వీరాజీయం

‘కుక్క చిక్కులు’ ఎలా పరిష్కరించాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు యిది- అంటే మనిషిని- కుక్క కరిస్తే వార్త కాదు. ‘కుక్కని మనిషి కరిస్తే వార్త’- అని గొప్ప సూక్తి. కానీ, యిది యిప్పుడు ఒక జోకు- వూర కుక్కలు ఊరూరా- ఆసుపత్రులో, పురిటి కందుల్ని- వీధుల్లో స్కూలుకి పోయే పిల్లల్ని కరిచి ముక్కలెక్కలాగేస్తున్నాయ్. ఇదే వార్తలు జనాల్ని లెక్కపెడితే- అది జనాభా. కుక్కల్ని లెక్కబెడితే, అది ‘కుక్క్భా’!
ఇది నిత్యం పెరిగే నిత్యావసర తిండి సరుకులుకన్నా స్పీడుగా పెరిగిపోతోంది. మహానగరాలలో- ‘పోష్’ ఏరియాలలో- ‘స్లమ్స్’అనే మురికి ప్రాంతాలలో కూడా ఏ విచక్షణా చూపెట్టకుండా- సూర్యోదయం ఎలాగ అవుతుందో అలాగ మార్నింగ్ వాకర్స్‌కన్నా ముందే లేచి- కొన్ని వర్కవుట్స్ చేసి- వీధులలో, సందు మొగలో, పార్కులలో ‘క్యాంపస్’లో- విస్తరించి వుండి- విహరిస్తూ మనకి కనబడేవి శునక రాజములే!
నేరుగా జంట నగరాలకొచ్చేద్దాం. ఇండియాలోనే కాదు- హోల్ మొత్తం వరల్డ్‌లో- కుక్క్భా, మోటారు ‘కార్లభా’- రుూ రెండూ యిక్కడ ఎక్కువ అని- ప్రపంచం చూసొచ్చినవాళ్లు అంటూంటారు. ఢిల్లీలో, బంగలూరులో, హైబాలో ఊరకుక్కల కల్చర్ అని ఒకటి డెవలప్ అయింది. 2001దాకా ఊరకుక్కల్ని లెసన్సులు లేదా ప్రక్కనే ఓనర్లులేని డాగ్స్‌ని బోనుబండ్లలో ఎత్తుకుపోయి- గ్యాస్ ఛాంబర్లలో...
కానీ ఆ తర్వాత చట్టం మారింది. ఆడ కుక్కల్ని పట్టుకుని వాటికి సంతాన నిరోధక శస్తచ్రికిత్స చేసి- తిరిగి ఎక్కణ్నుంచి- ఏ సందులోనుంచి తెచ్చారో అక్కడ వదిలేయాలి. అంతేగానీ వాటిని నిర్మూలించకూడదు.
ముందు రుూ ఆపరేషన్లు చేయడానికి చాలినంత సదుపాయాలూ, స్ట్ఫా లేరు. అంచేత ప్రపంచం మొత్తంమీద ఇండియాలోనే పెంపుడు కుక్కల్ని ప్రక్కనబెట్టి చూసినా- కుక్కల సంఖ్య మూడున్నర కోట్లదాకా వుంటుంది. అందులో మన హైబాలో ఐదు లక్షలకు పైగా కుక్క్భా వున్నది - వాటికి లైసెన్స్, పర్మిషన్ వగైరాలు అక్కరలేదు. పరిపూర్ణ స్వేచ్ఛాజీవులవి.
ఇక ఇండ్లలో కుక్కలు ఒక మనిషికన్నా ఎక్కువ స్టాటస్‌ని సంపాదించుకున్నాయి. ‘కుక్క వున్నది జాగ్రత్త!’అన్న బోర్డుగల యింటి మీద మనం అంత తేలికగా పోయి వ్రాలం. ‘సి.సి.కెమేరా వుంది’ అన్న బోర్డులు చూసి కూడా జనాలు లోపలికి పోతారు గానీ- బివేర్ ఆఫ్ డాగ్- అంటే పాలవాడు, పేపర్‌బోయ్, నీళ్లవాడు, పూలవాడూ- ఎవ్వడూ కూడా గేటు దాటడు. కుక్కల్ని గేటు దాటించి, వాటి యజమానులు ముద్దులు పోస్తూ- ఓచేత బెత్తాం, మరో చేత మెత్తని పటకా గొలుసూ పట్టి- కుక్క ముందు నడుస్తూ వుండగా, పార్కులకు, క్యాంపస్‌లకు, ప్రధాన రాజమార్గాలకు ప్రస్థానం చేస్తూంటారు.
కొంతమంది కుక్క కాలకృత్యాలు తీర్చుకునేటందుకు కొత్త కార్లు, చక్కని భవనాల గుమ్మాలూ వగైరాలు ఎంపిక చేసి- అక్కడ అవి (మల)బద్ధకం తీర్చుకుంటూ వుంటే- చేతవున్న చిన్న సంచీలోకి- భవనాల గోడల మీది పూల మొక్కలకి క్షవర కళ్యాణం చేస్తూంటారు. బెత్తాం మాత్రం సంకన వుంటుంది. ఊరకుక్కల్ని తరమడానికి అది తప్పదు. ఇక కొంతమంది పిరికి సన్నాసులు ఊర కుక్కల దండు సరదాకైనా వో ‘కాటు’వేసి- మోటు సరసం ఆడతాయేమోనని, కుక్కలేకపోయినా బెత్తం ధరిస్తారు.
ఇక సైకిళ్లమీద పోయేవాళ్లు (లోగడ) జేబులో రాళ్లు వేసుకోడం చాలామంది చూసే వుంటారు. ఇంట్లోకి మనుషులు ‘బివేర్ ఆఫ్ డాగ్’ బోర్డు- బయట ఏ బోర్డూ అక్కర లేకుండా ఊరకుక్కల్ని చూసి- తప్పుకుంటూ, ఆత్మరక్షణ చేసుకోడానికి బెత్తాం తప్పదు. కానీ లైసెన్స్ బిళ్ల లేకుండా కుక్కని బైటికి తీసుకొస్తే- లండన్‌లో అయితే ఐదువేల పౌండ్ల జరిమానా కట్టాలి.
ఇండియాలో మేనకాగాంధీ లాంటి ‘డాగ్ లవర్స్’కుక్కలకి మనుషులకన్నా ఎక్కువ హక్కులుండాలి అంటుంది. వెనుకటికి మహాత్మాగాంధీగారు కూడా- ‘ర్యాబిస్’ వ్యాధి సోకకుండా చేయడానికి కుక్కల్ని చంపమని ‘యంగ్ ఇండియాలో’ ఎన్నో వ్యాసాలు రాశాడట గానీ- రాబిస్ కుక్కకీ, మామూలు శునకరాజానికీ- అది మనిషిని కరిచేదాకా తేడా తెలీదుట. చిన్న పిల్లల్ని మురికివాడల పిల్లల్నీ- పెద్దపెద్ద పెంటకుప్పలు సమీపంలో వున్న వాళ్లనీ- సదరు పెంటకుప్పల మీద ఆధారపడి- చెలరేగి సంతానాన్ని కంటూ గెంతులువేసే కుక్కలు- సారీ, మనిషి బెస్ట్‌ఫ్రెండ్స్ అయిన శునకాలు కరిచేస్తే అంతే సంగతులు. డజన్‌ల కొద్దీ కుక్కలు చేరి ఓ స్కూలు బాలికని అభిమన్యువధ- చేసిన వార్తలు మనకి టాప్ న్యూస్ కావటం లేదా?
ఇంకో సంగతి. మోదీగారు స్వచ్ఛ్భారత్ అంటూ టాక్స్ కూడా వేశాడా? కానీ పెంటకుప్పలు వుండాలి- వాటి మీద ఆధారపడ్డ కుక్క సంఘాలు- ఆకలికీ, ఆగ్రహానికీ తట్టుకోలేక ఇండ్లలో జొరబడి- పిల్లల కంచాలలోని తిండి లాక్కుంటాయని ఒక పరిశోధకుడి హెచ్చరిక. ప్రతీ ఏటా 35 లేక యింకా ఎక్కువ మందిని- ‘ర్యాబిస్’ చంపేస్తుంది అని లెక్కలు చెబుతున్నాయి. చికెన్‌గున్యాకి ఏటా కొన్ని వందలు లేక యింకా తక్కువ చనిపోతున్నారు అని అంచనా.
ఐతే, కోడి జ్వరం అనంగానే లక్షలాది, యింకా - ఎక్కువేనేమో, పక్షుల్ని హతమార్చేస్తున్న మానవా! కేవలం నువ్వు కుక్కకే ఫ్రెండువా? అనడుగుతున్నారు పేరెంట్స్. శస్త్ర చికిత్సలకయ్యే ఖర్చు- అవి తర్వాత ఆపరేషన్ వికటించి చనిపోతే, ఆ కష్టం కూడా చాలా ఎక్కువ. సో... ర్యాబిస్‌ని అంతమొందించాలి అంటే ఊరకుక్కల్ని- లేదా, వాటికి వేరే మంత్రిని బెట్టి, ఆశ్రమాలు కట్టి- అక్కడ పెట్టి పోషించి దానికి బజెట్ వేర్పాటు- సారీ, ఏర్పాటుచేయాలి. అంతేగానీ నిత్యం పేపర్లలో పెడుతున్న రుూ దారుణ వార్తల్ని చూస్తూ- ‘చూశావా? విన్నావా?’అంటూ, వీధిలో మొరిగే కుక్కల్ని ముచ్చటగా ఆలకిస్తూ- ‘‘చెత్తల వాళ్లొచ్చుంటారు’’- అంటూ సెల్‌ఫోన్‌లు నొక్కుకుంటూ- ఉద్యోగ ప్రస్థానం మొదలుపెడతారు సిటీవాసులు.
హైబా నిండా రకరకాల మోటారుకార్లు, ఒక్కో కారును ఆశ్రయించి వుండే రకరకాల జాతుల కుక్కలు నిత్య నూతన దృశ్యాలు. స్వచ్ఛ్భారత్ టాక్స్‌ను ‘కుక్క భారత’ సంరక్షణకి యివ్వమనండి!
ఇఫ్ యూ లవ్ డాగ్, అడాప్టిట్!