వీరాజీయం

అర్థాలు... పెడర్థాలు...అనర్థాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔనండీ... ఔను! యివాళ పవిత్ర భారతదేశాన్ని ‘అమ్మ’ గా- అదే అంటే ‘తల్లి’గా చూసుకునేవాళ్లు యింకా తమ కంఠంలో ఊపిరి వున్నంత కాలం భారతీయులుగానే వుం టాం అనుకునేవాళ్లు వున్నారు. ఇప్పటికే రుూ జాతి అధిక సంఖ్యాకులు అవడం ఒక్కటే- మెడ మీద ఆలోచించే తలకాయ వున్నవాళ్లు చేసుకున్న అదృష్టం!
‘దేశమంటే మట్టికాదోయ్’అన్నది వేరే కాంటెక్స్టులో... యిక్కడ గుర్తించిన- గుర్తింపబడిన, బడని సవాలక్ష భాషలున్నాయ్. పంటలకి పనికొచ్చే; పనికిరాని నదులు ఎన్నో వున్నాయి. అవన్నీ రుూ ‘మట్టి’లాగే ఇక్కడ పరివేష్టించి వున్న పంచభూతాలే. అవే మనం ఏ వేషం వేసినా, ఏ జీవన శైలిననుసరించినా- కలిపి వుంచుతున్నాయి ‘‘మనల్ని’’. మనలోనుంచి రావాల్సింది రుూ ‘‘మట్టి’’వాసనే. ఆ మట్టిలో పండే పంటలు వేరు. వరి పంట భూముల్లో ‘రై’్ధన్యం పండించలే వు... అలాగే ‘్భరతీయత’ అన్నమాట వేరు- ‘జాతీయ త’అన్న మాటా వేరువేరుగా లేవుగా- అవ్వ పేరే ముసలమ్మ
1982లో నేను ‘‘మాస్కో’’లో దిగిన మర్నాడు ఒక కమ్యూనిస్టు పత్రిక సంపాదకుడు సాహితీమూర్తి నిడమర్తి ఉమారాజేశ్వర్రావుగారు వచ్చి- తన యింటికి తీసుకుపోయాడు. అక్కడ ‘‘ఫ్రిజ్’’మీద వున్న చిన్న గాజుల బుడ్డీనన్నాకర్షించింది. ‘‘మా వూరి మట్టోయ్... అది...’’ అంటూ, బాటిల్ మూత తీసి, ఆఘ్రాణించి, నాకు ఆ బాటిల్‌ని అందించాడు... గ్రేట్!
ఇండియా- దటీజ్ భారత్ ‘మూస’ యిక్కడి ఎన్నో రకరకాల జాతులకి మతస్తులకి ఆశ్రయం యిచ్చినా ఒక ‘‘పాత్ర’’,- దాని ‘‘పాత్రత’’ మారలేదు. ‘పాత్రను నెయ్యి పట్టుకుంటుందా? నెయ్యి పాత్రను పట్టుకుంటుందా?’అన్నట్లుగా మనం యివాళ ఎవరెవరికోసమో ‘‘బ్యాటిం గ్’’చేస్తున్నా- ‘పిచ్’మాత్రం యిదే కావాలి.
దేశంలో భారతీయత అంటే? ‘జాతీయత’అంటే లాంటి మాటలకు యివాళ కోర్టులు అర్ధాలు, నిర్వచనాలు చెప్పాల్సిన దుస్థితికి యింకా దిగజారిపోలేదు లెండి మనం.
కాలమిస్ట్‌లు వున్నారు బడాబడా కాలమిస్టులున్నారు. టి.వి యాంకర్లు, ప్రెజెంటేషన్ విజార్డ్స్’’వున్నారు. బడా ఆంగ్ల పత్రికలున్నాయి. పత్రికా సంపాదకులు - అందులోనూ ఆంగ్ల భాషాకోవిదులు, విదేశీ కాముకులు- వాళ్లంతా వేరు. నిత్యనూతన నిర్వచనోత్తమ భాష్యకారులు వారు (నిజమా?) మము బోట్లం- ఐ.పి.ఎల్. టోర్నమెంట్ల క్రికెటర్‌లు అమ్ముడుపోయినట్లు పోయిన వాళ్లం కాము. ఇవాళ ఒక సిద్ధాంతానికీ, రేపు మరో వర్గానికీ కిరాయి బ్యాటింగ్ చెయ్యలేము-
ఇవాళ, ‘టోలరెన్స్’అన్న కొత్త మాటకు తోడుగా- ‘దేశద్రోహం(?)’ అంటే ‘సెడిషన్’అనే మాట వచ్చింది. దీనికి దేశద్రోహం అన్న అర్ధం ఎక్కడుందో, ఎన్ని నిఘంటువులు చూసినా దొరకదు- ‘‘న్యూసెన్స్ కేసు’’ చాలు- దారితప్పిన పిల్లకాయలకి...
ఓ, దారితప్పిన కుర్రాడు ‘‘కన్నయ్య’ని పట్టుకుని, యిక్కడ తమ పబ్బం గడుపుకోడానికి ప్రయత్నం సాగుతోంది- అవకాశవాది, పొలిటికల్ పార్టీలు- అవి ఎంత గొప్పవయినా- ‘ఖండన’కు గురికావాల్సిందే- (కట్‌దెమ్)
‘‘సార్! కన్నయ్యని వెస్ట్‌బెంగాల్‌లో ఏచూరితోపాటు ప్రచారానికి పోతాడా?’’ అనడుగుతాడో కుర్రాడు. ‘‘ఎన్నికలు, ప్రచారం అంటే ఒక మత దూషణ, మరో వర్గ భూషణా అన్నమాటా? అవే గీటు రాళ్లన్నమాట? అసలు రుూ కుర్రాడు ‘ఐ’పార్టీ భృత్యుడే గానీ, ‘ఎమ్’పార్టీ ‘తొత్తు’కాదుగా? ముందు ఆ రెండు పార్టీలు ఏకం అయితే- ఆనక చూద్దాం’’, అన్నదో పడుచు పిల్ల-
కన్నయ్యని ‘డాక్టర్‌డ్’ (దొంగ వీడియో) టేపుల ఆధారంగా (అన్నీ కావుటలెండి) అర్ధరాత్రికి రాత్రీ తీసుకుపోయి, ‘లోపల’ వేసేయడం వల్లనే రుూ ‘అనర్ధాలు’వచ్చాయి అనే వాదం వున్నది. ఇప్పుడు చర్చల్లో నలుగుతున్న మరో కుర్రాడు ‘ఉమర్‌ఖాలిద్’- కన్నయ్యకి బెయిలు దొరికింది గానీ ఉమర్‌కి? అదీ దొరుకుతుంది! వెయిట్!
ఈ కన్నయ్య (‘కన్‌హాయ్య’అన్న హిందీ మాటకి తెలుగు మాట యిదేనని మనవి) నడ్డంపెట్టుకుని పెద్ద యుద్ధాలు (అంటే ఎన్నికలు, ఐదు రాష్ట్రాలలో వచ్చాయి కదా) గెలిచేద్దాం అనే ‘ఆశ...’ పాపం! జాలేస్తోంది.
కన్నయ్య స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కావటమే అతని బలం. అంతే గానీ- ‘హెర్‌క్యులిస్ అన్ ఛైన్డ్’అన్నట్లు ‘శాంసన్’లాగా కట్టడాల్నీ, కుడ్యాల్నీ కూల్చలేడు’అని గ్రహించాలి. యూట్యూబ్‌లు, వీడియోలు, సి.సి. కేమెరాల్లాంటివి కావు విడియోలు. ‘వీటిని తయారుచెయ్యొచ్చును’- అన్న సంగతి తెల్సుకోవాలి.
ఇక ఉమర్‌ఖాలిద్ వాళ్ల నాన్నగారికి లింకులున్నాయిట గానీ, ఖాలిద్ మియాఁ ఆదివాసులకు జరిగిన అన్యాయాల మీద మాత్రం పోరాడదామనుకున్నాడట! మరి వీళ్లంతా యిలా అన్యాయాల మీద పోరాటం సాగించాలనుకొనేనా? అఫ్జల్‌గురూ వర్ధంతి- జె.ఎన్.యు వి.సి.గారి అనుమతి పొందిన వేదిక సాక్షిగా జరుపుకున్నారు?- నిజమే అఫ్జల్‌గురు గొప్ప టెర్రరిస్టు (కాడా? కొంపదీసి) అతను ఏకంగా ఇండియన్ పార్లమెంటు భవనాన్ని కూల్చేయడానికి ప్రయత్నం చేయడం- అతన్ని పంపించినవాళ్ల దృష్టిలో ‘దేశద్రోహం’కాదు. కానీ, మన దృష్టిలో అది ‘‘దేశద్రోహమే!’’
రెండేళ్ల తర్వాత అతనిపై భక్తిప్రదర్శించి వర్ధంతిని చేసుకుంటూ, భారత్ ఛిన్నాభిన్నం అయిపోవాలంటూ నినద గంభీరంగా- ‘ఇన్‌షా అల్లా!’అంటూ ఆ క్రోశించడం ఎందుకు?-
అసలు రుూ ‘‘సంఘటన’’జరిగిందా? లేదా? తేల్చండి రూఢీగా... అదీ ముఖ్యం. కాగా- రాహుల్‌జీ అయినా, ఏచూరిగారు అయినా, మరొకరైనా - రుూ సంఘటన మీద స్వయంగా పరిశోధనలు జరుపుకోవాలి. ఇవాళ ‘అప్పోజిషన్’ అదీ గుర్తింపులేని ‘ప్రతిపక్షం’లో వుండి- రెండుమాటలు ముందుగా ఆడి- అటుతరువాత ఒకసారి ఆలోచించి- అపార్థం పాలవడంకన్నా- ‘వౌనం’బెటర్ కాదా? సంఘటన యొక్క పూర్వాపరాలు తెలుసుకోడం. అనుభవంగల నాయకుల ప్రథమ కర్తవ్యం కాదా? ఉన్నత విద్యార్థివర్గాలలో బాగా లోతుగా పాతుకుపోయిన, పరస్పర యూనియన్‌ల వైరం రుూ అనర్థాలన్నిటికీ కారణం కాదా? కాకూడదా? అఫ్‌కోర్స్! ఆన్సర్, ‘యస్!’-
‘‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు’అన్న సామెత చందాన- ఒకే ‘మూస’గా - ఒకే ‘శ్వాస’గా- సాగుతున్న నిరంతర వాహినిని - ‘్భరతీయత’ పేరుతో పిల్చినా- పిల్వకపోయినా- అందులోవున్న ‘పదార్థ యదార్ధం’ఒక్కటే- అదే ‘‘ఆత్మీయత’’ దాని పేరు.
ఈ ‘మట్టి’కన్నా గొప్పదేమిటి? ప్రకృతీ, సంఘజీవుల యొక్క అపురూప సంగమం అది. ఇక్కడే నిజంగా దేశద్రోహం అనేది జరిగినా, సాగలేదు- సాగదు. యుగయుగాలుగా అది ఓడిపోతూనే వున్నది! అది నిజం.
లెట్ సెన్స్ ప్రివైల్ అమాంగ్ లీడర్స్!