వీరాజీయం

అస్తమించడం మరచిన సూర్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండా నీడా రెండూ మండిపోతున్నాయ్. ఆంధ్రా లేదు తెలంగాణా లేదూ.. ఎడా పెడా సూర్యుడు మొత్తం తెలుగువాళ్లందరినీ కాల్చుకుతింటున్నాడు. అదిలాబాద్, అనకాపల్లి - రెండూ చర్మం వొల్చుకుని తిం టున్న మండుటెండలోనే వున్నాయి. గజ్జెలు కట్టుకుని కథాక్కళి నృత్యం చేస్తున్న సూర్యభగవానుడు భగభగ జనాన్ని కాల్చేస్తుంటే చాలా మంది ‘హరీ’మంటున్నారు.
ఏదైనా సమస్య వుంటే మొదట ముఖ్యమంత్రిని తిడతారు జనం. కాని రుూ ఎండల తాకిడికి అటు చంద్రబాబుని యిటు చంద్రశేఖరుణ్ని కూడా ఏమీ అనలేకపోతున్నారు. సూర్యుడు మనం ‘కల్చరల్ వీక్’లు, ‘ట్రాఫిక్ వీక్’లు జరుపుకుంటున్నట్లు ఏకంగా ‘హీట్ వేవ్‌మంత్’ జరుపుకుంటున్నాడు.
ఇంకా ఎక్కడ జూన్ నెల? మధ్యలో మే వుందిగా- జలాశయాలలో నీటిమట్టం పడిపోవడంకాదు మట్టమే మటుమాయం అయిపోతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నీరు ఎండ వేడికి హారతి పడుతోంది. ఎక్కడ చూసినా ‘ఎండిపోడం’ తప్ప, లేక ‘మండిపోవడం’ తప్ప మరో రకంగా ‘పోడాని’కి దారి లేదు. కృష్ణా గోదావరి జీవనదులే గొంతారిపోతోంది ‘మొర్రో’మంటున్నాయ్- ‘మామిడిపండ్ల గంపలోయ్- మల్లిపూల దండలోయ్’ లాంటి ‘పొయిట్రీ’ చెప్పవద్దు. కవిత్వం ఉగాదినాడే తోకముడిచింది- జనాలు అప్పడాల్లాగా, వడియాల్లాగా ఎండిపోతున్నారు. ఉష్ణతాపానికి బలి అయినవారి సంఖ్య వంద ఏనాడో దాటింది. ఏడు కొండల ‘తిరుమల’లోను ఏడుకొండలు (చిన్నవేననుకోండి) వున్న బ్లేజ్‌వాడలోను కూడా ఒక్కలాగే వుంది ఉష్ణప్రతాపం.
హై.బాకి ‘తోబా’ ‘తోబా’ యింత ‘గరమే’ మునె్నన్నడూ లేదు. కొత్తగా ఉక్కపోతలు చెలరేగిపోతున్నాయ్. స్కూళ్ల సంగతి మామూలే. మూయండిరా అంటే సమ్మరు క్యాంపులు పెడతారు.
బెజవాడ స్పెషాలిటీ ఒకటి వుంది. కాళ్లు విరిగి పడిపోయిన మదపుటేనుగులు లాంటి చిన్న కొండలు వూరంతా పంచుకుని, పరుచుకున్నాయి కదా! అవి పగలంతా ఎండ ‘మేసి’ రాత్రికి ‘నెమరు’వేస్తాయి. ఈ ‘రాత్రి ఎండ’ అనేది బెజవాడ వాసులకి ఒక ప్రత్యేక వరం.
‘‘ఎలా వున్నావ్? బ్రదర్’’ అంటే ‘‘ఉస్సు’’రంటూ ‘‘నువ్వు నీ మొహం అద్దంలో చూసుకో- అలాగే వుంది నా మొహంకూడా’’ అన్నాడు. ఎవళ్లను చూసినా ‘‘రుూడ్చి తన్నినట్లున్నారు; పుచ్చకాయలు, కర్బూజా పళ్లూ, తాటి ముంజెలు వగైరాలు తినాలోయ్’’ అన్నాను. అందులో అందరికీ జేబులో ‘తడి’ వుంటుందా? అంతటా ‘పొడి’, ‘వేడి’ తప్ప ‘చెమ్మ’ అన్నమాట లేదు.
బయటకు పోయి వీటిని కొనుక్కుచ్చుకునే ‘శక్తి’ లేదయ్యా’’ అంటున్నారు జనాలు.
‘‘బాబూ! వస్తూ వస్తూ ఓ పుచ్చకాయ తేలేకపోయావా?’’ అంటే పార్కింగ్‌లో బండెట్టి - హెల్మెట్ చేతబట్టి ఎండలో వెళ్లి తేవాలంటే అక్కడే మొహం తిరిగిపోతుందన్నా- నువ్వేదో ‘మగ్గు’డు అయిసు వాటర్ యిస్తావనుకుంటే..? అటు తరువాత మాట్లాడలేదు. సైగ చేశాడు. ముందర నీళ్లో ‘కూల్‌డ్రింకో’ పొయ్యి అన్నట్లు.
నిజమే గాని వూళ్లో చెరువులు అన్నీ ఎండిపోయినట్లు టెర్రస్ మీద మా టాంకులో నీళ్లు యింకిపోలేదు కాని మరిగిపోతున్నాయి. నేరుగా టీ కలుపుకోవచ్చును. అంచేత ఫ్రిజులో వున్న అయిసు ముక్కలన్నీ బక్కెట్లలలో పోసేశారు. పిల్లలు ‘వాష్‌బేసిన్’ పంపు విప్పితే చెయ్యి కాలే నీళ్ళు- వాష్‌రూమ్ అవసరాలకి చన్నీళ్ళు వుండాలా? వద్దా? ‘కూల్‌డ్రింకు’ యిచ్చి రుూ సోదంతా వచ్చిన పెద్దమనిషికి చెప్పుకుంది ఇంటి ఇల్లాలు- ముడుచుకుపోయాడతగాడు.
‘ఆటో’ అంటే దాని ‘మూతి’కి కట్టిన ‘బోర్డు’ చూపెట్టాడు సీట్లో బజ్జొన్న ఆటో అన్న- ‘మద్దినేల ఒంటి గంట టు ఐదు గంటలదాకా ‘నో ఆటో’- అదీ బోర్డు.
‘‘ఓర్నీ మరి బేరాలు వద్దా? అంటే బేరాలు ప్రాణాలకన్నా ఎక్కువా సారూ?’’.
‘‘కూలర్‌లు పెట్టి బస్సులు నడిపిస్తున్నారట కదా! అనడిగాను ఓ ఫ్రెండుని- ఇనె్వర్టర్‌లో ఛార్జీ అయిపోయిందిట! నీళ్లు లేవు కూలర్‌లకి. అంచేత దిగిపోయి నెక్స్‌ట్ బస్‌కి ట్రయ్ చెయ్యండి. డబుల్ రేటుకి ఏ.సి ప్రయివేటు బస్సు దొరుకుతుంది అన్నాడట కండక్టర్.
బెజవాడ నుంచి వచ్చిన ఒక గెస్టు ‘‘అమ్మా. ఏ.సీ వుందా?’’ అంటూ ఏ.సి.గదిలో దూరి తలుపేసుకున్నది నిర్మొహమాటంగా.
ఈ ఎండలకు కుండలో నీళ్ళు ముందుట. కాని కుండల్లో నీళ్లకు ఏడబోవాలి? అయితే.. ఒక పని చేయండి. ‘‘నీరుల్లిపాయ’’లు తెచ్చిపెట్టుకోండి. నీరుల్లిపాయ ఘాటు వాసన చూస్తే వడదెబ్బ కొట్టదుట. గుమ్మాలకి ఉల్లిదండల తోరణాలు కట్టండి. ఏనాడో చెప్పారు మనవాళ్ళు- ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని- అంటే నీరుల్లిపాయ సుమా? వాటి రేటు పెరిగిందా? ఘాటు కూడా పెరిగిందన్నమాట! మరీ మంచిది! పాపం! ఈ మండుటెండాకాలంలో ఫ్లడ్‌లైట్ల క్రింద అంటే డబుల్ హీట్ అన్నమాట.. క్రికెట్ ఎలా ఆడుతున్నార్రా బాబు! చూసే వాళ్లు ఉల్లిపాయలు మెళ్లో కట్టుకుంటారనుకో- ఆడేవాళ్లు? ‘‘వాళ్లు బ్యాంక్ బ్యాలెన్స్ జ్ఞాపకం చేసుకుంటారు. ఆట కాంగానే ఐదు నక్షత్రాల స్విమ్మింగ్ పూల్స్‌లో దూకుతారు. వాళ్లెలా? పోతే మనకి ఎందుకు?’’ మావాళ్ళున్నారు ముంబాయిలో, వాళ్లు చెప్పారు- మొన్న క్రికెట్ అయినాక కొంపకి చేరుకునే సరికి గొంతెండిపోయి- సన్‌స్ట్రోక్ కొట్టిందట- అన్నది ఓ ఇల్లాలు.
వాతావరణ నిపుణులు చెపుతున్నారు. ఆకలి వేసినవాడికి షడ్రసోపేతమయిన విందు వడ్డించి విస్తరిని అద్దంలో చూపించినట్లు- ఈ ఏడాది రెట్టింపు వర్షాలు కురుస్తాయిట. గడచిన రెండేళ్లకన్నా రుూ జూన్ నెలలో వానదేవుడు అత్యంత ప్రసన్నుడై ‘ఐటెమ్ సాంగ్స్’ పాడతాడు అని ఎండలో నిలబడి ఐసుక్రీముని, కూల్‌డ్రింకునీ తల్చుకుని పెదాలు చప్పరించుకోవాలి అని చెప్పినట్లుందీ ‘వార్త’ అన్నాడో ఆధునిక కవిపుంగవుడు ఇస్సు యిస్సురంటూ...’’
అయినా కొంతమంది స్కూళ్లు యింకా మూసెయ్యలేదు.
ఐ.పి.యల్ ప్లేయర్స్ లాంటి వాళ్లే ప్రయివేటు విద్యా సంస్థల వాళ్లు కూడా అడ్మిషన్‌లు పోతాయంటే పంచ ప్రాణాల్లో నాలుగు ప్రాణాలకి వడగొట్టినట్లు దుఃఖపడతారు.
అన్నీ సరే, శేరు మల్లెపూలు, ఐదు కిలోల మామిడిపండ్లు లాంటి మాటలు ఓ.కేగాని ఓ ‘గ్లాసుడు’ నీళ్లు ‘పానీ’ అనగా ‘వాటర్’ చెయ్యగలరా? చెప్పండి- ఎవరేనా? చెయ్యలేరు...
రిలాక్స్ అండ్ వాచ్ ఐ.పి.యల్ సర్కస్!