వారం వారం గోచారం

వారం వారం గోచారం (24-3-2019 నుంచి 30-3-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు పెంచుకుంటారు. అనుకోని ఇబ్బందులు ఎదురౌతాయి. అనారోగ్య సమస్యలుంటాయి. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. ఊహించని సంఘటనలు. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. గౌరవ లోపాలకు అవకాశం. నిల్వధనం కోల్పోయే అవకాశం. అసంతృప్తి. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. కార్యనిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో లక్ష్యాల సాధనపై దృష్టి. సుదూర ప్రయాణ భావనలు. విజ్ఞాన విహార యాత్రలకు కూడా అనుకూలం. కార్యనిర్వహణ దక్షత. కీర్తి ప్రతిష్ఠలు విస్తరించే అవకాశం. దైవ, ధర్మ కార్యక్రమాల నిర్వహణ. వేరువేరు రూపాల్లో ప్రయోజనాలు. స్ర్తి వర్గ మూలంగా లాభాలుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. తాము ఇతరులకు సహకరించడం మరీ మంచిది. భాగస్వామ్యాల్లో అత్యంత అనుకూలత. సౌకర్యవంతంగా గడిపే ప్రయత్నం. విందు వినోదాలకు అవకాశం. ఆహార విహారాలపై దృష్టి. శ్రమ తప్పకపోవచ్చు. ప్రయాణాలుంటాయి. విద్యా వ్యవహారాలపై దృష్టి. నిర్ణయాదుల్లో కొంత ఆలస్యాదులకు అవకాశం. వ్యాపారానుబంధాలు బాగా విస్తరిస్తాయి. భాగస్వామితో ప్రయాణావకాశాలు. వారాంతంలో అభీష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నం. సంతానవర్గ సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం. సృజనాత్మకత తగ్గవచ్చు. ప్రణాళికల్లో కొంత జాగ్రత్త. నిర్ణయాదులు బాగా ఆలస్యం కావచ్చు. కొంత నైరాశ్య ధోరణి. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలపై దృష్టి. ప్రయోజనాలు అధికం. అయినా ఆశించిన తృప్తి ఉండదు. ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. దానధర్మాలు చేయడం వల్ల మేలు కలుగుతుంది. వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీలు ఒత్తిడులకు అధిగమించాలి. ఆధ్యాత్మిక యాత్రలుంటాయి. ధార్మికమైన పెట్టుబడులకు అవకాశం. ఆలస్య నిర్ణయాదులు ఇబ్బంది పెట్టవచ్చు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు. వ్యాపార వర్గ సహకారం లభిస్తుంది. వారాంతంలో నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. బాధ్యతలు అధికమైన శారీరక ఒత్తిడులు, అనారోగ్యం కలిగించే సూచనలు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. శ్రమతో కార్యాలు. కొంత నిరాశ తప్పకపోవచ్చు. అన్ని పనుల్లోనూ ఆలస్యం. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు కొన్ని ఏర్పడక తప్పదు. కార్యనిర్వహణలో పోటీలు, ఒత్తిడులున్నా అధిగమిస్తారు. గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపార అనుబంధాలు మెరుగుపడతాయి. గురువులు, ధార్మిక సంస్థలకు సంబంధించిన అంశాలపై దృష్టి. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఉన్నా గుర్తింపు, గౌరవాదులుంటాయి. వారాంతంలో సమస్యలు పెరుగుతాయి. అనారోగ్య ఇబ్బందులు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. చికాకులు అధికం. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఏదో పోగొట్టుకునే అవకాశం. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. స్ర్తిలతో జాగ్రత్త.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ వ్యవహారాలపై దృష్టి. ఆర్థిక నిల్వలు సంతోషాన్నిస్తాయి. మాట తీరులో మంచి మార్పులుంటాయి. సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదర వర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. విద్యాత్మక లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక, వైజ్ఞానికమైన ప్రయాణాలుండే అవకాశం. సౌకర్య లోపాలను అడ్జస్ట్ చేసుకోవాలి. సౌకర్యాలు దొరకక పోవచ్చు. వ్యాపారాదుల్లో గుర్తింపు, గౌరవాదులకు అవకాశం. అభివృద్ధి ఉంటుంది. వారాంతంలో ఆహార విహారాలపై దృష్టి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గృహ వాహనాదుల విషయంలో కొత్త నిర్ణయాదులుంటాయి. విద్యాత్మక వ్యవహారాలకు అనుకూలం. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు, పదోన్నతులపై దృష్టి కేంద్రీకరిస్తారు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి. లాభాలు సంతోషాన్నిస్తాయి. ప్రయోజనాల వల్ల సంతృప్తి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గురువుల, దైవానుగ్రహం లభిస్తుంది. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాలు నిర్వహిస్తారు. కొన్ని వ్యర్థమైన ఖర్చులుండే అవకాశం. కుటుంబంలో అనుకూలత. మాటల్లో చమత్కార ధోరణి ఉంటుంది. వారాంతంలో కాలం ధనం పోగొట్టుకునే సూచనలు. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులకు అవకాశం. నైరాశ్య ధోరణి ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆకర్షణీయంగా వ్యవహరిస్తారు. అధికారులతో సంప్రదింపులు ఉంటాయి. అధికారిక ప్రయాణాలకు అవకాశం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. సంతాన వ్యవహారాలు చర్చలకు వస్తాయి. కొత్త తలపులు. అదే విధంగా వ్యతిరేక ప్రభావాలు కూడా అధికం. రుణాదుల వ్యవహారాలు తెరపైకి వస్తాయి. శత్రు భావన తగ్గించుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. ఖర్చులు, పెట్టుబడులు తప్పకపోవచ్చు. యాత్రలలో జాగ్రత్తగా మెలగాలి. పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. భాగస్వామితో సమస్యలకు అవకాశం. ఉన్నత వ్యవహారాలు, విద్యాత్మక, వ్యాపారాత్మక విషయాల్లో కొత్త పోకడలుంటాయి. వారాంతంలో పరిచయాలు, స్నేహానుబంధాలపై దృష్టి. భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని వాగ్వాదాలకు అవకాశం. ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవద్దు. కొంత నిరాశా భావన. దూర ప్రయాణాలకు అవకాశం. విద్యాత్మక వ్యవహారాలకు అనుకూలం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. భాగస్వామ్యాలపై దృష్టి. కార్యనిర్వహణపై దృష్టి. బాధ్యతలు విస్తరిస్తాయి. కుటుంబ, ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలను పెంచుకుంటారు. కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడులకు అవకాశం. మాట వల్ల గౌరవం పెరుగుతుంది. సేవక వర్గంతో సంప్రదింపులుంటాయి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. సోదర వర్గ వ్యవహారాలు చర్చకు వస్తాయి. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఇతరులకు సహకరించడం మంచిది. సంతాన వ్యవహారాల్లో సంతృప్తి. ప్రణాళికలు సంతోషాన్నిస్తాయి. వ్యతిరేకతలపై విజయం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. విద్యాత్మక వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. సుదూర ప్రయాణాలపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలలు సంతృప్తినిస్తాయి. దైవ దర్శనాదులకు అనుకూలం. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాలను నిర్వహిస్తారు. సామాజిక హోదా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలి. వారాంతంలో లాభాలు ఒత్తిడులకు గురి చేస్తాయి. వ్యర్థమైన ప్రయత్నాలుంటాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. చమత్కారంగా ప్రవర్తిస్తారు. కొత్త పనుల నిర్వహణలో అనుకూలత. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక వ్యవహారాల్లో లోపాలకు అవకాశం. ఆలోచనలకు రూపకల్పన.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో గృహ వాహనాది సౌకర్యాలు, సౌఖ్యం. ఆహార విహారాలపై దృష్టి కొనసాగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త పనులు, నిర్వహణ, ప్రణాళికలపై దృష్టి. సంతాన వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలుంటాయి. ప్లానింగ్‌కు అనుకూలం. ఉన్నత విద్యలపై దృష్టి. వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంలో జాగ్రత్త. వ్యాపారాదుల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలను ఆశించరాదు. కొంత సేవాభావం అవసరం. వారాంతంలో రుణ వ్యవహారాలు చర్చలకు వస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. శత్రువులపై విజయం. పోటీ రంగంలో గుర్తింపు. స్ర్తి వర్గంతో సమస్యలకు అవకాశం. జాగ్రత్తగా మెలగాలి. కీర్తి ప్రతిష్ఠలను పెంచుకుంటారు. ఉన్నత విద్యా వ్యవహారాలుంటాయి. ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు. విందులు వినోదాల కోసం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దానధర్మాల వల్ల మేలు అధికం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నూతన బాధ్యతల నిర్వహణ, కార్యక్రమాలపై దృష్టి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. గౌరవం పెరుగుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో కొంత ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. వారాంతంలో మాట విలువ తగ్గే సూచనలు. ఆర్థిక నిల్వలు తగ్గిపోవచ్చు. బంధుమిత్ర వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కొన్ని అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలుంటాయి. నైరాశ్య ధోరణితో మాటలుంటాయి. గృహ వాహనాదుల్లో శుభ పరిణామాలు.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. ఇబ్బందులు పొందే అవకాశం. అనారోగ్యం. ఊహించని సంఘటనలు. అన్ని విషయాల్లో అప్రమత్తంగా మెలగాలి. క్రమంగా లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నతి. గుర్తింపు. గౌరవాదులుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఉన్నత విద్యలుంటాయి. ఆధ్యాత్మికఒ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ధార్మికమైన ప్రయాణాలకు అవకాశం. వృత్తిలో కొంత వత్తిడులు తప్పకపోవచ్చు. వ్యాపారాదుల్లో పెట్టుబడులుంటాయి. సంప్రదింపులకు అనుకూలం. వారాంతంలో అధికారిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు కూడదు. పితృవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సామాజిక గౌరవం తగ్గవచ్చు. పదోన్నతులపై దృష్టి పెట్టకూడదు. ఆహార విహారాల విషయంలోనూ అధిక శ్రమ ఉంటుంది.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744