వారం వారం గోచారం

వారం వారం గోచారం (5-5-2019 నుంచి 11-5-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలు అధికం. విందులు, విహారాల కోసం పెట్టుబడులు అధికవౌతాయి. కుటుంబ వ్యవహారాలపై దృష్టి. ఆర్థిక నిల్వలను పెంచుకునే ఆలోచనలు, శారీరకమైన ఒత్తిడులు తప్పకపోవచ్చు. మాటతీరులో కొంత జాగ్రత్త. సౌకర్యాదులపై దృష్టి ఉంటుంది. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాదులు ప్రభావితం చేస్తాయి. కొత్త వార్తలు వింటారు. తొందరపడి మాటాలడవద్దు. కొన్ని వార్తల వల్ల అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. వారంతంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాది సౌఖ్యాలు, సౌకర్యాదులను పెంచుకునే సూచనలు. విద్యారంగంలోని వారికి శుభపరిణామాలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో అత్యున్నత వ్యవహారాలపై దృష్టి, కీర్తిప్రతిష్టలు సంతోషాన్ని ఇస్తాయి. స్ర్తివర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. అనుకోని సమస్యలకు అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాలను సంతోషంగా నిర్వహిస్తారు. కార్యనిర్వహణ దక్షత. బాధ్యతలు అధికవౌతాయి. సామాజిక గౌరవం శ్రమతో పెంచుకునే ప్రయత్నం. ఉన్నత లక్ష్యాలను శ్రమతో నెరవేర్చుతారు. వారం మధ్యమంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. అనేక రూపాల్లో ప్రయోజనాలు ఆశించినప్పటికీ ఫలితాలు చిత్రంగా ఉంటాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. దైవానుగ్రహం కోసం ప్రయత్నించడం మంచిది. వారంతంలో విందులు, విహారాలకోసం కాలం ధనం వెచ్చిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్ప. అభీష్టాలు నెరవేరుతాయి. ఆహార విహారాల్లో అనుకూలత. సౌఖ్యంగా, సౌకర్యవంతంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. కొత్త పనులపై దృష్టి. వ్యవహారాల్లో శ్రమ తప్పకపోవచ్చు. గుర్తింపు లభిస్తుంది. పోటీ రంగంలో అనుకూలత. కొంత దైవశక్తిని పెంచుకోవడం ద్వారా శ్రమ తగ్గే అవకాశం. వారం మధ్యమంలో భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. అనేక రకాల పరిచయాలు పెరుగుతాయి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. తొందరపాటు కూడదు. స్నేహానుబంధాల వల్ల కాలం ధనం వ్యర్థం అయ్యే సూచనలు. వారంతంలో కొన్ని అనుకోని సమస్యలుంటాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు. అనేక రూపాల్లో కాలం, ధనం, శ్రమ కోల్పోయే అవకాశం. లాభాలున్నా అప్రమత్తంగానే మెలగాలి. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వపు చెల్లింపులు తొందరగా చెల్లించాలి. ఒత్తిడి వస్తుంది. సంప్రదింపులలో శుభపరిణామాలుంటాయి. వారం మధ్యమంలో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక వ్యవహారాలపై దృష్టి. మాటతీరువల్ల కొంత చికాకు. తొందరపాటు కూడదు. నిల్వధనం తగ్గిపోయే భావనలు. వారంతంలో సంప్రదింపులుంటాయి. సోదరవర్గ వ్యవహారాలపై దృష్టి. ఇతరుల సహకారం లభిస్తుంది. ప్రయాణాదులకు అవకాశం అధికం. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కూడదు. భాగస్వామ్యాల్లో మరింత జాగ్రత్త అవసరం. క్రమంగా ఉన్నత లక్ష్యాలపై దృష్టి. విద్య ఉద్యోగాదుల్లో అనుకూలత. సుదూర ప్రణాళికలుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో సంతోషం, సంతృప్తి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. ప్రభుత్వపు చెల్లింపుల విషయంలోనూ జాగ్రత్త. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. వ్యాపారాదుల్లోనూ కొంత మేలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ఇతరుల ప్రభావానికి లోను కావద్దు. దానధర్మాలు, దైవ దర్శనాదుల వల్ల మరింత మేలు. వారంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ప్రయాణాలకు ప్రణాళికలు. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు. విద్యా వ్యవహారాల్లో అనుకూలత. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. ప్రయత్న పూర్వకంగా కార్యనిర్వహణ. క్రమంగా ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానంతో సంతోషంగా గడిపే ప్రయత్నం. ప్రణాళికలకు రూపకల్పన. వారం మధ్యమంలో పోటీరంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. ఋణ రోగాదులు ఇబ్బందులను శ్రమతో అధికమించాల్సి ఉంటుంది. కాలం ధనం కోల్పోకుండా చూడాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వ్యతిరేకతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వారంతంలో భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లోనూ గుర్తింపు లభిస్తుంది. సామాజిక గౌరవం పెంచుకుంటారు. పెట్టుబడులపై దృష్టి. ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రయాణావకాశాలున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలవల్ల మరింత మేలు. అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత సంతోషం, సంతృప్తి. వారం మధ్యమంలో నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. అనేక రకాల బాధ్యతల నిర్వహణ తప్పకపోవచ్చు. నూతన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. ఆత్మ విశ్వాసం పెంచుకునే ప్రయత్నం. కొన్ని తొందరపాట్లు ఉంటాయి. అప్రమత్తంగా మెలగాలి. వచ్చిన అవకాశాలను పోగొట్టుకునే అవకాశం. వారంతంలో ఆర్థిక వ్యవహారాల్లో సంతోషం. కుటుంబ బాధ్యతలను ఆనందంగా నెరవేరుస్తారు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. అధికారిక పరిచయాలు పెంచుకునే ప్రయత్నం. వ్యాపారాదుల్లో అనుకూలత. కొత్త పనులపై దృష్టి. పోటీల్లో విజయం సాధిస్తారు. క్రమంగా కార్యనిర్వహణలో సమస్యలుంటాయి. అనుకోని ఇబ్బందులుంటాయి. అనారోగ్య భావనలుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ఊహించని సంఘటనలకు అవకాశం. నిర్ణయాదులను వాయిదా వేయడం మంచిది. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. అనేక కార్యక్రమాల ప్రణాళికలు సంతోషాన్నిస్తాయి. విద్య, ఉద్యోగాదులు, కీర్తి ప్రతిష్టలపై దృష్టి. అయినా ఎక్కడో కొంత అసంతృప్తి ఉంటుంది. దూర ప్రయాణాలకోసం ప్రయత్నం ఉంటుంది. వారంతంలో అధికారిక కార్యక్రమాలపై దృష్టి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. అధికారిక సహకారాలు అందుతాయి. కుటుంబంలోనూ శుభపరిణామాలుంటాయి. ఆహార విహారాల్లో అనుకూలత. సౌకర్యాలు కలిసి వస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. అన్ని పనుల్లోనూ శ్రమ ఉన్నా సంతోషం లభిస్తుంది. విద్యాత్మక వ్యవహారాల్లో నిమగ్నవౌతారు. వారం మధ్యమంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. సంతానంతో సంతోషంగా గడిపే ప్రయత్నం. స్పెక్యులేషన్‌లకు అనుకూలం. ప్రణాళికాబద్దంగా గడిపే ప్రయత్నం. అన్ని ఆలోచనల్లోనూ కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. దైవధ్యానంవల్ల మాత్రమే మేలు కలుగుతుంది. వారంతంలో వ్యతిరేక భావనలు ఇబ్బంది పెట్టే అవకాశం. పోటీరంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక కార్యక్రమాలు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి. సుదూర ప్రయాణ భావనలు. లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల అనుకూలత. ప్రయోజనాల వల్ల కొంత సంతృప్తి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. పదోన్నతలు. అధికారుల ఆదరణ. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు. ప్రయాణావకాశాలు. కాలం ధనం వ్యర్థం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దానధర్మాల వల్ల మరింత మేలు కలుగుతుంది. తొందరపాటు కూడదు. విశ్రాంతిలోపానికి కూడా అవకాశం అధికం. వారంతంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. బాధ్యతలు అధికం. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు తప్పకపోవచ్చు. విజయసాధన కోసం ప్రయత్నం అవసరం. గెలుపు లభిస్తుంది. కార్యనిర్వహణలో శ్రమ తప్పదు. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. ప్రయాణాదులకు అవకాశం ఉంటుంది. శ్రమ కొంత ఉన్నప్పటికీ కార్యనిర్వహణలో సంతోషం. భాగస్వామితో ఆహార విహారాలుంటాయి. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. చిన్న చిన్న ప్రమాదాలకు అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. ముఖ్యనిర్ణయాదులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారాల్లో ఒత్తిడులుంటాయి. వారాంతంలో అన్ని పనుల్లోనూ అనుకూలత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. ఆనందంగా గడుపుతారు. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. నిల్వధనం పెంచుకునే ఆలోచనలుంటాయి. క్రమంగా సంప్రదింపులకు అనుకూలం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. కొత్త వార్తలను వింటారు. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. మాటల్లో అధికారిక ధోరణి ఉంటుంది. జాగ్రత్త. వారం మధ్యమంలో ఆహార విహారాలపై దృష్టి, సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు కాని ఆశించిన సంతృప్తి లభించదు. అన్ని పనుల్లోనూ శ్రమ ఉంటుంది. గృహ వాహనాది సౌకర్యాల విషయంలోనూ చికాకులు తప్పకపోచ్చు. విద్యారంగంలో ఒత్తిడులు, వారంతంలో అభీష్టాలు నెరవేర్చుకుంటారు. అన్ని పనుల్లోనూ అనుకూలత.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744