Others

నచ్చిందే తీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-దర్శకురాలు నందినీరెడ్డి

అలామొదలైందితో ప్రేక్షకులతోపాటు పరిశ్రమను తనవైపు తిప్పుకుంది నందినీరెడ్డి. మలి చిత్రం ఫ్లాపునిచ్చినా, తాజాగా కళ్యాణవైభోగమే చిత్రంతో దర్శకత్వ ప్రాభవాన్ని సంపాదించుకున్న
నందినీతో చిట్‌చాట్...
మీ గురించి?
-పుట్టింది హైదరాబాద్‌లో అయినా ఫ్యామిలీ వరంగల్‌లో సెటిలయ్యింది. చిన్నప్పటినుంచి సినిమాలంటే ఆసక్తి. దాంతో పీజీ తర్వాత ఇండస్ట్రీకి వచ్చేశా.

అవకాశం ఎలా వచ్చింది?
-గుణ్ణం గంగరాజు రూపొందిస్తున్న లిటిల్ సోల్జర్స్ చిత్రానికి తెలిసిన ఫ్రెండ్ ద్వారా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరా. తర్వాత రసూల్ ఎల్లోర్, కృష్ణవంశీకి పరిచయం చేయడం ఆయన దగ్గర అసోసియేట్‌గా చేరిపోయాను.

తొలి సినిమా?
-అసోసియేట్‌గా పనిచేస్తూనే సురేష్‌బాబుకు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేద్దామనుకున్నాం కానీ కుదరలేదు. దాంతో దామోదర్ ప్రసాద్ ఆ కథను చేశారు.

రెండో సినిమా విషయంలో..?
-అలా మొదలైంది ఇచ్చిన నమ్మకంతో సిద్ధార్థ్‌తో జబర్దస్త్ ప్లాన్ చేశాం. అన్నీ బాగానే కుదిరాయి కానీ సినిమా పోయింది.

కళ్యాణవైభోగమే సినిమా గురించి?
-జబర్దస్త్ దెబ్బకు చాలా రోజులు అవకాశాలు రాలేదు. తర్వాత అశ్వినీదత్ కూతురు కథ విని సినిమా చేద్దామన్నారు. అదీ కుదరలేదు. తరువాత దామోదర్‌ప్రసాద్‌తో ఈ సినిమా చేశా.

వైభోగం నిలబెట్టినట్టుంది?
-కళ్యాణవైభోగమే నాకు కొత్త ఊపిరి. ఇకపై ఆచితూచి సినిమాలు చేయాలనుకుంటున్నా.

ఎలాంటి కథలు ఇష్టం?
-అన్ని రకాల కథలు చేయాలని వుంది. ఏదైనా నేను నమ్మినదాన్ని మాత్రమే సినిమాగా చేస్తా.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
-ప్రస్తుతానికి చేతిలో ఓ లవ్ స్టోరీ వుంది. దానిమీదే వర్క్ చేస్తున్నా.

-శ్రీ