వారం వారం గోచారం

వారం వారం గోచారం(10-2-2019 నుంచి 16-2-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ఖర్చులు పెట్టుబడులుంటాయి. వ్యాపారాదుల్లో కొంత లాభాలుంటాయి. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. విహార యాత్రల కోసం వెచ్చిస్తారు. ఆహార విహారాలపై ఆసక్తి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. ఆలోచనలకు రూపకల్పన. కొత్త పనులపై దృష్టి. బాధ్యతలు విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత నిరాశ. ఉన్నత కార్యక్రమాలు, ఫిర్యాదులు, దూర ప్రయాణాలపై ఆసక్తి, ప్రణాళికలు ఉంటాయి. కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. నిల్వధనం పెంచుకుంటారు. మాట తీరులో మంచి మార్పులుంటాయి. అధికారిక లాభాలుంటాయి. కుటుంబ సభ్యుల వల్ల సంతోషం కలుగుతుంది. కొంత ఒత్తిడి, కోపం కూడా కలిగే అవకాశం. తొందరపాటు నిర్ణయాలు కూడదు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలకు అవకాశం. కొత్త పనులను వాయిదా వేయడం మేలు. భాగస్వామ్యాల్లో, వ్యాపారాల్లో శుభ పరిణామాలున్నా అనుకోని సంఘటనలకు అవకాశం. ఇబ్బంది అధికవౌతుంది. తర్వాత అనుకున్న పనులు పూర్తవుతాయి. సుదూర లక్ష్యాలవైపు దృష్టి. కార్యనిర్వహణలో అనుకూలత. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. పోటీ రంగంలో నష్టాలు. అభీష్టాలను నెరవేర్చుకుంటారు. సంతాన వర్గంతో అనుకూలత. సృజనాత్మక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. వృత్తి, ఉద్యోగ భావాలు ప్రేరేపితవౌతాయి. అధికారిక కార్యక్రమాలుంటాయి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. లాభాలున్నా ఆశించిన వ్యవహారాలు పూర్తి కావు. వ్యర్థమైన కార్యకలాపాలుంటాయి. ధనం వ్యర్థమయ్యే సూచనలు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు పెంచుకునేందుకు ప్రయత్నం. ఆహార విహారాలకు అనుకూలత. వ్యాపార వర్గంతో సంప్రదింపుల కోసం ప్రయాణాలు. ఇతరుల సహకారం బాగా లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు వినే అవకాశం. విహార యాత్రలుంటాయి. క్రమంగా అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. నూతన వ్యవహారాలపై దృష్టి. కార్యనిర్వహణ సమర్థత. సంతాన వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత నిరాశావాదంతో ఉంటారు. అయినా అనేక పనులు తప్పకపోవచ్చు. బాధ్యతల నిర్వహణలో సంతోషం. కొత్త పనులపై ఆసక్తి. సృజనాత్మకత విస్తరించే అవకాశం. క్రమంగా వ్యతిరేకతలుంటాయి. పోటీ రంగంలో గుర్తింపు. విజయ సాధన. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం లాభాలున్నా ఆశించిన తృప్తి అందక ఇబ్బంది పడతారు. పెద్దల ఆశీస్సులుంటాయి. ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి. ఖర్చులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర వ్యయాలుంటాయి. ఆధ్యాత్మిక యాత్రలు, దాన ధర్మాల వల్ల మేలు కలుగుతుంది. విశ్రాంతి లోపం. పరామర్శలకు అవకాశం. వ్యర్థమైన ప్రయాణాలు. ఊహించని ఖర్చులుంటాయి. నిర్ణయాదులలో మేలు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సంప్రదింపులుంటాయి. సహకార లాభాలు. మాతృవర్గంతో అనుకూలత. సోదర వర్గ సహకారాదులుంటాయి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. వ్యాపార వ్యవహారాల్లో లాభాలుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వార ప్రారంభంలో భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. పరిచయాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపట్టే అవకాశం. ఒత్తిడి ఉన్నా కార్యనిర్వహణ. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీ రంగంలో విజయం. శ్రమ ఉన్నా అనుకున్న పనులను నిర్వహిస్తారు. క్రమంగా అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త తప్పకపోవచ్చు. సాధ్యమైనంత వరకు కొత్త పనులను వాయిదా వేయాలి. మానసికమైన కొంత నైరాశ్యం ఆవహిస్తుంది. సౌకర్యాలు పెంచుకున్నా సౌఖ్యంగా ఉండకపోవచ్చు. క్రమంగా ఉన్నత లక్ష్యాలపై దృష్టి. శుభ కార్యక్రమాల నిర్వహణ. రూపకల్పన. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి. లాభాలు సంతోషాన్నిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. కొన్ని ప్రమాదాలు, ఇబ్బందులు, ఒత్తిడులు కూడా ఉంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. చమత్కార సంభాషణలు. దగ్గరి ప్రయాణాలు. సహకార లాభాలుంటాయి. క్రమంగా సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో అప్రమత్తం. నిర్ణయాదులు కొంత ఒత్తిడికి గురి చేయవచ్చు. విందులు, విహారాల కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. వారం మధ్యలో అభీష్టాలు నెరవేరుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు. సంతోషంగా గడుపుతారు. సంతానంతో అనుబంధం విస్తరిస్తుంది. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. సృజనాత్మకత విస్తరిస్తుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి. ఆహార విహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు చర్యలు కూడదు. వారాంతంలో వ్యతిరేక భావాలపై దృష్టి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికార వ్యవహారాల్లో అనుకూలత. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. సుదూర ప్రయాణాలపై దృష్టి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలత. లాభాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. అనుకోని సమస్యలకు అవకాశం. భాగస్వామ్యాల్లో కొంత అనుకూలత. పరిచయాలు క్రమంగా విస్తరిస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి. విలాసాలు, విందుల కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో నూతనమైన గుర్తింపు లాభిస్తుంది. ఆలోచనలకు రూపకల్పన. బాధ్యతలు పెంచుకుంటారు. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా మెలగాలి. సుదూర ప్రయాణాలు. వ్యాపారాలో అనూహ్యమైన వృద్ధి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలుంటాయి. వ్యవహారాల్లో ఆచితూచి ప్రవర్తించాలి. పోటీ రంగంలో విజయావకాశాలు. గుర్తింపు లభిస్తుంది. శ్రమ తప్పకపోవచ్చు. అభీష్టాలు నెరవేరుతాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. మాతృవర్గం వారి వ్యవహారాల్లో కొంత నైరాశ్య ధోరణి. సౌఖ్య త్యాగం తప్పకపోవచ్చు. సంప్రదింపులకు అనుకూలత. సోదరీమణుల సహకారం. కొత్త సమాచారం అందుతుంది. వారం మధ్యలో ఊహించని సంఘటనలు. అనుకోని సమస్యలు. కొంత అనారోగ్యం. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త. ఆహార విహారాల్లో లోపాలు. సౌకర్యాల వల్ల కొత్త ఇబ్బందులు. క్రమంగా లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నతమైన కార్యక్రమాల నిర్వహణ.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ బాధ్యతలుంటాయి. ఆర్థిక నిల్వల గూర్చిన ఆలోచనలు. మాట విలువ పెంచుకుంటారు. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆకర్షణ అధికం చేసుకునే ప్రయత్నం. క్రమంగా సంప్రదింపులు విస్తరిస్తాయి. సహకార లాభాలుంటాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. నిరాశా దృక్పథంతో కొంత వ్యవహరించే అవకాశం. కానీ అధికమైన లాభాలు మాత్రమే కలుగుతాయి. సోదర వర్గానుకూలత. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు, సమాచారం అందే అవకాశం. వారం మధ్యలో సౌకర్యాదులు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యంగా గడుపుతారు. ప్రయాణావకాశాలు అధికవౌతాయి. విద్యాత్మకాంశాలపై ప్రత్యేక దృష్టి. వారాంతంలో మనోభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. కాని వ్యాపార రంగంలో కొంత అప్రమత్తంగా మెలగాలి. అనుకోని నష్టాలకు అవకాశం. క్రమంగా వృత్తి ఉద్యోగాదుల్లో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. పదోన్నతులకు అవకాశం. అధికారిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. పితృవర్గం వారితో అనుకూలత. భాగస్వామితో కొంత చిరాకు. వ్యతిరేక ప్రభావాలున్నా పోటీ రంగంలో విజయ సాధన. అధికారులతో కొంత చికాకు. వ్యతిరేక ప్రభావాలున్నా పోటీ రంగంలో విజయ సాధన. అధికారులతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యలో ప్రయోజనాలు అధికం. లాభాలపై అధిక ఆసక్తి. దానివల్ల సమస్యలు కూడా ఉంటాయి. పెద్దల సలహా సంప్రదింపులు అవసరం. నిర్ణయాదులకు అనుకూలం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో సృజనాత్మక వ్యవహారాలు. కొత్త ప్రణాళికలుంటాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. ఆహార విహారాదుల్లో కొత్త నిర్ణయాలు. గృహ వాహనాది సౌకర్యాలు పెంచుకుంటారు. క్రమంగా పోటీలు ఒత్తిడులు చికాకులుంటాయి. శత్రువుల ప్రభావాన్ని అధిగమిస్తారు. రుణాల విషయంలో కొంత జాగ్రత్త. రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం. సంప్రదింపులుంటాయి. కొంత నిరాశ తప్పదు. కుటుంబంలో శుభ పరిణామాల వల్ల గుర్తింపు లభిస్తుంది. అప్పులు తీరిపోతాయి. మాట తీరులో ఆకర్షణ ఉంటుంది. క్రమంగా పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త వారితో అనుబంధాలు పెంచుకునే అవకాశం కలుగుతుంది. అధికారిక సంప్రదింపులుంటాయి. శారీరక ఒత్తిడులు కూడా కలుగవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి. కొత్త పనుల నిర్వహణ. బాధ్యతల విస్తరణ. వ్యాపారాదుల్లో పెట్టుబడుల్లో కొంత జాగ్రత్త. దానివల్ల కొంత ఒత్తిడి పెరిగే అవకాశం. క్రమంగా కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. బాధ్యతలు విస్తరిస్తాయి. మాటల్లో అనుకూలత. కొన్ని లాభాల విషయంలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. అప్రమత్తంగా మెలగాలి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. వారం మధ్యలో సంప్రదింపులు విస్తరిస్తాయి. నూతన సమాచారం అందుతుంది. కొన్ని ప్రయోజనాలున్నా కొంత జాగ్రత్త తప్పదు. అభీష్టాలు నెరవేరుతాయి. వ్యతిరేక ప్రభావాలను హాయిగా అధిగమిస్తారు. కొత్త పనులపై దృష్టి. వారాంతంలో ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744