. ఆలోచనల్లో ఒత్తిడి. మంగళవారం వ్యాపార వ్యవహారాలపై దృష్టి. స్ఫురణ శక్తి పెంచుకుంటారు. కొత్త నిర్ణయాలుంటాయి. ప్రణాళికలు. బుధవారం వ్యతిరేక ప్రభావాలు అధికవౌతాయి. సంప్రదింపులలో జాగ్రత్త అవసరం. కొన్ని వార్తల వల్ల సమస్యలు. గురువారం ఖర్చులు పెట్టుబడులు పెరిగే సూచనలు. విందులు విహారాలు వినోదాలకు అవకాశం. విజయ సాధన. శుక్రవారం శారీరక ఒత్తిడులు. పరిచయాలు అనుబంధాలు పెరిగినా ఇబ్బందులు తప్పకపోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులున్నా సంతోషంగా ఉంటుంది. అనేక బాధ్యతల నిర్వహణ. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ఆధ్యాత్మిక ప్రయాణాలు. దానధర్మాలు, ధ్యానాదులపై ప్రత్యేక దృష్టి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలుంటాయి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. బాధ్యతల వల్ల ఒత్తిడులుంటాయి. మంగళవారం వ్యాపార వ్యవహారాలకు అవకాశం. నిర్ణయాదుల్లో సంతృప్తి. సౌకర్యాలు. భాగస్వామ్యాల్లో అనుకూలత. బుధవారం కుటుంబంలో ఆర్థికాంశాల్లో కొంత నిరాశా ధోరణి. లాభాలున్నా సంతోషం ఆశించినంతగా ఉండదు. గురువారం అనుకోని ఒత్తిడులుండే అవకాశం. సంప్రదింపుల్లో జాగ్రత్త. కుటుంబ ఆర్థికాంశాల్లో ఇబ్బందులుంటాయి. శుక్రవారం సంప్రదింపులు. సమాచార వ్యవహారాలపై దృష్టి. వ్యతిరేక ప్రభావాల వల్ల సమస్యలు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744