Others

టీచర్లకి సింహస్వప్నం! (వార్త- వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ప్రాథమిక విద్యారంగంలో ఇరవై కోట్ల మందిని చదివించాల్సిన బాధ్యత వుంది. పిల్లలు స్కూలుకి ఒకంతట రారు. అదో సమస్య. కానీ అంతకన్నా ముందు మరో సమస్య వుంది. టీచర్లు స్కూళ్లకి రారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా టౌన్‌లో టీచర్లు యిటీవల స్కూళ్లకు- పిల్లలకన్నా ముందే హాజరయిపోతున్నారు- ఎందుకంటే- డి.ఇ.ఓ. మనోజ్‌కుమార్ మిశ్రాగారొస్తున్నాడూ అంటే- పిల్లలూ, పేరెంట్సూ- ‘‘దండాలయ్యా!’’అంటూ ప్రక్కకి తొలుగుతారు. టీచర్‌లా? వాళ్లు ఆ పరిసరాల్లో వుండరు. క్లాసు రూముల్లో దూరి- నల్లబల్ల మీద పాఠాలు రాసేస్తూంటారు. డి.ఇ.ఓ. మనోజ్‌కుమార్ మిశ్రా గారంటే టీచర్లకి సింహస్వప్నమే! ఆయన 2014లో యిక్కడికి పోస్టింగ్ తీసుకుని వచ్చినప్పుడు- ఏ స్కూల్లోనయినా టీచర్లు వేళపట్టున వస్తూంటే వొట్టు!
నూటికి నలభై మంది అసలు వూళ్లోనే వుండరు. కానీ హాజరు పట్టిలో పేర్లు ‘రైట్’కొట్టేసి వుంటాయి. 2700 స్కూళ్లున్న సదరు డివిజన్‌లో- గ్రామీణ ప్రాంతం టీచర్లు నూటికి ఇరవైనాలుగు మంది గైర్హాజరీగా వుండేవారుట.
‘ఐతే, మన మనోజ్‌మిశ్రాగారు టీచర్లని చావచంపి, చెవులు మూసి మరీ క్లాసులకు రప్పిస్తున్నాడు. సో, ఇవాళ అటెండెన్స్ 90 శాతం దాటింది. ‘‘అయ్యా!’’అంటూ మిశ్రాగారి దగ్గరికి వచ్చి ఓ టీచరు- మంత్రిగారి బంధువునుంచి సిఫార్సు పట్టుకొచ్చి, యిచ్చి- శలవుకావాలన్నాడు.
‘‘ఆ లెటరు యిలా యివ్వు’’-అని తీసుకుని ‘‘్ఫర్రు’’న చింపేశాడు. బుట్టలో పారేశాడు అధికారి- ‘‘్ఫ, క్లాసులోకి’’- కుర్రాణ్ని గద్దించినట్లు అన్నాడు-
అలాంటి ఆయన హయాం చూసి టీచర్లు గ్రూపుగా చేరి, అతని మీద ప్రదర్శనల దాడి చేశారు. అతని బల్ల తిరగేసి కుర్చీలు విరగ్గొట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హెచ్చరించారు. ‘‘నథింగ్- డూయింగ్’’ అన్నాడు. ఒక తుపాకీ కొన్నాడు. దాంట్లో గుండ్లు నింపాడు. పాకెట్‌లో ‘‘పెన్ను’’లాగా ‘‘గన్ను’’ పెట్టుకున్నాడు.
‘‘షూట్‌చేసి పారేస్తా! క్లాసుల్లోకి గంటకొట్టక ముందే పోవాలి’’- అన్నాడు. అంగరక్షకుల్ని బెత్తాయించి పెట్టుకున్నాడు. రౌడీలకు రౌడీ- పిల్లలకీ, పిల్లలి తల్లిదండ్రులకీ దేవుడు....
ఇక టీచర్‌ల సంగతి ఓ టీచరు నోయిడాలో (్ఢల్లీ దగ్గరా) మరో టీచర్ ముంబాయిలో వుంటూ యిక్కడ అటెండెన్స్ వేయించేసుకుంటున్నారుట! అధికారులందర్నీ పిలిచాడు. మీటింగ్‌లో గద్దించి వాళ్ల సెల్‌ఫోనులన్నీ బల్లమీద పెట్టించాడు. ‘‘్ఫండి... యింక ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు కాదు- టీచర్లు ఆబ్సెంటో రిపోర్టు పట్టుకురాండి- ఆనక మొబైల్స్ ఎత్తుకుపోండి...’ అంటూ తరిమాడు. అలాగే ఓరోజు 245కి 73 మంది టీచర్లు గాయబ్ అయిన సంగతి తెలిసింది.
తన యింటికి సి.సి.కేమెరాలు, కోటుకి రివాల్వర్. మనిషి మెత్తగా వుంటాడు. అలహాబాద్ యూనివర్సిటీలో చదివాడు. ఇప్పుడందర్నీ స్కూలులో చదివిస్తున్నాడు. చదువు చెప్పిస్తున్నాడు. విద్యామంత్రిగారు కూడా నోరిప్పడు. మిశ్రా అంటే ప్రాథమిక విద్యాధికారిగా అతనికి అత్యున్నత గౌరవ ప్రతిష్ఠలున్నాయి. జై బోలో మనోజ్‌మిశ్రాకీ!
జాట్‌ల ఆగ్రహం- ఢిల్లీకి నీళ్లు బంద్!?
ఉరుముఉరిమి మంగలం మీద పడింది- ‘‘అన్నట్లు మహోగ్రంగా, హింసాత్మకంగా- పది రోజులపాటు సాగిన ఓ.బి.సి. కోటా ఉద్యమం- దేశ రాజధాని న్యూఢిల్లీకి తాగునీరు లేకుండా చేసింది. రెండువందల కోట్ల రూపాయల ఆస్తిపాస్తుల్ని ధ్వంసం చేసిన జాట్ ఆందోళనకారులు ఢిల్లీకి హర్యాణానుంచి మంచినీరు సప్లయ్ చేసే ‘‘మునాకా కాల్వ’’- నీటి సరఫరా గేట్లను విరగ్గొట్టేశారు. నీటి చుక్కలందకపోతే గవర్నమెంట్ దిగివస్తుందన్నది ధీమా. ఓ.బి.సి. కోటాకోసం- పారామిలటరీ, మిలటరీలను కూడా ధిక్కరించిన ఉద్యమకారుల నమ్మకం అది.
నిజమే. రాష్టప్రతి, ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్‌లకు తప్ప ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి కూడా కుళాయిలు బంద్. సోమవారం మొత్తం ఢిల్లీ, దాని పరిసరాల్లో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. రోజుకి ఎనిమిది కోట్ల గ్యాలన్ల మంచినీటి సప్లయ్‌కోసం- ఢిల్లీ నాలుగువందల కోట్ల రూపాయలతో- హర్యాణా గవర్నమెంట్‌తో ఒప్పందం చేసుకుని కట్టుకున్న రుూ నీటి ప్రాజెక్టును బంద్ చేయకుండా దేశ రాజధానిని కాపాడమంటూ ఢిల్లీ గవర్నమెంటు సుప్రీంకోర్టును శరణుజొచ్చింది. ఎవరేం చేసినా, వారం రోజులపాటు రేషనింగ్ తప్పదుట! చివరికి ఉద్యమం, పనె్నండు మంది నిండు ప్రాణాలు పోయాకా, దశాబ్దాల సౌభాగ్యం బుగ్గిపాలయ్యాకా గెలిచింది. గవర్నమెంటు సూత్రప్రాయంగా ‘జాట్’లను ఓ.బి.సి.లుగా అంగీకరించి- మన వెంకయ్యనాయుడిగారి ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసింది. ఈ పనేదో ముందేచేస్తే నిండు ప్రాణాలూ, ఆస్తులూ దక్కేవికదా? అలా చెయ్యకపోగా- హర్యాణా గవర్నమెంటుకి కేంద్రం- ఆందోళనకారుల్ని ఓ పట్టుపట్టమని లైన్ క్లియర్ యిచ్చిందిట. ఆకులు పట్టుకోడంకోసం చేతులు కాల్చుకున్నట్లయింది-
స్వచ్ఛమామ్మగారికి మోదీ వందనం
ఛతీత్‌సఘడ్‌లోని ధమ్తదీ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్న మామ్మగారి పేరు- కువర్‌బారుూయాదవ్. ఆమె వయసు నూటనాలుగు సంవత్సరాలు. అయితేనేమిటిటా?! అనకండి. ఆమెకున్న ఆస్తి పది గొఱ్ఱెలు మాత్రమే! పేపర్లు చదవలేదామె. టి.వి.లు చూడదా బామ్మగారు. కానీ, ఆ గొఱ్ఱెల్ని అమ్మేసింది. రెండు మరుగుదొడ్లు నిర్మించుకుంది. ఒకటామెకి- మరొకటి యిరుగుపొరుగుకీ. ఈమెను చూసి గ్రామస్తులంతా ‘‘టాయిలెట్స్’’ని కట్టించుకుని- ఆదర్శ గ్రామంగా నిలిచారు. అదీ వార్త.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోయినవారం- రూర్బన్ (రూరల్ స్వచ్ఛ ఉద్యమం) మిషన్‌లో భాగంగా అక్కడికి వెళ్లారు. ఈ ఆదర్శ వృద్ధురాలిని ఆయన ప్రశంసిస్తూ- శిరసొంచి పాదాభివందనం చేశాడు- దేశ ప్రధానమంత్రి వేనోళ్ల మెచ్చుకున్నాడు. ‘‘ఈమెకు మీరు పబ్లిసిటీ యివ్వాలి. నాకు కాదు-’’ అన్నాడు మీడియాతో.
నాలుగు సంవత్సరాల బాలుడికి యావజ్జీవ శిక్ష
ప్రజాస్వామ్య దేశాలలో నివసించే వారికి యిటువంటి వార్తలు వింటేనే ఒడలు జలదరిస్తుంది. పోయినవారం ఒక ఈజిప్టు- కైరో హైకోర్టు ‘అహ్మద్ మన్సూర్‌కర్మీ అనే బాలుడి మీద నాలుగు హత్యలు చేశాడనీ, ఎనిమిది హత్యలకు ప్రయత్నం చేశాడనీ, ఆస్తులను కొల్లగొట్టి దోచుకున్నాడనీ, సైనికుల్ని బెదిరించాడనే ఆరోపణలున్నాయి. పైగా రుూ బాలుడి రుూ నేరాలన్నీ రెండేళ్లు నిండకుండానే చేశాడట. కుర్రవాడి పుట్టిన తేదీని జడ్జీగారికి మేము యివ్వలేదు. అంచేత యింత శిక్ష పడ్డది’’ అన్నాడుట కుర్రవాని తరుఫు లాయర్. కానీ, రుూలోగా కేసు మరో 115 కేసులతో కలిపి- మిలటరీ కోర్టుకి వెళ్లిపోయింది. ఈ బాలుడు కోర్టుకి రాకుండానే శిక్షలు కూడా ఖరారుచేశారుట! ఏమి వ్యాఖ్య చేయగలం?!

-వీరాజీ