రాష్ట్రీయం

వీడని చిక్కుముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిదిలో పేర్కొన్న ఆస్తుల పంపకాల చిక్కుముడి ఇప్పట్లో వీడేట్లు కనిపించటం లేదు. ఆస్తుల పంపకానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, అస్పష్టత ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఇంకా 11 రోజుల గడువు మాత్రమే ఉంది. రాష్ట్రం విడిపోయి మూడేళ్లు గడిచిపోయినా ఆస్తుల పంపకం కొలిక్కి రాకపోవటంతో ఆర్టీసి వంటి సంస్థల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఏ విధంగా సాగాలో కేంద్రం పేర్కొంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అపాయింటెడ్ తేదీ నుంచి మూడేళ్ల లోపు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చునని చట్టంలో స్పష్టం చేశారు. జూన్ 2, 2014 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అపాయింటెడ్ తేదీ. ఈ గడువునకు ఇంకా పదకొండు రోజులు మిగిలాయి. ఇప్పటివరకు ఆస్తుల పంపకం అంశంపై కేంద్రానికి ఎలాంటి ఫిర్యాదు చేయని ఆంధ్రప్రదేశ్ గడువు ముగుస్తున్న సమయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి మరో రెండేళ్ల గడువు పెంచాలని కోరుతోంది. దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. మూడేళ్లు గడిచిన తరువాత గడువు పొడిగింపు పేరుతో మరో వివాదానికి తెర తీయాలనే ప్రయత్నాన్ని అంగీకరించేది లేదని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. చట్టంలో ఏదైనా అంశంపై స్పష్టత లేకపోతే కేంద్రానికి అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. కానీ ఆస్తుల పంపకంపై విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉందని, పొడిగించే అవకాశం లేదని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.
చట్టంలో అస్పష్టత ఉంటే అభ్యంతరాలు కేంద్రం దృష్టికి తీసుకు రావచ్చు, గడువు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కోరేది చట్టానే్న మార్చాలని, చట్టాన్ని మార్చాలంటే మళ్లీ పార్లమెంటులోనే నిర్ణయం తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. షెడ్యుల్ 9లో ఆస్తుల పంపకం ఏ విధంగా చేయాలనే దానిపై తనకు ఏ విధమైన అభ్యంతరం లేదని తెలంగాణ మొదటి నుంచి చెబుతూ ఉంది. చట్టంలో పేర్కొన్న విధంగా ఆస్తుల పంపకాలు చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆస్తుల పంపకాల విధానంపై అభ్యంతరాలు ఉన్నాయని, త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెబుతోంది. ఇరు రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పులు పంచినందున షెడ్యూల్ 9లో పేర్కొన్న ఆస్తుల్లో కూడా ఆంధ్రకు వాటా ఉంటుంది అనేది ఆంధ్ర వాదన. అయితే విభజన చట్టంలో ఈ అంశంపై స్పష్టంగా పేర్కొన్నారు. భూమి, భవనాల వంటి స్థిరాస్తులు ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంస్థలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు ఉంటే అవి జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందుతాయని కూడా చట్టం చెప్తోంది. దీని ప్రకారమే ఢిల్లీలోని ఎపి భవన్ ఇరు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన చెందుతుంది.
అయితే షెడ్యుల్ 9లో పేర్కొన్న సంస్థల్లో దాదాపు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఒకటి రెండు సంస్థల కార్యాలయాలు ఆంధ్రలో ఉన్నా వాటిలో తెలంగాణ వాటా కోరడం లేదు, కానీ ఆంధ్ర మాత్రం హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర కార్యాలయాల్లో అన్ని రకాలుగా తనకు వాటా ఉండాలని వాదిస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఉంది. ఇక ఆర్‌టిసి, ఆగ్రోస్, విజయడైరీ వంటి పలు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఎక్కడి ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టంలో స్పష్టంగా ఉండడంతో దానే్న తెలంగాణ బలపరుస్తోంది. హైకోర్టులో సైతం తెలంగాణ వాదనే నిలిచింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈఅంశాన్ని పరిశీలించాలని అని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. విభజన చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖ ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. చట్టంలో ఉన్న విధంగానే ఎక్కడి ఆస్తుల ఆ రాష్ట్రానికే చెందుతాయని పేర్కొంది. షెడ్యూల్ 9లోని సంస్థల కేంద్ర కార్యాలయాల్లో మాత్రం 48:52 శాతం ప్రకారం ఇరు రాష్ట్రాలకు చెందుతాయని పేర్కొంది. కేంద్ర కార్యాలయం అంటే ఏమిటో కేంద్ర హోం శాఖ స్పష్టతను ఇచ్చింది. హైకోర్టు విభజన అంశంపై మాత్రమే తెలంగాణ అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. హైకోర్టు విభజన ఎప్పటి లోగా పూర్తి కావాలో చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదని అదే అసలు సమస్య అని తెలంగాణ అధికారులు తెలిపారు.