Others

శరత్కాలం- అనుబంధం అలాంటిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలీదేవి, నాగేశ్వరరావు తెలుగు సినిమాల్లో ఒక సక్సెస్‌ఫుల్ జంట. 1948నుంచి ఈ జంట కలసి చిత్రాల్లో నటిస్తున్నా -స్వప్నసుందరి (1951) విజయంతో హిట్ పెయిర్‌గా పేరొచ్చింది. అంజలీదేవి భర్త ఆదినారాయణరావు, మేకప్‌మాన్ గోపాలరావు కలసి అశ్వనీ పిక్చర్స్‌ని స్థాపించి మాయలమారి (1951) చిత్రం నిర్మించారు. ఈ చిత్రంలో నాగేశ్వరరావు కథానాయకుడే కాకుండా అశ్వనీ పిక్చర్స్‌లో భాగస్వామి కూడా. ఈ చిత్రం తర్వాత ఆదినారాయణరావు అంజలీ పిక్చర్స్ అనే సొంత సంస్థ ప్రారంభించి యల్‌వి ప్రసాద్ దర్శకత్వంలో పరదేశి (1953) చిత్రం నిర్మించారు. నాగేశ్వరరావు కథానాయకుడు. ఆ తర్వాత అనార్కలి (1955) చిత్రంలోనూ ఏఎన్నారే హీరో. దీని తర్వాత నిర్మించిన సువర్ణసుందరి (1957) అంజలీ పిక్చర్స్‌కు కాసులు కురిపించింది. తెలుగుతోపాటు హిందీలోనూ అక్కినేని కథానాయకుడిగా నటించటమే కాకుండా తన సంభాషణలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం అక్కినేని నటించిన ఏకైక హిందీ చిత్రం. ఇలా ఆదినారాయణరావు అంజలీదేవి దంపతులతో అక్కినేనికి ఎంతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అక్కినేని నాగేశ్వరరావుతన పేరిట ఏర్పాటుచేసిన జాతీయస్థాయి అవార్డు కూడా అంజలీదేవికి ఇచ్చి ఘనంగా సత్కరించారు. అలాంటి ఓ సందర్భంలోనిదే ఆదినారాయణరావు, అక్కినేనిల ఆప్యాయతలకు అభినందన చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717