వారం వారం గోచారం

వారం వారం గోచారం (28-7-2019 నుంచి 3-8-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలు చర్చలోకి వస్తాయి. నిల్వధనం సమకూర్చుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. క్రమంలో సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదర వ్యవహారాలపై దృష్టి. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం. కొన్ని వార్తలు ప్రభావితం చేస్తాయి. కమ్యూనికేషన్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యమంలో ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. సౌఖ్య లోపం సంభవం. విద్యారంగంలోని వారికి అనుకూలత. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. అభీష్టాలు నెరవేరుతాయి. సంతాన సంబంధమైన వ్యవహారాలు చర్చకు వస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలు, సామాజికాంశాలపై దృష్టి. తండ్రి తరఫు వారి విషయాలు చర్చలోకి వస్తాయి. గుర్తింపు, గౌరవం పెంచుకునే ప్రయత్నం. క్రమంగా అన్ని పనుల్లోనూ లాభాలపై దృష్టి. పెద్దల ఆశీస్సులు, ప్రయోజనాలు సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్త పనుల నిర్వహణ. వ్యాపార వ్యవహారాల కోసం ఖర్చులు, పెట్టుబడులుంటాయి. వారం మధ్యమంలో కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నింటిలోనూ ఆచితూచి వ్యవహరించాలి. విశ్రాంతి లోపం సంభవం. తొందరపాటు నిర్ణయాలు కూడదు. విందులు విహారాల్లోనూ కొంత జాగ్రత్త అవసరం. వారాంతంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలు అధికం. శ్రమతో కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. పోటీలు ఒత్తిడులుంటాయి. చికాకు పడకుండా కార్యనిర్వహణ చేయాలి. రుణ, రోగాదులు ప్రాధాన్యం వహిస్తాయి. క్రమంగా భాగస్వామ్యాలు ప్రాధాన్యం వహిస్తాయి. పరిచయాలు పెంచుకుంటారు. పాత మిత్రుల కలయిక, కొత్త వ్యక్తులు, కొత్త భావాలతో కొంత జాగ్రత్తగా మెలగాలి. వ్యాపార భాగస్వామ్యాల్లో ఇబ్బందులు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావాలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. చిన్నచిన్న ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాలి. శారీరక మానసిక వత్తిడులు తప్పకపోవచ్చు. అధికారిక లోపాలకు కూడా అవకాశం ఉంటుంది. వారాంతంలో ఉన్నత లక్ష్యాలు ప్రభావితం చేస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నిర్ణయాదులు లాభిస్తాయి. బాధ్యతలు పెంచుకుంటారు. సంతోషంగా అన్ని పనుల్లోనూ పాల్గొంటారు. క్రమంగా కుటుంబంలో అనుకూలత. బంధువర్గంతో కలయిక, మాట్లాడే తీరులో కొంత అప్రమత్తంగా మెలగాలి. నిల్వధనం వ్యర్థం పోకుండా చూసుకోవాలి. వ్యాపార వ్యవహారాల వైపు దృష్టి కేంద్రీకరిస్తారు. వారం మధ్యమంలో కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల అనుకూలత. కొన్ని వార్తలు కలవరపెట్టే సూచనలు. అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపార వర్గం వారితో సంప్రదింపులుంటాయి. వారాంతంలో ఆహార విహారాలపై దృష్టి. సౌకర్యాలు పెంచుకుంటారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సుదూర లక్ష్యాలను నెరవేర్చుకునే ప్రయత్నం. పరిశోధన రంగంలోని వారికి అనుకూలత. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ప్రయాణావకాశాలు. క్రమంగా సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. గుర్తింపు గౌరవాదులు ప్రాధాన్యం వహిస్తాయి. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వారం మధ్యలో లాభాలు ప్రాధాన్యం వహిస్తాయి. అనేక రూపాల్లో అనుకూలత. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రయోజనాలు సంతృప్తిని ఇస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనులపై దృష్టి ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం అధికం. పరిశోధన వ్యవహారాల్లో అనుకూలత. వైజ్ఞానిక ధోరణి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకుంటారు. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలు చర్చిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. క్రమంగా వ్యతిరేకతలు సంభవం. పోటీలు, ఒత్తిడులు చికాకులను అధిగమించాలి. విజయ సాధనపై దృష్టి. శారీరక ఒత్తిడులు శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. రుణ రోగాదులు ఇబ్బంది పెట్టే సూచనలు. వారం మధ్యమంలో భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. అధికారులు, వ్యాపారులు, కాంట్రాక్టులు అన్ని వ్యవహారాల్లోనూ కొంత ప్రయోజనం ఉన్నా ఇబ్బందులు కూడా ఉండవచ్చు. జీవిత భాగస్వామితో తగాదాలు పనికిరావు. పరిచయాలు పెరిగినా కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. పెట్టుబడులు తప్పకపోవచ్చు. ప్రయాణాలుంటాయి. విందులు, వినోదాలు, విహారాల కోసం వెచ్చిస్తారు. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యం. క్రమంగా నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. ఇతరుల భావనలకు లోబడే అవకాశం ఉంది. జాగ్రత్త. తొందరపాటు కూడదు. అన్ని నిర్ణయాదుల్లో ఆచితూచి ఆలోచించి వ్యవహరించాలి. వారం మధ్యలో కుటుంబ ఆర్థికాంశాలు ప్రాధాన్యం వహిస్తాయి. నిల్వధనం కోసం ఆలోచిస్తారు. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొంటారు. మాటల్లో అతి జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఉండకపోవచ్చు. పోటీలు ఒత్తిడులు అధికవౌతాయి. శ్రమతో ఫలితాలు, గుర్తింపు. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. అధికారిక ప్రయోజనాలు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావాలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. కార్యనిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. క్రమంగా నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. ఉన్నత విద్య, ఉద్యోగాలు ప్రాధాన్యం వహిస్తాయి. సుదూర ప్రయాణాలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వారం మధ్యలో వృత్తిలో గుర్తింపు. పదోన్నతులకు అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గౌరవం పెంచుకుంటారు. పితృవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. అధికారుల ఆదరణ, వ్యాపారాదుల్లో అనుకూలత. వారాంతంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. ప్రయోజనాలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలపై దృష్టి. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాదుల విషయం చర్చకు వస్తుంది. ప్రయాణాలకు అవకాశం. శ్రమతో విద్యా వ్యవహారాలుంటాయి. క్రమంగా ఆలోచనలకు రూపకల్పన. కొత్త పనులు. నిర్ణయాదులు సంతోషాన్ని ఇస్తాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. వైజ్ఞానిక భావనలు విస్తరిస్తాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సంతానంతో సంతోషంగా గడుపుతారు. వారం మధ్యమంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు వత్తిడులను అధిగమిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమాధిక్యం. విజయ సాధన ఉంటుంది. వ్యాపారాదుల్లోనూ అనుకూలత. మానసిక వత్తిడులు అధికం. రెసిస్టెన్స్ ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది. వారాంతంలో భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. పరిచయాలు పెంచుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు, శుభాకాంక్షలు అందుకుంటారుర. శారీరక ఒత్తిడులు ఉన్నా కార్యాలలో అనుకూలత. క్రమంగా ఖర్చులు అధికం. వేరు వేరు రూపాల్లో పెట్టుబడులుంటాయి. విశ్రాంతి కోసం ప్రయత్నించినా దొరకక పోవచ్చు. పరామర్శలకు అవకాశం. విందులు వినోదాల కోసం ప్రయాణాలుంటాయి. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. వారం మధ్యమంలో నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగినా మొండితనం అధికవౌతుంది. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. మనస్సును నిర్మలంగా పెట్టుకోవాలి. శారీరక ఒత్తిడులు అధికవౌతాయి. వారాంతంలో కుటుంబ ఆర్థికాంశాలు ప్రాధాన్యం వహిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. పరిచయాలు స్నేహానుబంధాలు పెంచుకునే ప్రయత్నం. ఆత్మీయత పెరుగుతుంది. భాగస్వామితో కలిసి దూర ప్రయాణం చేసే అవకాశం. క్రమంగా అన్ని పనుల్లోనూ లోపాలకు అవకాశం. ముఖ్యంగా వ్యాపార నష్టాలుంటాయి. అనుకోని ఇబ్బందులు, అనారోగ్య భావాలు, వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాదులు వాయిదా వేయడం మంచిది. వారం మధ్యమంలో కొత్త పనులపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఆశించిన సంతృప్తి అందకపోవచ్చు. సుదూర ప్రయాణ భావాలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలకు అనుకూలం. కుటుంబ గౌరవాన్ని కాపాడుకునే దిశగా ప్రయత్నం. వారాంతంలో వృత్తిలో గుర్తింపు. వ్యాపారాదుల్లో లాభాలు.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. కొత్త వార్తలు వింటారు. సోదర వర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. క్రమంగా విందులు వినోదాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. అన్ని పనుల్లోనూ శ్రమ తప్పకపోవచ్చు. గృహ వాహనాది సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. విద్యారంగంలోని వారికి శుభ పరిణామాలు. వారం మధ్యమంలో ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం. సంతాన వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. క్రియేటివిటీ ఉన్నా సమయానుకూలంగా వినియోగపడక పోవచ్చు. అనేక రూపాల్లో వత్తిడులు వస్తుంటాయి. ప్రశాంతంగా కాలం గడపాల్సిన అవసరం ఉంది. వారాంతంలో వ్యతిరేక ప్రభావాలుంటాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744