తెలంగాణ

తెలంగాణలో వీసీల నియామకం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 8 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉమ్మడి హైకోర్టు గురువారం రద్దు చేసింది. వీసీల నియామకాలపై అర్హతలు, నిబంధనలకు సంబంధించి జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే, తెలంగాణ ఎజి రామకృష్ణారెడ్డి అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగువారాల పాటు కోర్టు వాయిదా వేసింది. వీసీల నియామకాల విషయమై అమలులో ఉన్న చట్టాలకు సంబంధించి కేసు విచారణలో ఉండగా నియామకాలు ఎలా చేస్తారని సోమవారం నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల కోసం రెండేళ్లు ఆగిన వారు రెండు, మూడు రోజులు ఆగలేరా? అని న్యాయస్థానం గట్టిగా చివాట్లు పెట్టింది. విచారం పూర్తయ్యేదాకా నియామకాలు జరపబోమని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీ ఇచ్చినా 8 వర్సిటీలకు నియామకాలు ఎలా జరిపారని కోర్టు నిలదీసింది. స్థానిక సంస్థలు, చట్టసభల ఎన్నికల్లో ఓడిపోయినవారికి సైతం వీసీ పదవులను పంచిపెట్టేలా జీవో ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.