అంతర్జాతీయం

వీసా పోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 4: విపరీతంగా పెరిగిపోతున్న వలసదారులకు అడ్డుకట్టవేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందని దేశాలనుంచి వచ్చే వారికి (నాన్ యూరోపియన్ నేషనల్స్) కొత్త వీసా నిబంధనలను ప్రకటించింది. దీని ప్రభావం భారతీయులపై ముఖ్యంగా ఐటి నిపుణులపై భారీగా పడనుంది. బ్రిటీష్ హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం గురువారం సాయంత్రం ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం టైర్ టూ ఇంట్రా-కంపెనీ ట్రాన్స్‌ఫర్ (ఐసిటి) కేటగిరీ కింద నవంబర్ 24 తర్వాత వీసాకోసం దరఖాస్తు చేసుకునే వారి వేతనం ఇకపై 30 వేల పౌండ్లు ఉండాలి. ఈ వేతన పరిమితి ఇంతకుముందు 20,800 పౌండ్లుగా ఉంది. బ్రిటన్‌లోని భారతీయ ఐటి కంపెనీలు ఈ ఐసిటి రూట్‌నే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ ఐసిటి రూట్‌లోనే దాదాపు 90 శాతం మంది భారతీయులు బ్రిటన్‌లో అడుగుపెడుతున్నారని బ్రిటన్ వలస వ్యవహారాల సలహా కమిటీ (ఎంఏసి) ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వానికి సమర్పించిన ఒక నివేదికలో పేర్కొంది. ఈ మార్పుతో పాటుగా ఒక కుటుంబ సభ్యుడిగా బ్రిటన్‌లో స్థిరపడడానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఇంగ్లీషు భాష తెలిసి ఉండాలనే షరతు విధించింది. అలాగే టైర్ టూ జనరల్ కేటగిరీ కింద అనుభవజ్ఞులైన వర్కర్ల వీసా దరఖాస్తులకు వేతన పరిమితిని పెంచడం లాంటి మరి కొన్ని నిబంధనల్లో మార్పులను కూడా చేశారు. మూడు రోజుల పర్యటనకోసం బ్రిటీష్ ప్రధాని థెరెసా మే ఆదివారం భారత్‌కు రావడానికి రెండు రోజుల ముందు ఈ కొత్త వీసా నిబంధనలను ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.