Others

రణవీర్‌తో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల తార తమన్నా తెలుగులో టాప్ పొజిషన్‌లోనే వుంది. కానీ ఆమె బాలీవుడ్ డ్రీమ్ మాత్రం తీరడంలేదు. ‘బాహుబలి’ పుణ్యమా అని నార్త్‌లో కూడా మంచి గుర్తింపు పొందిన తమన్నాకు ఆ తరువాత బాలీవుడ్ ఆఫర్లు వస్తాయని అనేకమంది అనుకున్నా అవి జరగలేదు. చివరికి తమన్నా ఇక బాలీవుడ్ వైపు కనె్నత్తి చూడదు అనుకున్న సమయంలోనే రణ్‌వీర్‌సింగ్‌తో ఓ చిత్రంలో అవకాశాన్ని కొట్టేసి తడాఖా చూపింది. దర్శకుడు రోహిత్ శెట్టి, రణ్‌వీర్‌సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే ఫైనలైజ్ అవుతుందని, రణ్‌వీర్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాడని, తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని దర్శకుడు చెప్పడం విశేషం. త్వరలో రణ్‌వీర్‌తో కనువిందు చేయనున్నదన్నమాట మిల్కీ బ్యూటీ తమన్నా!