మెయిన్ ఫీచర్

ట్రేడ్‌టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలం తరువాత సంక్రాంతి సినిమాలకు పోటీగా మరో చిత్రం వచ్చింది. అది కూడా సోగ్గాడే చిన్నినాయన విజయం తరువాత మళ్లీ నాగార్జున సినిమానే ‘ఊపిరి’ పోటీగా రావడం ఈ వారం విశేషం. ఈసారి నాగార్జున, కార్తి మల్టీస్టారర్ చిత్రం ‘ఊపిరి’ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన పెద్ద చిత్రం. ఊపిరితోపాటు సందీప్‌కిషన్ కథానాయకుడిగా ‘రన్’, గబ్బర్‌సింగ్ గ్యాంగ్ నటించిన ‘మెహబ్బత్‌మే’ చిత్రాలతోపాటు మీరా, అమ్మాయి ఆరుగురు అనే హారర్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఈ చిత్రాలన్నిటిలోకీ పరుగుపందెంలో నెంబర్‌వన్ స్థానంలో నిలబడింది ఊపిరి. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద బాక్సాఫీస్ గలగలమంటోంది. ఇక రన్, అమ్మాయి ఆరుగురు, మీరా, మెహబ్బత్‌మే చిత్రాలు సోదిలో లేకుండా పోయాయి.