వాసిలి వాకిలి

కాల చైతన్యాన్ని తొలుచుకుంటూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
కొందరికి పెద్ద ప్రశ్న.. చిరు సమాధానం
ఇంకొందరికి చిన్న ప్రశ్న.. పెను సమాధానం
మరి కొందరికి ప్రశ్నా కాదు, సమాధానమూ కాదు
... పరిశోధన, నిరంతర శోధన.
ఈ శోధన బహిర్గతమూ, అంతర్గతమూను.
పరిశోధనకు కనిపించేదంతా వేదికనే.. అయితే కనిపించని అంతరంగమే శోధనకు పీఠిక.
అగుపించే విశ్వమంతా ప్రయోగశాలనే పరిశోధనకు.
అగుపించని విశ్వమూలాలన్నీ యోగభూమికలే శోధనకు.
ప్రయోగ ఫలితం ఆధారాలతో చరిత్రలో నిలిచిపోతుంటుంది. యోగ ఫలితం అనుభవాలతో మానవ పరిణామంలో కదలిపోతుంటుంది.
అవును,
‘నేను’లో నేను ఉండేది మేధ వికసిస్తున్నంత వరకే
మేధ చైతన్యంగా వాహిక అవుతుంటే నేను కాలప్రవాహం- అవుతుంటుంది.
మేను, మేధ సంయోగిస్తే ‘నేను’ ఒక ప్రయోగశాలనే!
మేధ మేనును మైమరపింపచేస్తే ‘నేను’ ఒక యోగశీలతే!!
* * *
నేను
ఒక ప్రయోగం.
విశ్వమే ఒక ప్రయోగశాల అయినప్పుడు సృష్టి ప్రయోగమే. ఆ ‘ప్రయోగ’ ఆవిష్కరణలలో మానవ అవతరణ ఒక మైలురాయి.
ఒక రూపజగతిలో ఒక అరూప జగతిని కూర్చటమే ఈ ప్రయోగ విశిష్టత.
రూపం పై తొడుగు మాత్రమే!
సౌందర్యం అంతా అరూపానిదే!!
అయితే ‘మాయ’ పురుడు పోసుకుంది ఈ రూప అరూప సంయోగంలోనే.
పై తొడుగే సౌందర్యం అనిపించటం మాయనే!
అంతరంగానికి ముసుగేయటం సౌందర్యానికి అద్దిన మాయనే! మాయతో జీవితం మురిసిపోతుంటుంది. భౌతిక వనరులతో, భౌతిక సంపదలు నిధులుగా ఊరించటమూ మాయనే. పేరుకున్న నిధులు కరగటమూ మాయనే.
అంతస్సీమల సౌందర్యానికి కరగటం ఉండదు. కారణం, ఆ నిధి చేరిక కంటికి అగుపించదు కాబట్టి.
ఇంతకీ ఆ నిధి ‘ఇకల్ట్’ ‘అకల్ట్’ల సంయోగ భూమిక. ఆ గుప్తనిధికి హోస్ట్ అండ్ గెస్ట్ నేను మాత్రమే.
* * *
నేనుకు తొలి పురుడు ఆఫ్రికాలోని ‘మిటొకొండ్రియల్ ఈవ్’ అనే మహిళా గర్భం - ఇది ఒక పరిశోధన. ఇలా నేను మానవ అవతరణగా ఆవిష్కృతమై రెండు లక్షల సంవత్సరాలైందన్నది ఈ పరిశోధనా సారాంశం. మరికొంత పరిశోధన సాగిన తర్వాత ఒక లక్ష సంవత్సరాల క్రితం మాత్రమే ఒక గుండ్రటి తలతోను, చిన్న ముఖంతోను, బుల్లి చుబుకంతోను మానవ రూపానికి ఒక ఆకృతి ఏర్పడిందట.
అయితే, ‘నేను’ ఇలా ఏకగర్భం నుండి ఆకృతీకరించటం నిజమే అయినప్పటికీ ఆ ఏకగర్భం స్థిరపడటానికి మరో లక్ష సంవత్సరాలు అంటే మూడు లక్షల సంవత్సరాల క్రితమే బీజం పడిందని నేటి పరిశోధనలు అంటున్నాయి. ఆఫ్రికాలోని అనేక జీవులు, ప్రాణుల సంభోగ ఫలితమే ‘మిటొకొండ్రియల్ ఈవ్’ గర్భానికి కారణమట. అంటే, లక్ష సంవత్సరాల సంభోగ పరిణామ క్రియా ఫలితమే ఈ ‘గర్భధారణ’ అని. ఇలా ‘నేను’ అవతరణకు శాస్ర్తియంగా ఎంతో సంయోగ చరిత్ర ఉంది.
అడవులు, ఎడారులు, కొండలు, కోనలు, పరిసరాలు, వాతావరణాలు, జంతు వలసలు, ప్రాణి సంతతి, జీవ సంస్కృతి- ప్రతీదీ మానవ అవతరణలో భిన్న ఆకృతులకు ప్రాణ ప్రతిష్ఠ చేసినవే. మానవ పరిణామ చరిత్రకు భూమిక అయినవే. ఈనాటి అందమైన మానవ రూపం ఉన్నత లక్షణాలతో శోభిల్లటానికి ఇంతలా ప్రకృతి పులకించటమే కారణం. మొత్తానికి, సృష్టిలోని ఇంతటి భిన్నత్వం నుండి ‘నేను’ అవతరణ సాధ్యమైంది. అందుకే సృష్టిలో ‘నేను’ ఎన్నటికీ ఔన్నత్య ప్రతీక!
* * *
నేను ఒక నవద్వార పురం.
అంటే, తొమ్మిది ద్వారాల మేను ఈ నేను.
ఒక లక్ష సంవత్సరాల క్రితం ఈ శరీర నిర్మితిలో గుండ్రటి తలకాయలో రెండు కళ్లు, రెండు చెవులు, రెండు ముక్కుపుటాలు, ఒక నోరు చోటు చేసుకుని ముఖవర్ఛస్సుతో మానవ రూప నిర్మితికి ఆకర్షణ అయింది. ఇక మానవ కుండలినికి దాపుల ఏర్పడ్డ మల, మూత్ర ద్వారాల వల్ల ఆరోగ్య వ్యవస్థ అనేది ఈ మానవ ఆకృతికి ప్రధానమైంది.
ఇలా, ‘నేను’ దేహపరంగా నవద్వారాలతో ఒక పుర వ్యవస్థను తలపింప చేస్తోంది. చూడటం, వినటం, ఆఘ్రాణించటం, ఆస్వాదించటం, విసర్జించటం అనే పంచభౌతిక కర్మలు ఈ నవ ద్వారాల ద్వారా సాధ్యమవుతున్నాయి. ఈ అయిదు కర్మల వల్లనే కర్తగా ‘నేను’కు ‘అహం’ సంప్రాప్తమవుతోంది. ఈ తొమ్మిదింటికి ‘బుద్ధి’ తోడవడంతో ‘నేను’ ఇంటెలిజెంట్ కావటమే కాకుండా ‘ఎమోషనల్’ కావటమూ జరుగుతోంది.
అందుకే, మానవ పరిణామంలో నేటి నేనుకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి అవుతోంది. అయితే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం ఈ శరీరాన్ని ‘నేను’ ఆశ్రయించి ఉన్నంతవరకే. దేహం నుండి విడివడగలిగితే ‘నేను’కు కావలసింది ‘హయ్యర్ ఇంటెలిజెన్స్.’
* * *
నేను పరంగా ఇంటెలిజెన్స్ అంటే ‘మైండ్’ అనేగా! మైండ్ అన్న వెంటనే మన ముందు నిలిచేది ‘బ్రెయిన్’. మొత్తానికి, బ్రెయిన్ పరంగా ఇంటెలిజెన్స్, మైండ్ అనేవి దాదాపుగా పర్యాయ పదాలు, సమానార్థకాలు అయిపోతున్నాయి.
ఇక, మైండ్ అనేది ఎమోషనల్, రేషనల్. కాబట్టి ‘నేను’కు ఉన్న ఇంటెలిజెన్స్ సైతం ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రేషనల్ ఇంటెలిజెన్స్ అంటూ, రెండు తెరగుల విజృంభిస్తుంటుంది. భౌతికంగా ఈ రెండు ఇంటెలిజెన్స్‌లు దేహాన్ని పొదువుకుని, ఉంటుంటే, దేహ అతీతంగా అంటే అధిభౌతికంగా ‘హయ్యర్ ఇంటెలిజెన్స్’ అనేది మానవ అధిభౌతిక పరిణామానికి కేంద్రం అవుతోంది.
ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్‌కి, కార్య కారణాల సంబంధం ఉండదు. కర్తృత్వ బాధ్తా ‘నేను’కు అంటదు... సహేతుకమా, నిర్హేతుకమా అన్న సందిగ్ధతా ఉండదు. ప్యూరిటీ, ట్రాన్స్‌పరెన్సీలు మాత్రమే హయ్యర్ ఇంటెలిజెన్స్‌తో సంయోగిస్తాయి.
రేషనల్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో ‘నేను’ జ్ఞానకలశం అవుతుంది. హయ్యర్ ఇంటెలిజెన్స్‌తో అదే ‘నేను’ ప్రజ్ఞాన నిధి అవుతుంది. కాబట్టి ‘నేను’కు ‘మెంటల్ లైఫ్’ అనేది భౌతికం వరకే... ‘సూప్రామెంటల్ లైఫ్’ అనేది అధిభౌతిక మూలాలను చేరుకునే వరకు.
కాబట్టి అధిభౌతిక, అధి ఆత్మిక, గిక జీవనానికి కావలసింది ‘సాప్రామైండ్’... ‘హయ్యర్ ఇంటెలిజెన్స్’ ‘ట్రూ మాస్టరీ’ అందుకే ‘మాతృమందిర’ అరవిందనేత్రి ‘ది మదర్’ ‘్దళ ఖళ ఘఒఆళూక జఒ ఆ్యఇళ ఘఒఆళూ యచి యశళఒళచి’ అని అంటారు.
అవును-
‘నేను’ ఈ మేనుతో ‘మీడియమ్’ అవుతూ, దేహాతీతంగా ‘మాస్టర్’ కావలసిందే!

-విశ్వర్షి 939393 3946