వాసిలి వాకిలి

నేను.. సర్వమత మాతృకను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా జననం ఒక నిర్మితి
నా జీవనయోగం ఒక వినిర్మితి
నా యోగజీవనం ఒక నవనిర్మితి
*
సృష్టికి నేనొక ప్రకృతిని
విశ్వకృతిక నేనొక ప్రతికృతిని
భువన కృతికి నేనొక ప్రవిమలకృతిని
*
భూగోళాన ఖగోళ సంపదను
సూర్యతత్వం నింపుకున్న పురుషను
పౌరుషేయానికి నిత్య సంస్కరణను.
*
చీకటి కమ్మిన వేళ చంద్రకాంతిని
మబ్బులు మెరిసిన వేళ చందనకాంతిని
మేఘం మురిసిన వేళ జలకాంతిని
*
ప్రశ్నించే అద్దాన్ని అర్థం చేసుకోగలను
అర్థించే అర్థాన్ని అర్థం చేసుకోగలను
అర్థాన్ని అర్థవంతం చేయగలను
*
చీకటి వెలుగులు నా చదువు సంధ్యలు
అమవస పున్నములు నా గురువులు
జ్యోతిర్మండలాలు నా జ్ఞాన క్షేత్రాలు
2
నేను
ఆత్మక్షేత్రాన్ని
స్వయంభు రూపాన్ని
మునిపుంగవ వాసాన్ని
ఇచ్ఛకు తొలి ఆవాసాన్ని
అంతరింద్రియ సృజనత్వాన్ని
చీకటి నేపథ్యానికి సాక్షి సంతకాన్ని
శూన్య నేత్రానికి చిక్కిన జలవనరుని
అపార జలధిన స్థితమైన బీజాన్ని
అంకురప్రాయ అనంత గర్భాన్ని
నర అయన విశ్వ ఉదంతాన్ని
*
పురుష తత్వ స్వీకారాన్ని
ద్వయానికి శ్రీకారాన్ని
స్ర్తి పురుష ప్రవృత్తిని
సృష్టికి గుణాంకాన్ని
నింగీ నేలల వింగడింపును
పాదుకున్న అష్టదిక్కులను
కాల సంహితను
*
ఇహ పరాల సరిహద్దును
అహ చైతన్యాల సరిపద్దును
త్రిగుణాల సరిపొద్దును
పంచేంద్రియాల సరిపొత్తును
షట్చక్రాల శక్తి విలసనాన్ని
సప్త్ధాతువుల సశరీరాన్ని
జ్ఞాననేత్ర మహాబోధిని
సూర్యతేజ ఖగోళ ప్రాభవాన్ని
అగ్నిపునీత సంస్కృతిని
స్మృతిసహిత సంస్కారాన్ని
మనోవాక్కాయ సంహితను
అర్ధనారీశ్వర సంసారాన్ని
కొలమానం లేని వౌనాన్ని
కాలమానం లేని శూన్యాన్ని.
*
శూన్యాన నెలకొన్న వాయువును
వాయువు నుండి వెడలిన గాలిని
వీవెన వాహికగా తేజోమయ కాంతిని
కాంతిన ప్రిదిలిన రంగుల విభవాన్ని
వర్ణసమీకృత జల వలయాన్ని
నీటి నుండి పుట్టుకొచ్చిన వాసనను
వాసన ప్రేరణగా రుచిర జగత్తును
3
నేను
త్రిలోకాధిపతిని
సువర్లోక ప్రజ్ఞని
భువర్లోక శక్తిని
భూలోక పదార్థాన్ని.
*
అలజడి చేయని మనసును
ఆజ్ఞను చేరిన చైతన్యాన్ని
తర్కానికి అందని సత్యాన్ని.
*
కాను అజ్ఞానాన్ని
కాను అక్షరాలు దిద్దిన జ్ఞానాన్ని
కాను అరువు తెచ్చుకున్న విజ్ఞానాన్ని
అవును సత్యభాసుర ప్రజ్ఞానాన్ని.
*
ఆదిముని వౌనానికి శబ్దించిన మరీచిని
విశ్వవీణియను శృతి కావించిన భృగువును
ధర్మస్మృతికి ఆకర మనువును
వారసత్వానికి వైవస్వతాన్ని.
*
సర్వమత పవిత్రగ్రంథ మాతృకను
ఆకాశిక వాణికి అనుసృజనాక్షర బ్రస్మను
అక్షరలక్ష గణితప్రక్రియల వాల్మీకిని
నిశ్శబ్ద తరంగ శబ్దశాస్త్ర ఖండిక ఋషిని
విగ్రహ నిర్మాణ శిల్పశాస్త్ర కాశ్యపమునిని
వ్యంజనాదిపాక సూకశాస్త్ర సుకేశుడ్ని
పుష్ప మాలినీశాస్త్ర ఋష్యశృంగుడ్ని
విషశాస్త్ర ధాతుశాస్త్ర అశ్వినీ కుమారుడ్ని
మార్మికరేఖా విలాస చిత్రకర్మశాస్త్ర భీముడ్ని
వ్యాయామ విద్యాలంకార మల్లశాస్త్ర మల్లుడ్ని
శుద్ధ రత్నతన రత్న పరీక్షా వాత్స్యాయనుడ్ని
భ్రమాన్విత మహేంద్రజాల వీరబాహుడ్ని
ధర్మబద్ధ సంపాదనా అర్థశాస్త్ర వ్యాసుడ్ని
అణువిచ్ఛేదనా శక్తితంత్ర అగస్త్య మునిని
సౌదామినీ అంతర్వీక్షణల మృతంగ ఋషిని
మేఘశాస్త్ర ఉరుముల మెరుపుల అత్రిమునిని
కాలశాస్త్ర హస్తసాముద్రిక శాస్త్ర కార్తికేయుడ్ని
యంత్రశాస్త్ర భరద్వజుడ్ని అశ్వశాస్త్ర అగ్నివర్మను

-విశ్వర్షి 93939 33946