వాసిలి వాకిలి
నేను సహస్రధామాన్ని..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అక్షరానికి అందని శూన్యం
రూపానికి అందని చీకటి కణం
కాలం లెక్కలో ఇమడని వెలుగు కిరణం
శూన్యానికి రూపావిష్కరణలా నీలాంబరం
ఆకాశాన వేలాడుతూ వెలుతురు కణాలు
మరిన్ని ప్రతిపత్తులతో గ్రహగోళాలు
గ్రహ సమీకరణలతో సౌర కుటుంబం
కణం కణం సంయోగించిన కాల ఆవిష్కరణ
కాలం గుప్పిటలో రూపారూప భౌగోళిక అణువు
కణవాసనతో అణుతత్వంతో మట్టిమనసుతో
అవతరించిన ‘నేను’
*
నేను
అ-క్షరాన్ని
అ-క్షయాన్ని
అస్తిత్వాన్ని
విశ్వకృతికి అనుకృతిని
ప్రకృతికి కణకృతిని
సృష్టికి పరిణామ కృతిని.
సూర్యచంద్రులు నా తల్లిదండ్రులు
కదలటం నేర్పింది సూర్యతేజం
కరగటం చూపింది చంద్రకిరణం.
*
నేను
భూగోళ అతిథిని
మనసున్న మనిషిని
అధివసించిన అంతరాత్మను
సామాజిక ధర్మంతో వ్యక్తిని
మానుష ధర్మంతో మనీషిని
ఆత్మ ధర్మంతో విశ్వర్షిని
పురుషుని నీడన నా నడక
ప్రకృతి ఒడిన నా పడక
కాలం బడిన నా ప్రయాణం.
*
నేను
విశ్వవిజేతను
ఎత్తుల అగాధాల చరిస్తున్న వాడిని
అగాదాల అంతస్తుల విస్తృతిని
ఈ ప్రపంచం నాతో కబుర్లాడుతుంటుంది
ఆ మాటల వలలు నన్ను చేరటం లేదు
పోగొట్టుకున్న సంస్కృతి చేరాలనుకుంటోంది
ఈ ఇహానికి ప్రతీదీ పరమ రహస్యమే
ఇక్కడి ఆనందం అక్కడ జాలువారిందే
అక్కడి వెలుగే ఇక్కడి దేహకాంతి
*
నేను
యోగాలయాన్ని
సాధనా వలయాన్ని
ధ్యాన నిలయాన్ని
నా శిరసు సహస్రధామం
నా మనసు అక్షరధామం
నా నేత్రం శక్త్ధిమం.