వీరాజీయం

ఓ ‘గూటి చిలుకలే’ కాని పలుకులు వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోయినవారం బిహార్ అడవులలో ఓ రెండు వందలకు పైగా ‘నీల్‌గాయ్’ల్ని (వీటినే బ్లూబుల్ అంటారు)- తుపాకులతో వేటాడి చంపేశారు. అవి శాకాహారులే గానీ, మన పంట పొలాల మీద పడి క్రుమ్మేస్తున్నాయ్. ధ్వంసం చేస్తున్నాయ్. కనుక పర్యావరణ శాఖామాత్యుడు ప్రకాష్ జవదేకర్- ఆర్డర్లు వేశాడు. ఈ ఆర్డరు నవంబర్ దాకా అమలు చేస్తారు.
నోరు లేని ఆ సాధుజంతువుల్ని పంట పొలాల ధ్వంసం నెపంతో అలా చంపేయడం- శిశు వనితా సంక్షేమం కన్నా యెక్కువగా జంతు సంక్షేమాన్ని కోరే నిష్ఠాపరురాలు శ్రీమతి మేనకాగాంధీకి విపరీతమైన కోపం తెప్పించింది. పైగా, నీల్‌గాయ్‌లో ‘‘గాయ్’’ శబ్దం (ఆవు) కూడా వుంది. భాజపాకి అత్యంత ప్రీతికరమైన మాట- సాటి మంత్రివర్యుడు ప్రకాశ్ యింత పని చేస్తాడని ఆమె అనుకోలేదు. పర్యావరణ పరిరక్షణకు అడవుల్నీ అడవి జంతువుల్నీ కంటికి రెప్పలాగా కాపాడాల్సిన మంత్రి హిమాచల్‌ప్రదేశ్- సిమ్లాలో ఆమధ్య కోతుల్ని కనబడితే కాల్చి పారేయమంటూ ఉత్తర్వులు జారీచేసాడు- ‘‘ఎంత ఘోరం’’ అంటుందామె.
‘చాయ్’ మీద కూర్చుని యిలాంటి విషయాలు చర్చించాలే తప్ప- రాష్ట్రాలు అడిగాయి- రూలు ప్రకారం వాళ్లకి మనం సాయం చెయ్యాలి అంటున్న శ్రీ ప్రకాశ్‌ని పబ్లిక్‌గ్గా మేనకాగాంధీ తిట్టిపోసింది-
ఒక్క బిహార్‌కేనా? మరో నాలుగు రాష్ట్రాలకి కూడా అడవి జంతువుల్ని- పొలాల మీద పడితే కాల్చిపారేయడానికి అనుమతులు జారీచేశాడు- పర్యావరణ శాఖామాత్యుడు. అవునుండీ! ఎంత ఎంత ‘‘ఎండేన్జర్డ్ జంతువే’’ అయినా మనుషుల తిండికి ‘‘డేంజర్డ్’’గా మారిపోతే ఏం చెయ్యాలి?
పశ్చిమ బెంగాల్‌లో ఏనుగులు మనుషుల్నీ, పంట పొలాల్నీ మట్టేస్తున్నాయ్. మహరాష్టల్రో అడవి పందులు, గోవాలో నెమలి పిట్టలు, కర్నాటకలో పాలపిట్టలు, కోకిలలు- యివన్నీ మనుషుల్ని తినే పెద్దపులులు కావుగానీ- మనిషి చెమటోడ్చి పండించే పంటల్ని- దేని స్టయిల్లో అది మట్టిపాలు చేసేస్తున్నాయ్. కాకపోతే పెద్ద పులుల్లాగా యివి గ్రామాలలోని మనుష్యుల్ని రుచి చూడవుగానీ, ఎండేంజర్డ్- అంటే అంతరించిపోతున్న జాతి జంతువుల జాబితాలో వున్నాయి.
నీల్‌గాయ్ అన్న శాకాహార జంతువులు- లేడి జాతికి చెందినవే గానీ, ఐదారడుగులు ఎత్తుగా- నాలుగైదు వందల కిలోల బరువుగా- నీలమేఘ శ్యామంగా- మెడ క్రింద తెల్లని మచ్చతో వుంటాయి. మగ వాటికి కొమ్ములు అదనం. వెంట పడితే చెంగు చెంగున- అపార వేగంతో దుముకుతూ పారిపోతాయ్.
హిందీలో గాయ్ అంటారు. ఇంగ్లీష్‌లో బ్లూబుల్ అంటారు గానీ- అటు ఆవుల లాగా పాలివ్వవు. ఇటు ఎద్దుల్లాగా పొలం చాకిరీ చెయ్యవు. అడవి పందులతో సమంగా మనిషిని వెంటాడి దుఃఖపెట్టేస్తున్నాయ్. ఆమాటే అంటాడు ప్రకాశ్ మంత్రివర్యుడు. ‘‘రాష్ట్రాలు అడిగాయి. ‘సైంటిఫిక్ మేనేజ్‌మెంట్’ అనే ఆదేశాలు అంటే శాస్ర్తియంగా వాటిని అదుపు చెయ్యమని ఉత్తర్వులు వేశాం. నాకు మాత్రం అడవి జంతువులంటే కోపమా తల్లీ?’’ అంటాడు. కాదు ‘కల్లింగ్’ అంటే మాకు వ్యామోహం వుంది’ అంటుందామె. ‘‘మీరు అదే పనిగా అడవులు తగలెడుతూ వుంటే, పాపం! ఆ సాధుజంతువులు ఎక్కడికి పోతాయ్?’’ అంటూ ‘‘గలగల్లా’’డి పోతోందామె. గొప్ప వాగ్ధాటి ఆమెది!
‘‘ఇంగ్లీషులో ‘కల్లింగ్’ అన్నా, ‘కిల్లింగ్’అన్నా తెలుగులో ‘చంపడం’ అనే అర్థం. కాకపోతే, మనిషికి సోకే వ్యాధులున్నప్పుడు ఎన్ని కోళ్లనీ, ఆమధ్య ఎన్ని ఆవుల్నీ అసంఖ్యాకంగా చంపేయలేదు? అటువంటి ‘‘కల్లింగ్’’నే యిప్పుడు తప్పనిసరిగా చేస్తున్నాం’’- అంటే, మేనకమ్మ ఒప్పుకోదే? ఈ ఇద్దరూ యిలా సిగపట్ల గోత్రం అయిపోయ- ‘్ఢ’ అంటే ‘్ఢ’ అనుకోడం మంత్రులనేగాక అందర్నీ చకితుల్ని చేస్తున్నది. ఒకే ‘గంప క్రింద కోళ్లు’కదా ఇలా ‘‘నీల్‌గాయ్’’ కోసం - ‘గాయ్... గాయ్’’... అంటూ పరస్పర దూషణ బాణాలు సంధించుకోడం- ప్రధాన మంత్రిదాకా పోతే ఏమవుతుంది? ఆయన అవతల ఐదు దేశాలు జేగీయమానంగా పర్యటించి ఆరు స్టాడింగ్ ఒవేషన్‌లు, అరవై అప్లాజులు, సంపాదించుకుని- మార్తాండ తేజంతో దేశంలో దిగుతూ వుంటే- మేనకమ్మ, ప్రకాశయ్య పూల దండలట్టుకుని, ఎదురెళ్లకుండా- ‘‘సార్...సార్!’’ అంటూ బడి పిల్లకాయల్లాగ ఫిర్యాదులు పట్టుకుని పరుగులు తీస్తే, ఏటంటాడు? (వేచి చూడుడు)
ఈలోగా యింకొన్ని సంగతులు చూద్దాం. మహారాష్టల్రోని చంద్రాపూర్ అడవుల్లో అడవి పందుల్ని ‘గజ వేట’గాళ్లనీ పిలిపించి మరీ- మట్టుపెడుతున్నారు- ‘అవి పొలాల్ని నాశనం చేస్తున్నాయి’- అన్న నెపంతో. ఈపాటికి ఓ రెండు, మూడు వందల అడవి పందులు ఘుర్రుఘుర్రుమంటూ పరుగులు తీయకుండా- నేలకొరిగి పోయి వుంటాయి. ప్చ్!
గోవాలో పంట శత్రువులయిన పక్షుల మీద తుపాకులు గురిపెడుతున్నారు. ఉత్తరాఖండ్‌లో నెమలి పిట్టల్ని మట్టువెడుతున్నారు.. ఇదంతా ‘‘సైంటిఫిక్ మేనేజిమెంట్’’ అంటారుట. ‘కల్లింగ్’ ఒ.కే. ‘‘కిల్లింగ్’’ నేరం కదా? బిహార్‌లో చాలా కాలంగా - ‘‘నీల్‌గాయ్- గాయ్ కాదు హాయ్ హాయ్- మనుషుల పాలిట పీడ పంటల పాలిట చీడ’’ అంటూ వాపోతూ వుంటే కేంద్రమంత్రి ఆదేశం రాంగానే ఒక్క ఉదుటున నీల్‌గాయ్‌ల మీదికి తుపాకులిచ్చి వేటగాండ్రని తోలితే- వాళ్లు ‘‘మేము చంపలేం సార్! పాపం వచ్చుద్ది’’- అన్నారుట.
అంచేత, ‘‘మన హైదరాబాద్ నుంచి ‘యమా షూటర్స్’ని తీసకుపోయి నీల్‌గాయ్‌లని అంతం చేశారు’ అన్న ఆరోపణలు కొన్ని వున్నాయ్. మేనకాగాంధీ లోగడ పర్యావరణశాఖ మంత్రిగా పనిచేసింది. జవదేకర్‌కీ, ఆమెకీ చిన్న పిసరు ఘర్షణలు లోగడ కూడా జరిగాయి. ‘‘అడవులలో వున్న జంతువుల్ని చంపడం కాదు. అడవుల్ని కాపాడండి’’ అంటుందామె. పాత కోపాలున్నాయిట!
‘‘నేను రాష్ట్రాలు అడిగితే, చట్టప్రకారం కోతుల్నీ, అడవి పందుల్నీ, ఏనుగుల్నీ, నెమళ్లనీ కూడా ‘‘క్షుద్ర జంతువులు’’గా పరిగణించవచ్చునూ అన్నారు గనుక, వాటిని పరిమిత పరిధిలో, పరిమిత కాలంలో చంపేయవచ్చును’- అన్నది చట్టం- కనుక అలా చేశాను’’ అంటాడు జవదేకర్ మహాశయుడు. మేనకాగాంధీకి పాత కోపం, కొత్త ఉక్రోషం- ఏదైతేనేం? యిలా యిద్దర్నీ రోడ్డుమీదికీడ్చాయ్. చూద్దాం- చెరో మొట్టికాయా పడతాయేమో?!
కన్జర్వేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ రుూజ్ ద బెస్ట్ రెమిడీ!