జాతీయ వార్తలు

అలోక్ వర్మ పిటిషన్ విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ వాయిదా వేసింది. సీల్డ్ కవర్‌లో ఉన్న నివేదికలోని అంశాలు ఓ జాతీయ ఛానల్‌లో రావటంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తంచేసింది. సీవీసీ నివేదికపై మాకు వాదనలు వినిపించే అర్హత మీలో ఎవ్వరికీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొయ్ ఆగ్రహాం వ్యక్తంచేశారు. అలోక్ వర్మ తన సమాధానాన్ని కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రాథమిక దర్యాప్తు నివేదికపై సీల్డ్ కవర్‌లో సమర్పించారు. అయతే ఈ వివరాలు ఎలా బయటకు వెళ్లాయంటూ అలోక్ వర్మ న్యాయవాది నారిమన్‌పై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఇవి ఎలా లీక్ అయ్యాయో తమకు తెలియదని, దీనికి బాధ్యులైన వ్యక్తులపై సమన్లు జారీ చేయాలని నారిమన్ కోర్టును కోరారు. అనంతరం ఈ కేసు విచారణను నవంబరు 29కి వాయదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.