వాసిలి వాకిలి
నేను = కణం, కణం.. + క్షణం, క్షణం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేను..
కణం, కణం.. + క్షణం, క్షణం..
నేను కణం క్షణం + క్షణం కణం
నేను
- ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించలేను!
- దేహంలోని కణాల సంఖ్యనూ చెప్పలేను!
- జీవితకాలాన్నీ క్షణాలలోకి తర్జుమా చేయలేను!!
ఇలా ‘నేను’ది వాస్తవానికి ఉజ్జాయింపుల పర్వం. అయినా-
‘నేను’ మూడు వందల కోట్ల క్షణాలను ఒక జీవిత కాలంలో వొడిసి పట్టుకుంటానని ఒక లెక్క.
అదే ‘నేను’ ముప్పై ఎనిమిది లక్షల కోట్ల కణాలను ఉత్పత్తి చేసుకుంటూ, వినాశనం చేసుకుంటూ జీవితాన్ని ముగించేస్తానంట.
ఇలా ‘నేను’ది ఒక శాస్ర్తియ అవగాహన.. పరిశోధన.
ప్రతీ క్షణం ఈ ‘నేను’లోని మూడు వేల లక్షల కణాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతుంటాయి.
ఈ నేపథ్యంలో-
‘నేను’లోని కణాలన్నీ ఒకేలా ఉంటాయని భ్రమపడకూడదు. దాదాపు రెండు వందల పది రకాల కణాలు మన దేహంలో కోట్ల సంఖ్యలో యాక్టివ్‌గా ఉంటుంటాయి.
ఇంతకీ మనం యాక్టివ్‌గా ఉండటానికి కారణం మూడు అంకె పక్కన పదమూడు సున్నాలు పెట్టి లెక్క కడితే ఆ కణ సముదాయ బలమే మన యాక్టివ్‌నెస్‌కు మూలం. అలాగే మూడు పక్కన తొమ్మిది సున్నాలను పెట్టి లెక్కిస్తే మన జీవిత కాలం క్షణాలలో మన కళ్ల ముందు నిలుస్తుంది.
ఇంతటి విచిత్ర మానవ వ్యవస్థలో క్షణాలను మించి మానవ కణాలు, మానవ కణాలను మించి బాక్టీరియా కణాల ‘నేను’ మనుగడను నిర్దేశిస్తున్నాయి.
* * *
‘నేను’లో రెండు వందల పది రకాల కణాలు ఉంటే ప్రతీ రకం దేనికది ప్రత్యేకమే! ఏ కణం పనితీరు దానిదే! ఈ రెండు వందల పది రకాల కణ నిర్మాణంలోను, ఆకారంలోను, పరిమాణంలోను, పనితీరులోను ఒక రక కణానికి మరొక రక కణానికి పోలికే ఉండదు.
ఇన్ని విభిన్న కణాలలో మెదడులోని కణాలు మాత్రం పరిమాణంలో కాస్త పొడవుగా ఉంటాయి.
కారణం దేహావయవాలకు కావలసిన సిగ్నల్స్ చేరేది ఈ పొడవాటి కణాల ద్వారానే.
ఏది ఏమైనప్పటికి, మానవ శరీరంలోని కణ వ్యవస్థలో అన్ని కణాల మధ్య దూరం ఒకేలా ఉండదు. కొన్ని కణాలు దగ్గిర దగ్గిరగా దట్టంగా ఉంటే, మరికొన్ని దూరం దూరంగా ఉంటాయి. మొత్తానికి ప్రతీ క్షణం కొన్ని లక్షల కణాలను కోల్పోతూ, మరికొన్ని లక్షల కణాలను ఉత్పత్తి చేసుకుంటూ మానవ కణ వ్యవస్థ ‘నేను’ రూప అస్తిత్వానికి ప్రతీ క్షణమూ ఒక నవ్యత్వాన్ని చేకూరుస్తోంది.
ఇలా ప్రతీ క్షణం కొన్ని లక్షల కణాలు మరణిస్తుండగా, మరి కొన్ని లక్షల కణాలు పుట్టుకొస్తుండగా, అసలు ఎటువంటి కణమూ తరగని, పెరగని వ్యవస్థ ఒక మెదడుకు మాత్రమే ఉంది. అంటే, మెదడులోని కణాలు ‘నేను’ పుట్టిన క్షణం నుండి మరణించే క్షణం దాకా ఒకే సంఖ్యలో ఉంటున్నాయి.
* * *
‘నేను’లోని మెదడు మానవ రూపం అరూపం అయ్యేవరకు ఒకే కణ వ్యవస్థను కలిగి ఉండటం వల్ల, అంటే ఇమ్మోర్టల్‌గా ఉండటం వల్ల, ఈ భౌతిక వ్యవస్థలో ఎటువంటి మార్పు తీసుకు రావాలన్నా భౌతికాతీతంగానే జరగాలి.. అటువంటప్పుడు మెదడుకు సంబంధించిన యాక్టివిటీస్, ఛేంజెస్ అనేవి సాధ్యమయ్యేది స్పిరిట్యుయల్ ప్లేన్స్‌లోనే.
ఈ ఆధ్యాత్మిక పర మెదడు పరిణామానికి గిక ప్లేన్స్ ఎంతో సహకరిస్తంటాయి. గికం అంటే, కాస్మిక్ ఫోర్సెస్ వెదడు ‘యాక్టివిటీస్’ని అధిభౌతికం, దేహాతీతం చేస్తుంటాయి. దేహపరంగా సెల్ యాక్టివిటీ ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంటే, మెడిటేషన్ దేహపరమైన బ్రెయిన్ సెల్స్‌ను యాక్టివేట్ చేస్తూ లాంగివిటీ, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీలను సాధ్యం చేస్తోంది.
* * *
కణం మన కంటికి కనిపించదు. ఇలా మన కళ్లకి కనిపించనంతటి సూక్ష్మ కణం ఒక కర్మాగారాన్ని తలపించే వ్యవస్థను కలిగి ఉంటుంది. ఒక కర్మాగారంలో అనేక విభాగాలున్నట్లే కణ వ్యవస్థలోను వివిధ విభాగాలు. అయినా ప్రతీ విభాగమూ తక్కిన విభాగాలతో సంయోగిస్తూ తమ పనిని తాము సవ్యంగా చేసుకుంటూ పోతుంటాయి...
ప్రతీ కణం జీవ కణమే!