వారం వారం గోచారం

వారం వారం గోచారం (6-1-2019 నుంచి 12-1-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. లక్ష్యాలను సాధించడంలో అవాంతరాలు. అనుకోని ఇబ్బందులు. దూర ప్రయాణ భావనలు. సోమవారం ఆలోచనలకు రూపకల్పన. ఉన్నత విద్య, ఉద్యోగాదులపై దృష్టి. శ్రమ ఉన్నా కీర్తిప్రతిష్టలు పెరిగే అవకాశం. పదోన్నతి. మంగళవారం సౌఖ్యాలపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాల గూర్చిన ఆలోచనలు. ఆహార విహారాల్లో అనుకూలత. బుధవారం ఖర్చులు పెట్టుబడులు అధికం. తొందరపాటు ఆలోచనలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. గురువారం ఆహార విహారాల్లో ఇబ్బందులు. అనవసర ప్రయాణాలు. సౌఖ్య లోపం. ఆశింపు అధికం. జాగ్రత్త అవసరం. శుక్రవారం గౌరవ లోపాలుంటాయి. అసంతృప్తికి అవకాశం. దానధర్మాల వల్ల మేలు. వ్యవహారాల్లో అప్రమత్తం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాల్లో అనుకూలత. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు. సంతానవర్గ సంతోషం. సృజనాత్మకత. కొత్త పనులపై ప్రత్యేక దృష్టి. సోమవారం ఆలోచనల్లో వత్తిడులుంటాయి. నిర్ణయాదులకు అనుకూలత. కొత్త పనులకు శ్రీకారం. శ్రమతో కార్యసాధన. మంగళవారం ఖర్చులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. వ్యతిరేక ప్రభావాలుంటాయి. విశ్రాంతి కోల్పోయే అవకాశం. బుధవారం అనుకోని సమస్యలు. అసంతృప్తి. చిన్నచిన్న ప్రమాదాలకు అవకాశం. చికాకులు అధికవౌతాయి. గురువారం వ్యర్థమైన ఖర్చులు, ప్రయాణాలకు అవకాశం. విశ్రాంతి లోపం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. పరామర్శలు. శుక్రవారం ఆహార విహారాలకు అనుకూలం. గృహ వాహనాది సౌకర్యాలు పెంచుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం విందులు, విహార యాత్రలకు అవకాశం. విశ్రాంతిగా గడుపుతారు. సంతోషంగా ఉంటారు. కార్యనిర్వహణ దక్షత. అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సోమవారం నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. శారీరక శ్రమ. బాధ్యతలు అధికం. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. మంగళవారం కుటుంబ సంబంధాల్లో ఒత్తిడులుంటాయి. మాటల్లో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని సమస్యలుంటాయి. బుధవారం సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. గురువారం అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలుంటాయి. వ్యవహారాల్లో లోపాలకు అవకాశం. శుక్రవారం గౌరవం పెంచుకుంటారు. నిర్ణయాదులకు అనుకూలం. సౌకర్యాల కోసం వెచ్చిస్తారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. శుభనిర్ణయాలుంటాయి. అనుకోని నష్టాలను అధిగమిస్తారు. సోమవారం ఉన్నత వ్యవహారాలు, లక్ష్యాలు, విద్యలు, ప్రయాణాలపై ప్రత్యేక దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. మంగళవారం సంప్రదింపులకు అనుకూలం. ప్రయాణావకాశాలు. సోదర వర్గ సంబంధమైన వ్యవహారాలుంటాయి. బుధవారం లాభాలపై ప్రత్యేక దృష్టి. భాగస్వామి ద్వారా ప్రయోజనాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ. గురువారం కమ్యూనికేషన్స్‌లో జాగ్రత్త. వార్తల వల్ల ఇబ్బందులకు అవకాశం. అధికారిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. శుక్రవారం పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వృత్తిపరమైన అనుకూలత. భాగస్వామితో అనుకూలత.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. సోదర వర్గంతో అనుబంధాలు. ప్రయాణాలకు అవకాశం. విహార యాత్రలుంటాయి. ఆహార విహారాలు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. సోమవారం ఆలోచనల్లో సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. వ్యర్థమైన ప్రయాణాలు. సంతానవర్గ వ్యవహారాల్లో శ్రమ. మంగళవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. సృజనాత్మక వ్యవహారాలుంటాయి. శుభ పరిణామాలు. నూతన నిర్ణయాలు. బుధవారం పరిచయాలు ఇబ్బంది పెట్టే సూచనలు. భాగస్వామితో తొందరపాటు కూడదు. ప్రమాదావకాశాలు. గురువారం ఊహాతీతమైన భావనలు. అత్యాశ ఉంటుంది. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. లాభాలుంటాయి. శుక్రవారం పెద్దలతో సంప్రదింపులకు అనుకూలం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లో అనుకూలత. ఆలోచనలకు రూపకల్పన. పెద్దల ఆశీస్సులుంటాయి. వృత్తిపరమైన ఉన్నతి. విశ్రాంతి లభిస్తుంది. సోమవారం వ్యర్థమైన పెట్టుబడులు ఖర్చులుంటాయి. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలుంటాయి. శ్రమ. మంగళవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిపూర్ణమైన సంతోషం. బాధ్యతలు అధికం. వ్యవహారాల్లో విజయం. బుధవారం సంప్రదింపులుంటాయి. వార్తల వల్ల ఇబ్బందులు. సౌకర్యాలుంటాయి. నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. గురువారం పరిచయాలు, స్నేహానుబంధాల్లో వత్తిడులుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. శ్రమాధిక్యం. శుక్రవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపుల వల్ల సంతోషం. ఆర్థిక నిల్వలను పెంచుకుంటారు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం పోటీలు, వత్తిడులు, వ్యతిరేకతలు అధికం. గుర్తింపు కోసం ప్రయత్నం. ఆశించిన ఫలితాలు అందవు. సంతాన వ్యవహారాల్లో ఒత్తిడులు. భాగస్వామ్య సమస్యలు. సోమవారం పరిచయాలు స్నేహానుబంధాల్లో జాగ్రత్త. సంప్రదింపుల్లో కొంత అనుకూలత. కొత్త వార్తలు అందుతాయి. మంగళవారం కుటుంబంలో కొంత జాగ్రత్త. అనుకోని సమస్యలు. అన్ని పనుల్లోనూ చికాకులు, అనారోగ్యం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలుంటాయి. సామాజిక గౌరవ లోపాలుంటాయి. అధికారులతో జాగ్రత్త. గురువారం మాటల్లో జాగ్రత్తగా మెలగాలి. అనవసరమైన ప్రయత్నాలు. విజయ సాధన ఉన్నా శ్రమతో ఫలితాలు. శనివారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం కుటుంబంలో అనుకూలత. మాటల్లో చమత్కారం. నిల్వధనంపై దృష్టి. ఆనందంగా గడిపే ప్రయత్నం. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. సహకార లాభాలు. సోమవారం అధికారిక సహకారం లభిస్తుంది. పితృవర్గ అనుకూలత. ఆరోగ్య శుద్ధి. లాభాలు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపులు. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాల్లో అనుకూలత. బుధవారం వ్యతిరేకతలపై విజయం. పోటీలు ఒత్తిడులుంటాయి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. గుర్తింపు. గురువారం అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు అధికం. తక్కువ సమయంలో ఎక్కువ పనులుంటాయి. శుక్రవారం మాట విలువ పెరుగుతుంది. సహకారం లభిస్తుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కార్యనిర్వహణలో అనుకూలత. సోమవారం అనేక రూపాల్లో లాభాలుంటాయి. భాగస్వామ్యాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు విస్తరిస్తాయి. మంగళవారం వ్యతిరేకతలు అధికం. ఖర్చులు పెట్టుబడుల్లో కొంత జాగ్రత్త. విందులు వినోదాలు విహారాలుంటాయి. బుధవారం కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త. మాట విలువ తగ్గే సూచనలు. తొందరపాటు నిర్ణయాలు కూడదు. గురువారం పోటీలు ఒత్తిడులు ఇబ్బంది పెట్టవచ్చు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. విజయం లభిస్తుంది. శుక్రవారం అధికారిక ప్రయోజనాలుంటాయి. పదోన్నతి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. లాభాలుంటాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. పోటీ రంగంలో విజయం సాధిస్తారు. కార్యనిర్వహణలో అనుకూలత. సోమవారం వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. కాని శ్రమ తప్పకపోవచ్చు. ప్రయత్నాలలో జాగ్రత్తలు అవసరం. మంగళవారం నిర్ణయాదుల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు పెరిగే అవకాశం. ఆత్మవిశ్వాసం. బుధవారం ఉన్నత వ్యవహారాల్లో చికాకులుంటాయి. భాగస్వామితో తొందరపాటు కూడదు. కీర్తి ప్రతిష్ఠలపై ప్రత్యేక దృష్టి. గురువారం నిర్ణయాదుల్లో లోపాలు. తొందరపాటు అధికం. అత్యాశతో వ్యవహరిస్తారు. భాగస్వామ్య సమస్యలు. శుక్రవారం ఆలోచనలకు రూపకల్పన. కార్యనిర్వహణ దక్షత. సంతానవర్గ సంతృప్తి. అనుకూలత.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం అన్ని నిర్ణయాదులు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య సంతోషం. విందులు, విహారయాత్రలకు అవకాశం. సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. సోమవారం కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. మాటల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. అధికార ధోరణి తగ్గించుకోవాలి. మంగళవారం లక్ష్యాలను సాధిస్తారు. దూర ప్రయాణ భావనలు. కీర్తి ప్రతిష్టలపై దృష్టి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. బుధవారం ఆలోచనల్లో ఒత్తిడులు. తొందరపాటు నిర్ణయాలు. సంతానవర్గ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. గురువారం ఉన్నత వ్యవహారాలున్నా అసంతృప్తి. దూర ప్రయాణ సూచనలు. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. శుక్రవారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కుటుంబంలో అనుకూలత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం అత్యున్నత వ్యవహారాలపై దృష్టి. సంప్రదింపులకు అనుకూలం. లక్ష్యాలను సాధిస్తారు. విహార యాత్రలకు అవకాశం. సంతోషంగా, సంతృప్తిగా గడుపుతారు. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. అధికారిక వ్యవహారాలు. విజయ సాధన. గుర్తింపు, గౌరవాలు. పదోన్నతి. శ్రమాధిక్యం. మంగళవారం అభీష్టాలు నెరవేరుతాయి. పెద్దల ఆశీస్సులు. సంతాన వర్గంతో సంతోషం. లాభాలు సంతృప్తినిస్తాయి. బుధవారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. తొందరపాటు అధికం. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. శ్రమతో కార్యాలు. గురువారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టే సూచనలు. కార్యనిర్వహణలో సమస్యలు. శుక్రవారం లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలుంటాయి. విద్య ఉద్యోగాదుల్లో ఉన్నతి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744