వీరాజీయం

పతకం వెండిదైనా సింధు బంగారమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింధూ అంటే నది, దాని పేరు మీదనే మన దేశం హిందూ దేశం అయ్యిందంటారు. సింధూ యావన్మంది హిందూ దేశస్తులకీ ‘‘ముద్దు బంగార’’ మైంది. గర్వకారణం అయింది. పతకం వెండిదైనా అతి పిన్న వయస్సులోనే ప్రపంచ బ్యాడ్‌మింటన్‌లో అగ్ర తారలైన హేమాహేమీలను ఓడించి- చివర పోటీలో హోరాహోరీ పోరాడి- 2-1 తేడాతో (వరుస సెట్‌లలో కాదు- అదే క్రెడిట్) ఓడినా అందరి మన్ననలూ పొందిన సింధూ ఒలింపిక్స్‌నుంచి మెడల్ తెచ్చిన అతి చిన్నారి.
పోయినేడాది మార్చిలో పద్మశ్రీ అవార్డు అందుకున్న వేంకటసింధు- రుూ జాతీయ సత్కారం పొందిన వారందరికన్నా పిన్న వయస్సులోనే రుూ ఘనత సాధించి మరో రికార్డు స్థాపించింది.
ఈ చిన్నారి విషయంలో- ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’-అన్న సూక్తి సరిగ్గా అతికింది. 1995 జులై 5న పుట్టిన రుూ బాలిక 2013నాటికే ప్రపంచ ఖ్యాతి సంపాదించుకున్న బ్యాడ్‌మింటన్ ఛాంపియన్ అయిపోయింది. 2013లో మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం సాధించింది. న్యాయంగా అయితే అమ్మ విజయ, నాన్న పూసర్ల రమణగార్లు యిద్దరూ జాతీయ స్థాయి వాలీబాల్ ఆటగాళ్లు. పైగా తండ్రి అర్జున్ అవార్డు అందుకున్న గొప్ప ఆటగాడు.
ఐతే, చిన్నారి సింధు తన ఆరవ ఏట అంటే 2011లో లండన్‌లో వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల ఫైనల్స్ ఆడుతున్న పుల్లెల గోపీచంద్ ఆటని తదేకంగా చూసి, మురిసిపోయి కేరింతలు కొట్టింది. వ్యాలీబాల్‌కి బదులు షటిల్ ర్యాకెట్ రుూ పాప అందుకోడానికి కారణమైన ఆ పుల్లెల గోపీచందే తనకి గురువు, దైవం, నేస్తం అయి- తనని తీర్చిదిద్ది- యింతదాన్ని చేస్తాడని గానీ, తాను రుూ చిన్నతనం వొదిలి, ఒక రోజున ఒలింపిక్స్ గ్రామం ‘రియో’కి తీసుకుని వెళ్తాడని గానీ, ఆ యిద్దరూ అనుకోలేదు గానీ, గోపీచంద్ అకాడమీలో రుూ బాలికని, ఆమె ఎనిమిదవ ఏట చేర్చారు అమ్మా, నాన్నలు. అక్కణ్నుంచి సింధూది ఒకటే దీక్ష. ఒకటే తపస్సు. సైనా నెహ్వాల్ లండన్ నుంచి కంచు పతకం తెస్తున్నప్పుడు- ఆమెను అతి కుతూహలంగా ప్రతీ బంతినీ నిశితంగా గమనించిన సింధూ చెప్పింది- ‘‘ఒకనాడు నేను కూడా దేశంకోసం-అమ్మానాన్నలకోసం, కోచ్ కోసం ఒలింపిక్స్ పతకం తేవాలి’’- అనుకుందిట!
అప్పుడామె ర్యాంకు ఇరవై అయిదు. ఈ తెలుగు పిల్ల ఎప్పుడూ తన అయిదడుగుల పదిన్నర అంగుళాల పొడవును మరిచిపోలేదు. అంతకన్నా ఎత్తుగానే ఎదిగింది. ప్రపంచంలో ఒక ‘బ్యాడ్’మింటన్‌లో ‘గుడ్’ సంచలనం అయింది. సైనానెహ్వాల్ పుల్లెల గోపీచంద్ ‘ద్రోణాచార్యత్వాన్నీ’, అతని అకాడమీ ధ్యేయాన్నీ కూడా తూలనాడింది. బద్నాం చేసింది. కానీ అసలుసిసలు ద్రోణాచార్యుడై గోపీచంద్- సింధూని అతి త్వరగా ఒలింపిక్స్ స్థాయికి తీసుకొని వచ్చాడు. సింధూకి క్రమశిక్షణ వుంది. పంతం వుంది. గురువు చెప్పినదాన్ని తు.చ. తప్పకుండా చేసే సంయమనం కూడా వుంది. ప్రపంచ స్థాయి పోటీలలో వరుసగా- రెండు కంచు (బ్రాంజ్) పతకాలను, గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్‌ను తెచ్చిన రుూ షటిల్ సంచలనం అసలు ప్రస్థానం యిప్పుడే మొదలైంది. ఇవాళ ఆమెని ‘గోల్డ్’ని చేజార్చుకున్నది అని ఎవ్వరూ అనటం లేదు. కనీవినీ ఎరుగని రీతిలో నెం.ఒన్; నెం.ఫైవ్‌లను నిలవరించిన రీతినే అందరూ కీర్తిస్తున్నారు. ద్రోణాచార్యుడి శప థం నెరవేర్చిందామె.
గోపీచంద్ అకాడమీకి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో వున్న యింటి దగ్గర్నుంచి ఒక్కనాడూ ‘లేట్’ కాకుండా టంచన్‌గా వచ్చి ‘రాకెట్’- దాంతో సాచి కొడితే రివ్వున ఎగిరే పిట్టలాగా ఎగిరే షటిల్- అంటే యివే ఈ- సవ్యసాచికి తెల్సు. అందుకే ఆమె అర్జున్ అవార్డుని తెచ్చి, ‘‘విజయుడై’’ గురువుగారికి అందించింది.
2013 నుంచీ రుూ చిన్నారి ముందుకేపోతున్నది. 2014లో ఎఫ్‌ఐసిసిఐ వారి వార్షిక అవార్డుని- అత్యుత్తమ స్పోర్ట్స్ పర్సన్‌గా ఎత్తుకున్నది. ఎన్.డి.టి.వి. వారి- ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’- అందుకున్నది.
నిజానికి సింధూ సైనాకి ‘ఐసోరు’ అయిపోయింది. ఒక రకంగా సైనా నెహ్వాల్ ప్రపంచం అంతా ఉత్తమ కోచ్‌గా భావిస్తున్న గోపీని తూలనాడకపోతే - సింధూకి రుూ విజయ పరంపర కొంచెం ఆలశ్యం అయ్యేదేమో?
2015 జనవరిలో సింధూకి దెబ్బతగిలితే - గోపీచంద్- స్వయంగా సేవలు చేసి, మెళుకువలు నేర్పించాడు. ఆమెను మైదానంలో ఒక ఛెయిర్‌లో కూర్చోబెట్టి శిక్షణ కొనసాగించాడేగానీ- పంతం వదల లేదు. స్వయంగా శిష్యురాలి కాలి గాయానికి నిత్యమూ మసాజ్ చేసి స్వస్థత చేకూర్చి, అందరికీ తలమానికం కాగల ‘క్రీడాగత్తె’గా తీర్చిదిద్దినట్లు చెప్పుకుంటారు. అటువంటి- వాడికే కదా రుూ క్రెడిట్ దక్కాలి!
రియోకి పోయేముందు ఏడెనిమిది కిలోల బరువు తగ్గిపోయాడుట గురువుగారు. సరిగ్గా తినక, నిద్దరోక, ఒలింపిక్స్‌కోసం అహర్నిశలూ కోచింగ్ యిచ్చిన గోపీచంద్- అకాడమీ ద్వారా ఎంతోమంది ఛాంపియన్లను తయారుచేయాలన్నదే అందరి కోరికా!
సింధూ వరుసగా మూడ్రోజులలో మూడోసారి అతిరథులతో రంగంలోకి దూకినా- లేడి పిల్లలాగా చురుకుగా ఫీల్డ్ అంతా ‘దునే్నసింది’ అని క్రీడా నిపుణులు అంటున్నారు. శభాష్! కరోలినా మారిన్ లాంటి ‘దిగ్గజం’ ముందు తొలి సెట్‌ను ఝణాయించి ఆడి- లాక్కోడం మాటలా? అదేమి?- ర్యాలీలండీ బాబూ!
జనాలు గుండెలుగ్గబట్టుకొని చూశారు. ఇండియాలో ఒక్కటే కార్యక్రమంగా సాగింది ఫైనల్ మ్యాచ్. నేలకి సెంటీమీటర్ దూరం నుంచి (కిల్ అయిందనుకున్న) బంతుల్ని ఎత్తి, ప్రత్యర్థి గుండెల్లో తుపాకీ గుండులాగా, తిప్పి పంపటం- ఓహో! మారిన్ గెలిచినా, సింధూ ఓడిపోలేదు. సింధూ ఓడినా మారిన్‌తో సహా అందరూ ప్రశంసలే కురిపించారు. అందుకనే మా సింధూ బంగారం!
షీ ఈజ్ అవర్ ఫ్యూచర్ గోల్డ్!!