Others

అతను వెనక్కి పరిగెత్తినా పట్టుకోలేం! (వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని వయసు 15 సంవత్సరాలు. వాళ్ళ వూరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. అతని పేరు ప్రయత్న శర్మ. ‘స్కేటింగ్‌లో కింగ్’. అతను ‘రోలర్ స్కేటర్స్’ మీద పరుగు లంకించుకుంటే మోటార్ బైకు కూడా వెంటపడి అందుకోలేదు. బిజీ ట్రాఫిక్‌లో కూడా కిలోమీటరు దూరాన్ని రెండు నిమిషాల ఎనిమిది సెకనులతో వెనక్కి తిరిగి పరిగెడుతూ దాటేస్తాడు! తాజాగా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిందీ బాలుడు పేరూ ప్రఖ్యాతి. తండ్రి ఘనశ్యామ్ శర్మ యితనికి గురువు. చిత్రం ఏమిటీ? అంటే, ఈ ప్రయత్న శర్మ ‘స్కేట్స్’ మీద ముందుకే కాదు వెనక్కి కూడా అపార వేగంతో పరుగులు తీస్తాడు. తన ఐదవ ఏట వాళ్లన్నయ్య కోసం తెచ్చిన స్కేటింగ్ రోలర్స్‌ని లాక్కొని తొడిగేసుకుని పరుగులు తీశాడు. అంతే అప్పటినుంచీ ఒకటే పరుగు.. పొద్దునే్న పాలు తాగటం స్కేటింగ్ అభ్యాసం కోసం రెండు గంటలు పరుగులు తియ్యడం. అలా ఒక్క రోజు కూడా నాగా పెట్టకుండా పది సంవత్సరాలుగా ఉదయం సాయంత్రం స్కేటింగ్ చేస్తూ యివాళ ఉత్త పాదాలమీద నడువలేనంత అలవాటు పడిపోయాడు. మంచు స్కేటింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. ‘ప్రయత్నం’ అన్నది అతని సార్థకనామధేయం అయ్యింది.
రోజుకి నాలుగు గంటలు ప్రాక్టీస్, అది కాస్తా బోరు కొట్టింది. అంటే మార్పుకోసం ఈ బాలుడు ‘వెనక్కి’ స్కేటింగ్ మొదలుపెట్టాడు. అందులోనూ రికార్డు సాధించాడు. ఒలింపిక్స్‌లో ఐస్ స్కేటింగ్ రికార్డు నా ధ్యేయం. అటు తరువాత ఇదే వృత్తిగా చేసుకుంటాను అన్నాడు. ‘బర్రున’ స్కేటింగ్ చేస్తూ అలా పారిపోయాడు. క్షణంలో కనుచూపుమేర దాటేశాడు- పరిశీలకులు విస్తుబోయారు.
అంతా ‘9’ అంకె మహిమ
తెల్లవారితే సోమవారం వస్తుంది. అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంటాను అనుకున్న ఉత్తరాఖండ్ 9వ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ముందు అర్థరాత్రినుంచే మాజీ ఐపోయాడు.
ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించడానికి ముందు స్పీకర్‌గారు 9 మంది తిరుగుబాటు కాంగ్రెస్ శాసనసభ్యుల్ని ‘సస్పెండ్’ చేశాడు. కాకపోతే అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్‌లో వుంచారు. దీంతో 70 మంది ఎమ్.ఎల్.ఏల సంఖ్య 61కి తగ్గిపోయింది. చూడగా 9 అంకె ఉత్తరాఖండ్‌కీ, హరీశ్ రావత్‌గారికి కూడా అచ్చిరాలేదల్లే వుంది. మార్చి 27న అంటే 2+7 = 9 నాడు గవర్నమెంట్‌ని తీసిపారేసి రాష్టప్రతి పాలన విధించారు. సరిగ్గా 9 మంది తిరుగుబాటు ఎమ్.ఎల్.ఏలు యిందుకు కారణం. కాగా రాష్ట్రంలో 144వ ఆర్టికల్ ప్రయోగించారు. 144ని కలిపితే 1+4+4=9 అవుతుందిగా. అంటే 9తో కొట్టిందన్నమాట కేంద్రం. పోతే, తేదీ 27 అంటే 9. సంవత్సరం 2016 అంతా కూడితే 9 వస్తుంది. పాపం హరిష్ రావత్‌గారు 9 అంకె దెబ్బకి విరుగుడు చేయించుకోవాలి. సంఖ్యా వాస్తు శాస్త్ర సాములూ రాండి!
మోదీగారికి ఖాదీ మోజు!
కాంగ్రెసు వాళ్లు ఒకటే గోల పెడుతున్నారు గానీ- ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీగారికి గాంధీజీ అన్నా , గాంధీ ఖాదీ అన్నా ఎనలేని భక్తి. ‘‘ఒకరకంగా ‘మా గాంధీ’గారిని కూడా మీరు ఎత్తుకుపోతున్నారర్రో అంటూ కాం.పా. గోల పెట్టాలని ఇలా చేస్తున్నాడు’’ శ్రీమాన్ మోదీ అని అనుకోనక్కరలేదు. ‘‘ఖాదీని దేశవాళి జౌళి పరిశ్రమల్నీ ప్రోత్సహించడానికి తాను కంకణం కట్టుకున్నాను’’ అన్నాడు మోదీగారు, తన మనసులో మాట రేడియోలో వినిపిస్తూ.
ఎయిర్ ఇండియా మీద పడ్డది ఆయన కన్ను. మన రాష్టప్రతి, ప్రధానమంత్రీ- అలాగే ఉపరాష్టప్రతికూడా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ప్రయాణం చేస్తారూ అని తెల్సుగా- ఇకమీదట రుూ ప్రత్యేక విమానం ‘నెం.1’లోని సిబ్బంది కూడా ఖాదీ నెం.1- ఆడా మగా కూడా కేవలం ఖాదీ దుస్తుల్నే ధరిస్తారు. ఆడవాళ్ల ఎయిర్‌హోస్టెస్‌లు వగైరాలకి ‘లక్కీ’గా ఖాదీ సిల్కు చీరలు మంజూరైనాయి. మగ సిబ్బంది అంతా జోధ్‌పూర్ ఖాదీ కోట్లు, జాకెట్‌లు, ట్రౌజరు ధరించాలి. ఈ సూట్‌ని ‘బంధ్గాలా’ సూట్స్ అంటారు. ఈ విషయంలో ‘శషబిష’లు లేవు. ఖాదీ గ్రామోద్యోగ సంస్థలకి రుూపాటికే ఆర్డర్లు వెళ్లిపోయాయి.
నిజంగా ఈ పని కాంగ్రెసు వాళ్లు ఏనాడో చేసి ఉండాల్సింది. మోదీగారు గాంధీగారిని ప్రపంచంలో ఎక్కడికిపోయినా తన ‘మొహాటా’ (ముఖతొడుగు)గా చేసుకుంటున్న మోదీగారు గాంధీజీకి గుజరాత్‌కి కూడా ఇది ‘నివాళి’ అన్నాడు. మరి ‘గాంధీ టోపీలు’ మాట ఏమిటి?
పాము కాటుకి పామే మందు!
పొలాల్లో పని చేసుకునే రైతుకి రకరకాల పాములు పందికొక్కులు తగులుతాయి. వాటిలో ఎగిరే పాములు కూడా ఉంటాయి అని రుూమధ్యే తెలిసింది. తమిళనాడులో చెన్నయి శివారు గ్రామాలలో ఒకటయిన ‘‘కాలం పాలయంలో పొలాల్లో పనిచేసుకుంటున్న రైతుకి ‘ఎగిరే సర్పం’ ఒకటి కనపడింది. అది చిత్రంగా ఉంది. అది అమాంతం యిరవై మీటర్ల దూరం ఎగిరి ఒక చెట్టు కొమ్మ మీద నుంచి మరో చెట్టు మీదకి వాలడానికి ఏమీ శ్రమ పడటం లేదు. ఇది రైతు చూశాడు. బిక్కచచ్చిపోయి తేరుకొని పాములు పట్టేవాణ్ని పిలుచుకొచ్చాడు. ఓ మీటరు పొడవున్న రుూ పాముని పట్టుకున్నారు వాళ్లు. అది నేలమీద అసలు పాకడం లేదు. గాలిలో ఎగురుతున్నది, దుముకున్నది.
అటవీ శాఖాధికారులకు దాన్ని అప్పగించారు. ఈ విధంగా తమ తిండికోసం పక్షుల్లాగా ఎగిరే పాముల్ని ‘క్రిసోపరియా స్నేక్స్’ అంటారుట. ఇవి ఎక్కువగా మన దేశంలో లేవు. అదో జాతి పాములు కంబోడియా, వియత్నాం, శ్రీలంక లాంటి దేశాల అడవులలో ఎక్కువగా వుంటాయి. మన దేశంలో యివి దక్షిణాదిన పడమటి కనుమలలో కొన్ని అడవులలో మాత్రం వుంటాయి అరుదుగా.
పడమటి కనుమల ప్రాంతంనుంచి తమిళనాడుకి కలపని తీసుకుని వచ్చే లారీలలో రుూ ‘సర్పరాజం’ ఫ్రీగా ప్రయాణం చేసి ‘చెన్నయి’ సిటీ చూడాలని వచ్చి వుంటుంది అన్నారు పాములవాళ్ళు. అది అలా వుండగా జార్ఖండ్ రాష్ట్రంలో మరో వింత జరిగింది. జార్ఖండ్‌లోని లాహోర్‌దాగా జిల్లా పొలాల్లో తన పనిలో నిమగ్నమై వున్న 30 సంవత్సరాల వయసుగల రైతు సురేంద్ర ఒరాన్‌ని ఓ పాము వచ్చి తన కోరలు దిగేలా ముద్దెట్టుకుంది. ఆ కాటుకి అతని విషం, కోపం రెండూ నషాళానికి ఎక్కాయి. ‘‘అత్తెరీ! ననే్న కరుస్తావే భడవా!’’ అంటూ దాన్ని ఒడిసిపట్టుకుని తోక వేపునుంచి మొదలుపెట్టి తలదాకా పచ్చి పొట్లకాయని కొరుక్కుతిన్నట్లు చకచకా తినేశాడు.
పాము కరిస్తే వెంటనే దాన్ని తినేస్తే విరుగుడు అవుతుందన్న మూఢ నమ్మకం కొన్ని కొండ ప్రాంతాలలో వుంది. కానీ రుూ రైతుకి అంతలో కనులు బైర్లు కమ్మాయి. ఆసుపత్రికి పరుగెత్తాడు. ఓ రెండు రోజులు యింజెక్షన్ వగైరా పొడిచి పడుకోబెట్టారు. ఈ ప్రాంత వాసులుకి వింత నమ్మకాలు ఎక్కువ. గబ్బిళాలను పట్టుకొని ఉన్నపళాన తినేస్తే మెదడు చిట్లిపోయే వ్యాధులు రావుట! అలాగే ఎలుగుబంటి మాంసం భుజిస్తే దోమలు కుట్టినా మలేరియా వ్యాధి రాదుట. మరికొంతమంది మగపురుషులు మగసిరి కోసం పీతల్ని తినాలని కూడా అంటారు కానీ అవి అక్కడ దొరకవ్.
పాముల్ని యిలా తినేసిన కొంతమంది రైతులు అంతే సంగతులు అయిన ఒకటి రెండు సంఘటనలున్నాయిట! చైనావాళ్లు ‘న్యూడిల్సు తిన్నట్లు’ పాముల్ని కొరుక్కుతినేస్తారట. అందుకే వాళ్లు మన కన్నా గొప్పవాళ్ళం అనుకుంటారు అని కొందరి అపోహ- అందుకనే వాళ్లు మనకన్నా పొట్టిగా వుంటారు అనుకోవచ్చుగా!

-వీరాజీ veeraji.pkm@gmail.com