వీరాజీయం

ఇక ‘ఎర్రదీపాల’ కల్చర్‌కి స్వస్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండాకాలంలో ‘గంటల శకటాలు’ అంటే అగ్నిమాపక దళాల వాహనాలు- అలా మ్రోగుతూనే వుండడం ఎక్కడో కొంపలు తగలపడ్డాయ్ అని జనాలు మెడలు రిక్కించి చూసి- ఎండ వేడిమికి తట్టుకోలేక మొహం త్రిప్పుకొని తమ దారంట పోతూండటం బెజవాడలోని నిత్య నూతన దృశ్యాలు. కాని ఇటీవల ‘అందాక ముఖ్యనగరం’గా పేర్గాంచిన విజయవాడ మహానగరంలో ‘ఎఱ్ఱ దీపాల’ వాహనాల బెడద ఎక్కువైంది. ఉండవల్లి వైపు నుంచి ‘పీనుగుల వంతెన’ (పాతపేరు) మీదుగా మామూలుగా జనాలు శకటాలు కదలటమే కష్టం. ఎర్రదీపాల (బీకన్) కార్లు అవి మంత్రులవైనా కావచ్చును అత్యున్నత అధికారులవైనా అవ్వొచ్చును. ‘ఎర్ర దీపాలు’ గిరగిరా తిరుగుతూ కాంతి పుంజాలను వెదజల్లుకుంటూ పోయిందంటే అది వి.వి.ఐ.పిల శకటం అన్నమాట. కదలక మెదలక ఎర్రగానో, నీలంగానో వెలుగుతూ ఒక శకటం యుద్ధ రంగంలో మరటాంకులాగా దూసుకువస్తున్నదీ అంటే వి.ఐ.పి మామూలు ముఖ్య శాల్తీగారిదన్నమాట. అయితే హైదరాబాద్‌లో రుూ ‘ఎర్రదీపాల’ వాహనాల రొద- లాల్‌బత్తీ గిరగిరల శకటాల గోల మరీ ఎక్కువ. అది ‘తాత్కాలిక రా.్ధ’ అయితే ఇది మన ఉమ్మడి రాజధాని. పైగా యిక్కడ ‘ముఖ్యమంత్రి ఎ.పి’ అనాలి. లేదా ముఖ్యమంత్రి టి అనాలి. లేదా ‘కన్‌ఫ్యూజన్’ తప్పదు.
ఆంధ్రా ముఖ్యమంత్రిగారు పది కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆలీషాన్ నివాహ గృహంగా కట్టుకున్న ‘ఆలీషాన్’ స్వగృహం కట్టుకున్న మహానగరంలో ‘సార్ వస్తున్నాడూ’ అంటే ఎక్కడ శకటాలు అక్కడే గప్‌చిప్.
‘‘ఆంధ్రాలో అయితే చెట్టు కింద వున్నట్లుందీ’’ అంటారు చంద్రబాబుగారు. కాని యిక్కడామాట అనలేరు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ‘చంద్ర’ నామధేయుడే. ఆయన స్టేటస్ వి.వి.ఐ.పికి మరో రెండు అక్షరాలు ఎక్కువే అంటారు సకల జనులు.
ఈ బడా అధికార నాయకులందరికి ‘తయనాతు’ శకటాల గొలుసు కూడా ఒకటి వుంటుంది. పిల్లి మెడలో గంట కట్టినట్లు ఈ అతి ముఖ్య అధికార గణాల రాక తెలుపుతూ ‘లాల్‌బత్తీలు సైరను’లు వుండాల్సిందే మరి. లేదా అవి మట్టేసే అవకాశం ఉంది. కాని అక్కడ మోదీజీకి, యిప్పుడు యుపి యోగీజీకి- వి.ఐ.పి కల్చర్ అంటే మంట. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రుూ ఘరానా జీవనశైలికి స్వస్తి చెప్పాలన్నదే వారి ధ్యేయం.
‘‘రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా?’’ అన్నట్లు కేంద్ర ప్రభుత్వం త్యాగమూర్తుల్నీ, నాన్ త్యాగమూర్తుల్ని కూడా ఓ గాటకు కట్టేసింది. త్యాగమూర్తులంటే ‘మా యొక్క శకటాలమీద లాల్‌బత్తీలు గిరిగిరా తిరిగే ‘చక్ర పటాకీ లైట్లు’ అసలే వద్దు’ అంటూ త్యాగం చేసినవాళ్లు.
అన్నీ పాయె రుూ నెత్తిమీద ఎర్ర బల్బ్‌లనైనా వుండనీయండి అంటూ ప్రాకులాడే వాళ్లన్నమాట- ఏది ఏమైనా ‘మే’డే కార్మికులకు గొప్ప డే యేమో గాని వి.వి.ఐ.పిల దాకా ఎందుకు- మామూలు విఐపిలకు కూడా ‘సాడ్ డే’ అనగా ‘శోచనీయ దివస్’- అప్పటి నుంచీ నీల దీపాలు లేవు. ఎర్ర దీపాలూ వుండవు. అంబులెన్స్‌లకి, అత్యవసర పోలీసు అధికార గణాలకి మాత్రం రెడ్ లైట్ హక్కు నీలిరంగు దీపపు హక్కు మిగిలి వుంటుంది- (లక్కీ)
అసలు వి.ఐ.పి హక్కు సి.ఎం నుంచి సిటీ మేయర్ దాకా అందరికీ కావాల్సి వుండటంతో దీపాల సంఖ్య వందలు దాటిపోయింది. దొరకడం కష్టమైపోయింది.
ముందుగా క్లుప్తంగా ‘ఎర్రదీపం’ ఏ బాపతు అధికారులకిస్తారో యిక మీదట ఇవ్వరో , ఆఖరిసారి చూసేద్దాం- ‘చమక్ చమక్’ తిరిగే ఈ డేంజర్ లైట్లు గవర్నర్, హైకోర్టు జడ్జీలు శకటాలకి జన్మహక్కు. ముఖ్యమంత్రి యిష్టం ‘నీలం బల్బు చక్రపటాకీ’ దీపం పెట్టుకొని ట్రాఫిక్‌ని స్తంభింపచేయవచ్చును. చివరికి రుూ ఘరానా హక్కు జిల్లా పరిషత్ అధ్యక్షులకీ, కార్పొరేషన్ మేయర్‌లకీ రుూ ‘బ్లూ బీకన్’ మంజూర్‌హై! కమిషన్ అంటే (ప్రత్యేక అధికార సంఘాలు) చైర్ పర్సన్‌లకీ రుూ ప్రత్యేక సదుపాయం హక్కు వుంది. ఒక్కో దశలో రుూ స్పెషల్ రంగుల దీపాల శకటాల్ని ‘రెగ్యులేట్’ చేసి ప్రయార్టీ మీద బయటికి పంపించాల్సి వస్తూంది.
కాని కేంద్రం యిప్పుడు కఠోర నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్రాలు అంగీకరించి అమలు చేయాలి. కాకపోతే లోపల లోపల దుఃఖంగా వున్నా చాలామంది వి.వి.ఐ.పిలు భేష్ భేష్ అంటున్నారు. బయటికి మోదీయా? మజాకా?
తెలంగాణ రుూ విషయంలోను ‘టాప్’ కావాలని కెసిఆర్ ఎన్నడో ప్రకటించారు. కె.టి.ఆర్ తండ్రి అడుగులో ఉండటమంటే అర అడుగులో వుంటానంటూ తన మోటారు శకటాలమీద ‘ఎర్రదీపకాంతులు’ వద్దని ఎత్తేయించేశాడు. కె.సి.ఆర్, నరసింహన్ కూడా ‘రెడీ’ అన్నారు. గవర్నర్ అయితే వెంటనే తన సిబ్బందికి కొన్ని దీప శకటాల్ని చూపించి ముందు వాటిమీద ‘రంగు బత్తీల్ని’ ఎత్తివేసి లోపలికి రాండి అంటూ ఫర్మానా జారీ చేశారు.
ఒక తలకాయ నొప్పి తప్పింది అన్నదో బ్యాంకు మేనేజరమ్మ. దండు వాయిద్యమేదో జీలకర్ర వాయిద్యమేదో తెలియదు అన్నట్లు అసలు ఘరానా శాల్తీగారు సదరు కారు లేకున్నా వారి కుటుంబ సభ్యులు కొండొకచో కేవలం వారి డ్రయివర్ మహాశయుడు వున్నా చాలు రుూ ‘లైట్’ ఆన్ చేసి దూసుకుపోతూండటం మనం గమనించవచ్చు.
అంబులెన్స్‌లు ఆర్తనాదాలు చేస్తూ ట్రాఫిక్‌ని చీల్చుకుంటూ పోతూంటే మనం చాలాసార్లు లోపల క్షతగాత్రులు కాని ఏదైనా భౌతికకాయంగాని లేకపోవడం చూస్తాం.
అంచేత లాల్‌బత్తి ‘బీకన్ కల్చర్’ యిప్పటి సంఘ రీతులకి ‘్భన్నం’ అన్న వాదన కేంద్ర ప్రభుత్వానిది. వాటికి నూకలు చెల్లు. అక్కడ మోదీ, ఇక్కడ కె.సి.ఆర్ రుూ సంప్రదాయానికి మంగళహారతి పట్టేస్తున్నారు. యోగాజీ సంగతి సరేసరి..
‘‘పుట్ అవుట్ దట్ రెడ్ అండ్ దిస్ బ్లూ లైట్స్!’’