రివ్యూ

అమ్మాయ.. ఆరుగురు --దయ్యంపట్టిన కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దయ్యంపట్టిన కథ
బాగోలేదు అమ్మాయ.. ఆరుగురు

తారాగణం:
రామచంద్ర, ఆశాలత, రవి, జూ.రేలంగి, తదితరులు.
సంగీతం:
వందేమాతరం శ్రీనివాస్.
నిర్మాత:
డి రామచంద్ర
దర్శకత్వం:
జి మురళీప్రసాద్.
--
సాధారణంగా ఏ చిన్నపాటి సృజనాత్మక కార్యక్రమం చేపట్టినా దానికి ఓ శృతి, పద్ధతీ ఉంటుంది. కానీ ‘అమ్మాయి..ఆరుగురు’ మాత్రం అందుకు విరుద్ధం. వింత వింత పోకడలు పోయి మనం ఏం చూస్తున్నామన్న స్థితికి తీసుకెళ్లింది. అసలు సినిమాకు పెట్టిన పేరే అసంపూర్తిగా ఉంది. (అమ్మాయి..ఆరుగురు...) పోనీ అలాపెట్టిన పేరు ఏమైనా ఉత్కంఠ రేకెత్తేలా సన్నివేశాల కల్పన ఉందా? అంటే అదీ శూన్యం. అదేమిటో పరిశీలిస్తే...
డాక్టరు మరదల్ని పెళ్లి చేసుకుందామని బావ చాలా ఓపిగ్గా ఎదురుచూస్తూంటాడు. అలాఅలా ఎదురుచూసిన బావ రాముకి, డాక్టర్ మరదలు వసూకీ ఓ ఫైన్ డే నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లయ్యేలోగా ఓ యాక్సిడెంట్ లాంటి దాంట్లో ప్రాణాలు కోల్పోతారు. అందులో వసూ దయ్యమై తన స్థితికి కారకులైన రౌడీ స్టూడెంట్స్‌ను చంపేస్తుంది. దాంతో ‘అమ్మాయి..ఆరుగురు..’ సినిమా అయిపోతుంది. ఏ సీనూ హేతుబద్ధతకు నిలవదు. దయ్యాల కథకు రీజనింగేమిటి? అని ప్రశ్నించవచ్చు. కానీ అలా దయ్యం ప్రమేయంలేని సన్నివేశానికీ లాజిక్‌కి చాలా దూరంగా ఉంది. అసలు ఇలా దయ్యాల ఊసుల్ని పెడదామని ఆలోచన కథ అనుకున్నప్పుడు చిత్ర నిర్వాహకులకుండదు. ఎందుకంటే మొదటి సగం బావ, మరదలి చిలిపి ఆటలు, అమ్మాయిల్ని ఎంజాయ్ చెయ్యాలంటూ కాలేజీలో ఉన్న ముదురు స్టూడెంట్స్ గేంగ్‌నీ చూపిస్తారు. సడెన్‌గా సెకండాఫ్‌లో దయ్యాల ఎపిసోడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా సినిమాలు ఇలా హారర్ జోనర్‌లోకి జొరబడి పోతున్నాయి కనుక ‘ఆ ట్రెండ్‌ని ఫాలోఅయిపోతే సేఫ్‌కదా’! అని చొప్పించేసినట్టుంది. దాంతో సినిమా అయ్యేటప్పటికి ప్రేక్షకులంతా ‘పేషెంట్స్’ అయిపోయారు. అన్నట్టు ‘పేషెంట్స్’ పదప్రయోగం స్ఫూర్తికూడా ఈ సినిమాలోదే. ఎలాగంటే ‘నువ్వు డాక్టరయ్యేవరకూ పెళ్లి చేసుకోనంటున్నావు. ఆలోగా నేను పేషెంట్‌నయిపోతా’ అని కథానాయకుడు నాయికతో అంటాడు. నాయకుడు పేషెంట్ అయిపోడం ఏమోగానీ ప్రేక్షకులకు మాత్రం ఆ రూపు చిత్రాంతానికి వచ్చేసింది. అయితే సినిమా మేకింగ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ తప్పనిసరి అని అందరూ భావించినట్టే చిత్ర దర్శకులు భావించారు. అందుకు అనుగుణంగా రెండు ఐటెమ్ సాంగ్స్, రాయలసీమ ఫ్యాక్షన్ అంటూ భయంకరేశ్వరరెడ్డి, అతని తండ్రి అరవీర భయంకరేశ్వరరెడ్డి అంటూ రెండు పాత్రలు ప్రవేశపెట్టారు. భయంకరేశ్వరరెడ్డి భార్యగా ఢిల్లీ బేబీ రోల్ కూడా పెట్టి ఉర్దూ-తెలుగు కలగలిపిన గందరగోళ భాషనీ ఇరికించారు. ఇవేవీ ఏమాత్రమూ రాణించలేదు. అసలు ఇలా పాటలమీద పెట్టిన ఫోకస్ చిత్ర కథా సక్రమ సరళిపై పెట్టుంటే సినిమా అసలోమాదిరిగానైనా రూపుతేలి ఉండేది. ఇక నాయకీ నాయకుల మిస్సింగ్ కేసుని పోలీసు అధికారి డీల్ చేసిన విధానం, క్లోజ్‌చేసిన తీరూ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. చనిపోయిన వారి సెల్‌ఫోన్ ఆఖరి కాల్‌నిబట్టి అది జరిగిన ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతానికి పోలీసు బృందం నిర్ధారణకొచ్చింది. మరి అలాంటి ప్రమాదకర అటవీ ప్రాంతానికి పోలీసు బృందం తమంతట తాము అలా వెళ్లదు. కనీసం ఆ ప్రాంతం ఆనుపానులు తెలుసున్న అటవీశాఖ ఉద్యోగుల ఆసరా తీసుకుంటుంది. ఇక చిత్రాంతంలో దయ్యం అందర్నీ చంపేసిన తర్వాత ‘ఈ కేసులో బాధితులు- బాధ్యులు ఎవరూ లేరు కనుక కేసు క్లోజ్’ అని అనే్వషణ బృందంలోని సబ్ ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. వాస్తవానికి ఈ కేసులో బాధితులు- (నాయికీ, నాయికల ఆచూకీ తెలియడం లేదని నాయిక తండ్రి పెదరాయుడు పోలీస్ కంప్లైంట్ చేస్తాడు) నాయిక తండ్రి పెదరాయుడు ఉండనే ఉన్నాడు. అయినా అలా పోలీసు ఠాణాలో ఓ కేసు నమోదైన తర్వాత అందునా ఇలాంటి అరుదైన నేపథ్యంవున్న దాన్ని ఓ ఎస్‌ఐ స్థాయి అధికారి క్లోజ్ చెయ్యడం అనేది జరగదు. ఇక నాయిక మెడిసన్ చదువుతున్నట్లు చెప్పారు. కానీ వాళ్లకి బోధించడానికి వచ్చిన లెక్చరర్ చెప్పిన పాఠాలూ వేరేలా ఉన్నాయి. ఇక కొన్ని సన్నివేశాలైతే జుగుప్స కలిగే రీతిలో చూపడం చిత్ర ‘ప్రత్యేకత’. ఒకమ్మాయిని అత్యాచారం చేసినట్టు చూపడమన్నది చాలా సూచనప్రాయంగా చెప్పొచ్చు. అలాకాకుండా వరసగా అందరూ ఒకరితర్వాత ఒకరు లోపలికెళ్లినట్టు, వచ్చి ఏదోక అసహ్యకర మాటని వాడటం చూపారు. ఇది వికృతంగా ఉంది. నటీనటులెవరూ మనసుపెట్టి చేసినట్టు కనిపించలేదు. ‘లైట్’గా చేసేశారు. ఉన్నంతలో పెదరాయుడిగా జూ.రేలంగికీ పెద్దపాత్ర వచ్చింది. చిత్ర సంభాషణల్లో ఏదోక ‘పంచ్’ డైలాగులో పడాలన్న ప్రయాసే కనిపించింది తప్ప దాని అర్థాల జోలికి ఎవరూ వెళ్లలేదు. ‘అమ్మాయిల్ని పడేయడానికి సీనియారిటీ కాదు కావల్సింది, సిన్సియారిటీ’ అన్న డైలాగు ఇందుకో ఉదాహరణ. అలాగే పాటల్లో పదాలుకూడా చాలా నేలబారుగా ఉన్నాయి. ‘నా పేరే హైదరాబాద్ బుల్‌బుల్ పోరీ, నా ఇల్లేమో చార్మినార్ పక్కన గల్లీ, రాతిరేమో జాతరకు వెల్‌కమ్ మళ్లీ...’. ‘ఉమ్మా ఉమ్మా మళ్లీ ఇస్తా చుమ్మా...’ ఈ స్థాయిలో సాగిపోయాయి. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా వందేమాతరం శ్రీనివాస్ అని చూపారు. కానీ వారి బాణీలో ఈ పాటలేం లేవు. పైగా ఫస్ట్ పాటగా వచ్చిన ‘వాలుకళ్లలాంటి’ సాంగ్ ‘కొంటె చూపుతో...’అన్న పాప్యులర్ బాణీ మాదిరిగా నడుస్తుంది. అలాగే హీరో హీరోయిన్స్ నిశ్చితార్థం పాటగా వచ్చిన ‘చూడచక్కని చిన్నోడే’ పాట ఆమధ్య నాగార్జున నాయకుడిగా వచ్చిన ‘సంతోషం’ చిత్రంలోని దిమ్మితక్క... పాట వరసలో ఉంది. తీసిన సినిమా జనావళిలో వదిలేముందు చిత్ర బృందం ఒక్కసారి చూసుకుని మనస్ఫూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత రిలీజ్ చేసుంటే పిక్చర్ ఈ స్థాయిలో ఉండేది కాదేమో!

-అనే్వషి