ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కావడంతో ఎపిలో పలు జిల్లాల్లో బుధవారం నాడు విస్తారంగా వర్షం కురుస్తోంది. వాయుగుండంగా ఇంకా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో కోస్తాజిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నం , కృష్ణపట్నం, ఓడరేవు తదితర తీర ప్రాంతాల్లో స్థానిక ప్రమాద సూచికలను ఎగురవేశారు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. తిరుపతిలో ఎడతెరిపిలేని వర్షంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమల ఆలయ పరిసరాల్లో నీటిని తొలగించే పనులను టిటిడి ఇఓ సాంబశివరావు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.