వారం వారం గోచారం

వారం వారం గోచారం (23.2.2020 నుంచి 29.2.2020 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని రూపాల్లోనూ లాభాలుంటాయి. ప్రయోజనాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నిస్తారు. విద్యా వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలుంటాయి. సంప్రదింపుల్లో జాగ్రత్త. సమాచార లోపాలుంటాయి. మీడియా రంగం వారు జాగ్రత్తగా మెలగాలి. సుదూర ప్రాంతాల ప్రయాణాలపై దృష్టి. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తారు. వారం మధ్యమంలో ఖర్చులు, పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. విలాసాలు, విహారాల కోసం ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాదుల విషయంలో జాగ్రత్తగా మెలగాలి. అధికారిక వ్యవహారాల్లో సమస్యలుంటాయి. వ్యాపారాదుల్లో లాభాలుంటాయి. కొత్త పనులపై దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారాంతంలో ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెరగడానికి ప్రయత్నిస్తారు. కొన్ని అనుకోని ప్రమాదాలు, ఇబ్బందులకు అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. కుటుంబ, బంధువర్గ, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మాటల్లో అనిశ్చితికి అవకాశం. కొంత గౌరవం తగ్గే సూచనలు, ధర్మ కార్యక్రమాలు, దైవ ప్రార్థనల వల్ల క్షేమం, వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. ఆథ్యాత్మిక యాత్రలకు అనుకూలం. సుదూర ప్రయాణాల విషయలం ఆటంకాలు కలుగవచ్చు. వ్యాపారాదుల్లో మంచి లాభాలకు అవకాశం. వారాంతంలో ఖర్చులు అధికం. పెట్టుబడులు తప్పకపోవచ్చు. కాలం, ధనం కొంత వ్యర్థం కావచ్చు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్టలు ప్రభావితం చేస్తాయి. ప్రయాణాలపై దృష్టి. ఆథ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం. విద్య, విజ్ఞాన పరిశోధనలకు అవకాశం. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఒత్తిడులు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దలతో పరిచయం ఏర్పడవచ్చు. కొత్త అనుబంధాలు సంతోషాన్ని ఇస్తాయి. వారం మధ్యమం వృత్తి, ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలపై దృష్టి. తండ్రివర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. నిర్ణయాదులు కొన్ని ఇబ్బంది పెడతాయి. అనారోగ్య భావనలు. ఆలస్యపు పని విధానాలు. వ్యాపారాల్లో అనుకూలత. నూతన కార్యక్రమాలపై దృష్టి, విహారాలుంటాయి. వారాంతంలో అన్ని పనుల్లోనూ లాభాలు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సంఘటనలు ప్రభావితం చేస్తాయి. అనారోగ్య భావాలు ఇబ్బంది పెట్టవచ్చు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. మొండితనం తగ్గించుకోవాలి. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే సూచనలు, కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. దూర ప్రయాణ అవకాశాలు, విశ్రాంతి లోపం కలుగుతుంది. పోటీ రంగంలో జాగ్రత్త వహించాలి. పెద్దలకు సరైన గౌరవ మర్యాదలు ఇవ్వాలి. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ఆథ్యాత్మిక యాత్రలకు అవకాశం ఉంటుంది. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు, స్నేహానుబంధాల్లో చికాకులుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో అనూహ్య సమస్యలు. వారాంతంలో వృత్తి, ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. పరిచయాలు, స్నేహానుబంధాలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ఆలోచనల్లో ఒత్తిడి. స్పెక్యులేషన్స్‌లో అధిక లాభాలపై దృష్టి. సంతానవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే ప్రయత్నం. తొందరపాటు కూడదు. ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. ఆలోచనలకు రూపకల్పన. కొత్త పనులపై దృష్టి. వారం మధ్యమంలో చికాకులుంటాయి. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వ్యతిరేకతలను అధిగమించాలి. పోటీలు, ఒత్తిడులకు దూరంగా మెలగాల్సి ఉంటుంది. భాగస్వామ్యాల్లో సమస్యలుంటాయి. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు ఎక్కువ. చికాకులను అధిగమించాలి. దైవధ్యానం మేలు కలిగిస్తుంది. గుర్తింపు కోసం ప్రయత్నం. శ్రమతో కార్యాలుంటాయి. సౌకర్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్త. వృత్తి, ఉద్యోగాదుల్లో శ్రమ. అనేక కార్యక్రమాల్లో ఒకేసారి పాల్గొనాల్సి ఉంటుంది. గృహ వాహనాదుల విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. వారం మధ్యమంలో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సామాజిక అనుబంధాల్లో అనుకూలత. నిర్ణయాదుల్లో ఆలస్యం. సంతానవర్గ సమస్యలు. వ్యాపారాదుల్లో శుభపరిణామాలుంటాయి. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. కార్య నిర్వహణలో సమస్యలుంటాయి. సౌకర్యలోపాలు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. సోదరవర్గంతో అనుకూలత. సంప్రదింపులకు అనుకూలం. సుదూర ప్రయాణాల వైపు దృష్టి సాగిస్తారు. వైజ్ఞానిక పరిశోధనలపై దృష్టి. పెద్దల సహకారం లభిస్తుంది. వారం మధ్యమంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. శ్రమ ఉన్నా సంతోషం. పోటీ రంగంలో అనుకూలత. సౌకర్యాలు కొంత ఇబ్బందులకు గురిచేస్తాయి. విద్యా వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలకు అనుకూలత. క్రియేటివిటీ పెరుగుతుంది. వారాంతంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు, స్నేహానుబంధాలు ప్రభావితం చేస్తాయి. ఆథ్యాత్మిక ప్రయాణాల వల్ల మేలు. వార్తలలో నిరాశ. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవచ్చు. పోటీరంగంలో గుర్తింపు. హార్మోన్ సమస్యలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. శ్రమతో కార్యక్రమాలుంటాయి. గృహ వాహనాది వ్యవహారాలకు అనుకూలం. మాటల వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ, ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలుంటాయి. కార్య నిర్వహణలో ఇబ్బందులుంటాయి. కాలం, ధనం వ్యర్థం అయ్యే సూచన. సౌఖ్యలోపాలు రాకుండా చూసుకోవాలి. వారం మధ్యమంలో క్రియేటివిటీ పెంచుకుంటారు. సంతానవర్గంతో సంతోషం. ఆలోచనలకు రూపకల్పన. సంతోషంగా గడుపుతారు. సేవకవర్గం యొక్క సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలలో ఒత్తిడులుంటాయి. సంప్రదింపుల్లో జాగ్రత్త. వ్యాపారాదుల్లో శుభపరిణామాలు. విద్యారంగంలో అనుకూలత.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. అధికారిక సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. నిర్ణయాదులు శ్రమకు గురి చేస్తాయి. అతి ప్రవర్తనల వల్ల సమస్యలు. తొందరపాటు కూడదు. భాగస్వామ్యాల్లో సమస్యలుంటాయి. పరిచయాలు, స్నేహానుబంధాల వల్ల ఇబ్బందులు. ఆలోచనలకు రూపకల్పన. పరిశోధన. ఆథ్యాత్మిక వ్యవహారాల్లో ప్రగతి ఉంటుంది. వారం మధ్యమంలో ఆహార విహారాలకు అనుకూలం. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాది వ్యవహారాలకు అనుకూలం. సౌఖ్యంగా కాలం గడిపే ప్రయత్నం. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి. వ్యాపారపరమైన సంప్రదింపులుంటాయి. కార్యనిర్వహణ దక్షత. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకుంటారు. నిర్ణయాదుల్లో కొంత నిరాశ తప్పదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక నిల్వలపై దృష్టి. మాటవిలువ పెంచుకునే ప్రయత్నం. కొన్ని ఖర్చులు తొందరపాటుగా పెట్టే అవకాశం. ఆహార విహారాల కోసం వెచ్చిస్తారు. థార్మిక కార్యక్రమాలపై దృష్టి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు కూడా అవకాశం ఉంటుంది. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. సోదరీమణుల సహకారం లభిస్తుంది. ప్రయాణాదులకు అవకాశం ఉంటుంది. నిర్ణయాదులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. బద్ధకం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల వల్ల నిల్వధనం పెంచుకుంటారు. వారాంతంలో సౌకర్యాలపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. కొన్ని పనిలేని ఖర్చులకు కూడా అవకాశం ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అలోచనలకు రూపకల్పన. నూతన నిర్ణయాదులకు అవకాశం. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆలోచనల్లో ఒత్తిడులు. సంతానవర్గ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. క్రియేటివిటీ పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పరిశోధనలకు అనుకూలం. వారం మధ్యమంలో కుటుంబ, ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో చమత్కార ధోరణి, కాంట్రాక్టు వ్యవహారాలు రాణిస్తాయి. బాంకు కార్యకలాపాలకు అవకాశం. కొన్ని వ్యర్థమైన ఖర్చులకు కూడా అవకాశం. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. వారాంతంలో సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాలి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు, పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం. ప్రయాణాలుంటాయి. కాలం, ధనం కోల్పోకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగాదులపై దృష్టి, అధికారిక వ్యవహారాలపై దృష్టి, కార్యస్థలంలో తొందరపాటు కూడదు. సౌకర్యాల విషయంలో కొంత ఒత్తిడి. ఆహార విహారాల్లో జాగ్రత్త. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి. వారం మధ్యమంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గుర్తింపు, గౌరవాదులుంటాయి. లాభాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. వ్యాపారాదుల్లో పెట్టుబడులు అధికంగా ఉంటాయి. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ