వారం వారం గోచారం

వారం వారం గోచారం (20.10.2019 నుంచి 26.10.2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో సమాచార లోపాలుంటాయి. అనవసర ప్రయాణాలుంటాయి. మీడియా రంగంలోని వారికి అనుకూలత. సంప్రదింపులలో జాగ్రత్త వహించాలి. కమ్యూనికేషన్స్‌లో లోపాలకు అవకాశం. సోదర వర్గ వ్యవహారాల్లో కొన్ని చికాకులు ఏర్పడవచ్చు. వారం మధ్యమంలో గృహం, వాహనం మొదలైన అంశాలపై దృష్టి పెరుగుతుంది. ఆహార విహారాలుంటాయి. సౌఖ్యంగా కాలం గడిపే అవకాశం. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. విద్యా రంగంలోని వారికి అత్యంత అనుకూలం. కృషితో కార్యక్రమాల నిర్వహణ. మాతృవర్గం వారి వ్యవహారాలపై దృష్టి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సామాజిక గౌరవం పెరుగుతుంది. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికలకు అనుకూలం. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడి. నూతన కార్యక్రమాలపై దృష్టి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలపై దృష్టి ఉంటుంది. ప్రయోజనాపేక్ష. పెద్దలతో కొంత జాగ్రత్త. అతి లాభాల కోసం ఆశించి భంగపడే అవకాశం. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పనుల నిర్వహణలో సమస్యలు ఎదురౌతాయి. వారం మధ్యమంలో ఖర్చులు, పెట్టుబడులు అధికం. వినోదాలు, విహారాల కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. విశ్రాంతి లభిస్తుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వస్తు సముదాయం సమకూర్చుకుంటారు. వారాంతంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. కార్యనిర్వహణలో సంతోషం. అనేక బాధ్యతలను నిర్వర్తిస్తారు. భాగస్వామ్యాల్లో సంతోషంగా కాలం గడుపుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామితో సమస్యలు. పరిచయాలు ఇబ్బంది పెట్టవచ్చు. స్నేహ సంబంధాల్లో ఇబ్బందులు. సామాజిక అనుబంధాలు ఇబ్బంది పెట్టే అవకాశం. నిర్ణయ లోపాలు. ఆలస్యం, బద్దకం పెరుగుతుంది. అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు వ్యవహారాలు కూడదు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. కొన్ని ఊహించని సంఘటనలు. కుటుంబంలో కొంత అనుకూలత. మాట విలువ పెరగవచ్చు. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. నిల్వధనంపై దృష్టి. శ్రమ రహిత ఆదాయం కొరకు ఆలోచనలు. వారాంతంలో నూతన కార్యక్రమాల నిర్వహణ. ఉన్నత ఉద్యోగాదులు. దూర ప్రయాణాలు. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మరింత మేలు కలుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక నిర్ణయాలకు అనుకూలం. బంధువర్గంతో అప్రమత్తంగా మెలగాలి. నిల్వధనం కోల్పోయే అవకాశం. కాలం ధనం వ్యర్థం కావచ్చు. వారం మధ్యలో కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. దగ్గరి ప్రయాణాలు. ఉన్నత విద్య, ఉద్యోగాదులపై దృష్టి. సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో పరిశోధకులకు మంచి అవకాశాలు. సోదరీ వర్గంతో సంప్రదింపులకు అవకాశం. విందులు, విహార యాత్రలు. వారాంతంలో ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాదులు చర్చల్లోకి వస్తాయి. కొన్ని పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తారు. కృషితో కార్యక్రమాల్లో అనుకూలత. భాగస్వామితో సౌఖ్యంగా గడిపే ప్రయత్నం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో లోపాలకు అవకాశం. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. అనేక రకాల పనులు వరుసగా ఇబ్బంది పెడుతుంటాయి. వ్యాపార వ్యవహారాలు, సేవా రంగంలో ఆచితూచి వ్యవహరించాలి. పితృవర్గం వారితో చికాకులుంటాయి. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. కొత్త పనులపై దృష్టి. మంచి ఆలోచనలు. సృజనాత్మకత. ప్రణాళికాబద్ధమైన జీవితం. పెద్దల నుండి మంచి ఆశీస్సులు అందుతాయి. వేరు వేరు రూపాలలో లాభాలు అందుతాయి. సంతాన వర్గంతో సంతోషంగా కాలం గడుపుతారు. వారాంతంలో ప్రయాణాలకు అవకాశం. ఖర్చులు, పెట్టుబడులు పెరుగుతాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం. విశ్రాంతి కోసం ప్రయత్నం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు చికాకులు ఉంటాయి. విజయ సాధన కోసం ప్రయత్నం. మొండితనంతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యతిరేకతలు అధికం. రుణాదులు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడాలి. పోటీ రంగంలో అప్రమత్తంగా మెలగాలి. వ్యర్థమైన ఖర్చులుంటాయి. వారం మధ్యమంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలకు అవకాశం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. పాత మిత్రులు గుర్తుకు వస్తారు. కార్యనిర్వహణ దక్షత. వారాంతంలో అనుకోని ఇబ్బందులుంటాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. ఊహాతీత సంఘటనలు. అప్రమత్తంగా మెలగాలి. వృత్తి ఉద్యోగాదుల్లోనూ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు కూడదు. ఆత్మవిశ్వాస లోపాలకు అవకాశం. కాలం ధనం వ్యర్థం కావచ్చు. ఎదుటి వారితో జాగ్రత్తగా మెలగాలి. భాగస్వామ్యాల్లో సమస్యలు. చికాకులకు అవకాశం. వారం మధ్యమంలో కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత. బంధువర్గంతో సంతోషం. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. మాట విలువ పెరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఉండవచ్చు. సమస్యలను అధిగమిస్తారు. సంతోషంగా గడుపుతారు. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. ఆలోచనల్లో కొన్ని ఒత్తిడులుంటాయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి. సోదర వర్గంతో అనుకూలం. సంతాన వర్గ వ్యవహారాల్లో కొంత శ్రద్ధ వహించాలి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సుదూర ప్రయాణ భావనలు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సుదూర ప్రయాణాలు. అసంతృప్తి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు తగ్గిపోయే అవకాశం. వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. సేవక వర్గ సహకారంపై దృష్టి. సోదరులతో విభేదాలు. సంప్రదింపుల్లో సమస్యలు. వారం మధ్యమంలో సామాజిక గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు. వ్యాపారాదుల్లో గుర్తింపు, లాభాలు. ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. వృత్తిలో రాణింపు లభిస్తుంది. తండ్రి వర్గ సంబంధమైన వారితో సంప్రదింపులుంటాయి. వారాంతంలో వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. లాభాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. నిర్ణయ లోపాలకు అవకాశం. స్థిమితంగా ఉండాలి. సంతానవర్గ సంబంధ సమస్యలుంటాయి. పనుల నిర్వహణలో ప్రణాళికా లోపాలుంటాయి. సృజనాత్మక శక్తి ఉన్నా రాణింపు తక్కువగా ఉంటుంది. వారం మధ్యమంలో వ్యతిరేకతలు. పోటీలు అధికం. వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. గుర్తింపు లభిస్తుంది. రోగ రుణాలను అధిగమించాలి. విజయం సాధిస్తారు. ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం. వారాంతంలో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఉన్నత కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. భాగస్వామ్యాల్లో అనుకూలత. వ్యాపారాలు విస్తరించే అవకాశం. అధికారికమైన ఒత్తిడులను ఎదుర్కోవాలి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. పెట్టుబడులు అధికం. కాలం ధనం కోల్పోవచ్చు. విశ్రాంతి లోపం ఉంటుంది. పరామర్శలకు అవకాశం. ఆసుపత్రులను దర్శించే అవకాశం. పోటీ రంగంలో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వ్యర్థమైన ప్రయాణాలుంటాయి. దానధర్మాల వల్ల మేలు. వారం మధ్యమంలో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత. అనేక బాధ్యతలుంటాయి. సంతోషంగా కాలం గడుపుతారు. భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. కొన్ని సౌకర్య లోపాలు. మాట విలువ పెరుగుతుంది. బంధువర్గంతో సంతోషం. నిల్వధనం పెంచుకునే ప్రయత్నాలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలు. అనారోగ్యం. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. అనిశ్చితమైన పనులు. కుటుంబంలో ఒత్తిడి. నిల్వధనం కోల్పోయే అవకాశం. మాట విలువ తగ్గుతుంది. చికాకులు అధికం. వారం మధ్యమంలో కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. ప్రయాణాల్లో సంతోషం. విద్య, వైజ్ఞానిక యాత్రలు, పరిశోధనలకు రూపం ఏర్పడుతుంది. ఉన్నత ఉద్యోగాదులకు అవకాశం. గౌరవం పెరుగుతుంది. దానధర్మాల వల్ల మేలు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతంలో పితృవర్గంతో సత్సంబంధాలు. సామాజిక గౌరవం కోసం వ్యర్థమైన ఖర్చులు. గుర్తింపు కోసం ప్రయత్నం ఉంటుంది. పదోన్నతులున్నా సంతోషం ఉండకపోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాలున్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గృహ వాహనాదుల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. శ్రమాధిక్యం. పితృవర్గంతో సమస్యలు. కార్యనిర్వహణలో జాగ్రత్త. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకత. నిర్ణయాలు సంతోషాన్నిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. మానసిక ప్రశాంతత. వారాంతంలో వ్యతిరేకతలు అధికం. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. కొన్ని అనుకోని సమస్యలు. అధికారిక లోపాలు. కార్యనిర్వహణలో జాగ్రత్త.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744