కరీంనగర్

వేములవాడలో భక్తజనసందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కొత్త సంవత్సరంలో తాము కోరుకున్న కోర్కెలు, అనుకున్న పనులు పూర్తిచేయాలని రాజన్నకు భక్తులు వివిధ మొక్కుబడులు సమర్పించుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా జనవరి 1వ తేది సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించడంతో వేములవాడకు గురువారం రాత్రి నుండే భక్తుల రాక ప్రారంభం అయింది. ముఖ్యంగా శుక్రవారం స్థానికులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు వేకువజామునే క్యూలైన్‌లలో రాజన్నను దర్శించుకుని అభిషేకాలు చేశారు. రాష్టవ్య్రాప్తంగా వచ్చిన భక్తులు మాత్రమే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి వివిధ మొక్కుబడుల కొరకు సంబంధిత క్యూలైన్‌లలో చేరిపోయి, మొక్కుబడులు తీర్చుకోగా చాలామంది కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకోవడం కనిపించింది. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ అధికారులు ఆలయం లోపలిభాగంలో ప్రాంగణంలో సైతం రంగు రంగుల పూలతో ఆలంకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 40వేల మంది భక్తులు దర్శనార్థమై విచ్చేసారని, వివిధ ఆర్జిత సేవల టికెట్ల విక్రయాల వల్ల ఆలయానికి రమారమి 20 లక్షల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. కాగా వేములవాడ పట్టణంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గురువారం అర్థరాత్రి నుండే స్థానిక యువకులు పెద్ద ఎత్తున బాణాసంచ కాలుస్తు, కేక్‌లు కట్ చేస్తూ హంగామాతో వేడుకలను జరుపుకున్నారు.
స్థానిక పంచాయతీ చైర్‌పర్సన్, నామాల ఉమా లక్ష్మీరాజం, వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, కౌన్సిలర్లు కేక్‌లు కట్‌చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ముఖ్యనాయకులు తమ అనుచరులకు, కార్యకర్తలకు సెల్‌ఫోన్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.