ఆంధ్రప్రదేశ్‌

17న వర్తకం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* డిమాండ్ల చిట్టాతో వర్తక సదస్సు తీర్మానాలు
రాజమహేంద్రవరం, మార్చి 13: రాష్ట్రంలో వర్తకులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు 17న రాష్ట్ర వర్తక బంద్ నిర్వహించాలని రాష్ట్ర వర్తక సదస్సు తీర్మానించింది. ఆదివారం రాజమహేంద్రవరంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శ్రీ బొమ్మన రామచంద్రరావు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ భవనంలో రాష్ట్ర వర్తక సదస్సు జరిగింది. సదస్సుకు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షతవహించారు. సదస్సుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వర్తక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర వర్తక బంద్ నిర్వహించే 17న వర్తకులు తమ దుకాణాలను మూసివేసి సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు ద్వారా వినతిపత్రాలను సమర్పించాలని సదస్సు తీర్మానించింది. రాష్ట్రప్రభుత్వం స్పందన సానుకూలంగా లేకపోతే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని, దీని కోసం ఉద్యమ కార్యాచరణ కమిటీని ఏర్పాటుచేసుకుని, కమిటీకి గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆత్కూరి ఆంజనేయులను అధ్యక్షుడిగాను, పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణను కన్వీనర్లుగాను, ఇతర ప్రాంతాల వర్తక సంఘాల ప్రతినిధులను సభ్యులుగాను నియమించుకోవాలని సదస్సు తీర్మానించింది. కేజి కందిపప్పుకు కూడా బిల్లు, వే బిల్లు ఇవ్వాలన్న విధానాన్ని రద్దు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. ఆన్‌లైన్‌లో వే బిల్లులు డౌన్‌లోడు చేసుకోవటం వంటి విధానాల వల్ల చిన్న చిన్న కిరాణా వ్యాపారులు కూడా కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుందని, ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయితే గంటల తరబడి వ్యాపారం నిలిచిపోతుందని సదస్సు ఆందోళన వ్యక్తంచేసింది. వ్యాపారి టిన్ లైసెన్సులో పేర్కొన్న రకాల సరుకులు కన్నా అదనంగా ఎక్కువ రకాల సరుకులను అమ్మితే చర్యలు తీసుకునే విధంగా నిబంధనలను రాష్ట్రప్రభుత్వం రూపొందించిందని, టిన్ లైసెన్సు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేటపుడు 5రకాల సరుకులు కన్నా ఎక్కువ రకాలను కంప్యూటర్ తీసుకోవటం లేదని, ఇది అన్యాయమని సదస్సు వ్యతిరేకించింది. బంగారంపై 1శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నును విధించటం వల్ల బంగారం వర్తకులపై వేధింపులు పెరుగుతాయని, అందువల్ల ఇలాంటి విధానాన్ని రద్దు చేయాలని సదస్సు తీర్మానించింది. జీడిపప్పును ఎగుమతి చేసే సంస్థలకు మాత్రమే 50శాతం సెంట్రల్ ఎక్సైజ్‌ను మినహాయించే విధానాన్ని సదస్సు వ్యతిరేకించింది. దీనివల్ల దేశంలోని 4వేల జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమల్లో 90శాతం పరిశ్రమలు మూతపడతాయని సదస్సు ఆందోళన వ్యక్తంచేసింది. రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ పోలీసులు వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనివల్ల వ్యాపారం దెబ్బతింటోందని సదస్సు ఆందోళన వ్యక్తంచేసింది. మెయిన్ రోడ్డులోని ఆటోల్లో జరిగే లోడింగ్, అన్‌లోడింగ్ లావాదేవీలకు మినహాయంపు ఇవ్వాలని సదస్సు కోరింది. సదస్సులో వర్తకుల రాష్ట్ర ఫెడరేషన్ కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్, అన్ని జిల్లాలకు చెందిన వర్తక సంఘాల నాయకులు పాల్గొన్నారు.