మెయిన్ ఫీచర్

ఇద్దరూ ఇద్దరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరు ఎం-స్టార్. ఇంకొంకరు ఎన్-స్టార్. ఒకరు ఎంపీ. ఇంకొకరు ఎమ్మెల్యే. ఒకరిది 149 చిత్రాలు పూర్తిచేసిన పవర్. ఇంకొకరిది 99 సినిమాలు కంప్లీట్ చేసి.. సెంచురీకి సమాయత్తమవుతున్న స్టామినా. ఒకప్పుడు -తమతమ సినిమాలతో ఇద్దరూ పోటీ ఎదుర్కొన్న వాళ్లే. ఒకరిపై ఒకరు పైచేయి చూపించుకుంటూ వచ్చినోళ్లే. వాళ్లవాళ్ల స్టామినాను ప్రదర్శించి -వాళ్లకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకున్నోళ్లే. ఇద్దరూ డ్యాన్స్‌లు ఇరగదీశారు. సినిమాకు ప్రాణమైన పాటల్లో ఇద్దరూ లెక్కలేనన్ని హిట్లు కొట్టారు. యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఒకరు రక్తికట్టిస్తే.. కుటుంబ కథా చిత్రాలతో ఇంకొకరు ఆకట్టుకున్నారు. ఎవరి స్టయిల్ వారికుంది. ఎవరి మేనరిజమ్స్ వాళ్లకున్నాయి. ఇద్దరికీ -అసంఖ్యాకమైన ఫ్యాన్స్ ఉన్నారు. చిత్రసీమలో ఇద్దరూ ప్రత్యేకమైన హోదా సంపాదించారు. ఒక చిత్రం పడగొడితే, తొడగొట్టి రెండో చిత్రంతో నిలబడిన అనుభవాలు ఇద్దరికీ ఉన్నాయి. ఇద్దరూ సీనియర్లే. ఇద్దరూ ఇద్దరే. -ఒకరు చిరంజీవి ఉరఫ్ చిరు. ఇంకొకరు బాలకృష్ణ అలియాస్ బాలయ్య. ఇప్పుడు- ఇద్దరికీ వయసు మీరుతోంది. కానీ, పట్టు సాధించడానికి ఇద్దరూ కష్టపడుతున్నారు. ‘కత్తి’లాంటి చిత్రంతో 150 పూర్తి చేయాలని చిరు ప్రయత్నిస్తుంటే -‘శాతకర్ణి’గా సత్తా చాటుకోవాలని బాలయ్య పరుగులు తీస్తున్నాడు.
--

ఇరుగు కథలు, పొరుగు కథనాలపై తర్జనభర్జనల అనంతరం తమిళ ‘కత్తి’నే తెలుగులోనూ ఝుళిపించడానికి చిరు సిద్ధమవడంతో -కథపై పెద్దగా కసరత్తు చేయాల్సిన పని తప్పింది. సో.. ఈనెల లేదా వచ్చెనెలలో సబ్జెక్టు సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలొస్తున్నాయ. ‘కత్తి’ టైటిల్‌తో గతంలో కల్యాణ్‌రామ్ సినిమా చేసి ఉండటంతో టైటిల్‌పై కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. అభిమానుల వర్షన్ కోసం ‘కత్తిలాంటోడు’ టైటిల్‌ని బయటకు వదిలినా.. ఫ్యాన్స్‌నుంచి సంతృప్తి వ్యక్తం కాకపోవడం, చిరు ఆహార్యానికి టైటిల్ ఆప్ట్‌గా లేకపోవటంతో పునరాలోచనలు సాగుతున్నాయన్నది ఇండస్ట్రీ టాక్.
--

పరిశ్రమ నుంచి వినిపిస్తున్న షికార్ల ఫుకార్లకు ఉగాది రోజున అమరావతిలో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు బాలయ్య. ముహూర్తం షాట్‌కి డేట్ ఫిక్స్‌కాకున్నా, సబ్జెక్టుపై
తనంతట తనుగా క్లారిటీ ఇచ్చేశాడు. తన తండ్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు కలగా మిగిలిపోయిన కథనే వందో సినిమాగా చేస్తున్నానని ప్రకటించాడు. అదే -శాతవాహనుల కథ. గౌతమీపుత్ర శాతకర్ణి గాథ. క్రిష్ దర్శకుడేనన్నదీ క్లారిటీ వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ మొదలైందని, తెలుగు జాతి మొత్తం తెలుసుకోదగ్గ కథ, భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తి గాథనే తన పాత్రగా ఎంచుకున్నట్టు
ప్రకటించాడు బాలయ్య.
--

దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరోలిద్దరి ప్రయత్నాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాయి. పాపులారిటీ కల్పించి చాలాకాలంగా పల్లకీని మోస్తున్న బోయిల్లాంటి ఫ్యాన్స్‌ను సంతృప్తిపర్చడానికి ఇద్దరూ కసరత్తులు చేస్తున్నారు. అయితే -వందో సినిమాకు రెడీ అవుతున్న బాలకృష్ణకు.. 150వ చిత్రానికి సిద్ధమవుతున్న చిరంజీవికి -ప్రస్తుతం ప్రేక్షకుల నాడి అంతుచిక్కకుండా ఉందన్నది నిజం. అందుకే ఇద్దరూ స్టోరీలపై విపరీతమైన కసరత్తు చేయాల్సి వస్తోంది. కథల విషయంలో కొలిక్కి వచ్చినా... హోమ్‌వర్క్ విషయంలో ఎవరి పంథా వారు అనుసరిస్తున్నట్టే కనిపిస్తోంది.
మెగా స్టార్‌గా పీక్స్‌లో ఉన్నపుడు రాజకీయ పార్టీ పెట్టి బోల్తాపడిన చిరు -చాలాకాలం సినీహీరోగా ఫ్యాన్స్‌కు దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న తరుణంలో రీ-ఎంట్రీ ఆయనకో పెద్ద ఛాలెంజ్. అక్కడికీ ప్రేక్షకుల నాడి తెలుసుకోవడానికి బ్రూస్‌లీతో బుల్లి ఎంట్రీ ఇచ్చినా -ఆశించిన ఫలితం అందలేదన్నది వాస్తవం. పూర్తిస్థాయి చిత్రంపై పెద్దఎత్తున వర్కవుట్స్ జరుగుతున్నా ఇదిగో అదిగో అనే వార్తలే తప్ప ముహూర్తం షాట్ పడటం లేదు.
ఇక బాలయ్య విషయానికొస్తే రాజకీయ ప్రవేశానికి ముందువరకూ సీనియర్ హీరోల్లో ‘లెజెండ్’. ఆపై ఎమ్మెల్యే కావడం.. తర్వాత ప్లాప్ భుజానికెత్తుకోవడం జరిగిపోయాయి. తిరిగి డిక్టేటర్‌తో ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు -వందో చిత్రం కనుక ప్రతిష్ఠాత్మకమే. దీనిపై పరిశ్రమ నుంచి వినిపిస్తున్న షికార్లు ఫుకార్లకు ఉగాది రోజున అమరావతిలో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు బాలయ్య. ముహూర్తం షాట్‌కి డేట్ ఫిక్స్‌కాకున్నా, సబ్జెక్టుపై తనంతట తనుగా క్లారిటీ ఇచ్చేశాడు. తన తండ్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు కలగా మిగిలిపోయిన కథనే వందో సినిమాగా చేస్తున్నానని ప్రకటించాడు. అదే -శాతవాహనుల కథ. గౌతమీపుత్ర శాతకర్ణి గాథ. క్రిష్ దర్శకుడేనన్నదీ క్లారిటీ వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ మొదలైందని, తెలుగు జాతి మొత్తం తెలుసుకోదగ్గ కథ, భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తి గాథనే తన పాత్రగా ఎంచుకున్నట్టు ప్రకటించాడు బాలయ్య. గొప్ప పాత్రతో వందో చిత్రాన్ని రూపొందించటం అదృష్టమంటూనే, తన సినిమాల్లో అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉంటాయని హామీ ఇచ్చేశాడు. వందో చిత్రాన్ని ప్రకటిస్తూనే నర్మగర్భంగా బాలయ్య చేసిన ప్రకటన సంచలనానికీ దారితీసింది. ప్రస్తుతం పరిశ్రమలో తనకెవరూ పోటీలేరని, తన సినిమాలే తనకు పోటీ అని మరోసారి గట్టిగా ప్రకటించడాన్ని చూస్తుంటే, రాబోయే చిరు 150వ చిత్రానికి పోటీలాంటిదేనన్న అంతరార్థం అర్థమవుతోంది. తెలుగు భాష, సంస్కృతి ఉన్నతికి కృషిచేసిన గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, భారతదేశమే గాదు ప్రపంచమంతా గర్వపడేలా సినిమా రూపొందనుందని ప్రకటించి అంచనాలను పెంచేశాడు బాలకృష్ణ. బాలకృష్ణ వందో చిత్రానికి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూనే, ఖండఖండాలుగావున్న భారతాన్ని అఖండ భారతావనిగా చేసిన చక్రవర్తి శాతకర్ణి కథను డీల్ చేయడం ‘కత్తి’మీద సామేనని దర్శకుడు క్రిష్ సైతం ప్రకటించాడు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కథనంతో ప్రాజెక్టును తెరకెక్కించే ప్రయత్నం చేస్తుండటం గర్వంగా ఉందనీ చెబుతూ దర్శకుడు క్రిష్ సెగ పెంచాడు. అయితే, ఈ సినిమాతో బాలయ్య వారసుడు ఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.
బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా -వందో చిత్రాన్ని బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టే తెరకెక్కించడానికి రంగం సిద్ధమవుతోంది. సినిమా షూటింగ్‌ను మొరాకోలో మొదలుపెట్టాలని కూడా క్రిష్ తలపోస్తున్నాడన్నది ఇండస్ట్రీ టాక్. శాతవాహనుల కాలంనాటి కథ. పైగా శాతకర్ణి పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కథ. ఆడియన్స్‌ను ఆనాటి కాలానికి తీసుకెళ్లాలంటే అలాంటి వాతావరణం క్రియేట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. భారీ సెట్లు, బడ్జెట్లు, కాల్షీట్లు.. ఇలా చాలా కావాలి. అందుకే -ఆనాటి చారిత్రక నేపథ్యానికి దగ్గరగావుండే మొరాకో ప్రాంతాన్ని ఎంచుకోవచ్చని అంటున్నారు. యుద్ధానికి సంబంధించిన మైదానాలకు అనుకూల ప్రాంతమైన మొరాకోలోనే కీలక ఘట్టాలైన శాతకర్ణి పట్ట్భాషేకం, వార్ ఎపిసోడ్లు పూర్తి చేయాలన్న యోచనతో ఉన్నారు. శాతవాహన సామ్రాజ్యాధినేత శాతకర్ణి పాత్రలో బాలకృష్ణను సరికొత్తగా డిజైన్ చేసేందుకు యూనిట్ వర్కవుట్స్ చేస్తుంటే, వయసును అధిగమించి పాత్రలో ఒకింత స్లిమ్‌గా రాజసాన్ని ప్రదర్శించేందుకు బాలయ్యా ఫిట్‌నెస్ వర్కవుట్స్‌పై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. ఒకపక్క గుర్రపుస్వారీ, మరోపక్క డైలాగ్స్‌ను అచ్చతెనుగు మాండలికంలో గంభీరంగా పలికే అంశంపై దృష్టి పెట్టారన్న కథనాలు వినవస్తున్నాయి. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులపరంగా వందో చిత్రం ప్రత్యేకత సంతరించుకోవాలనే తలంపుతో -బాలకృష్ణ సరసన నయనతార, రాజమాత పాత్రలో హేమమాలినిని తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ప్రాజెక్టుపై ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తున్న దర్శకుడు క్రిష్ -చారిత్రక కథను సంచలనం చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాడన్నది ఇండస్ట్రీ టాక్.
***
చిరు 150వ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా? అని చాలాకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకూ -కొద్దికాలంగా అందుతోన్న వార్తలు హుషారు పుట్టిస్తున్నాయి. ఇరుగు కథలు, పొరుగు కథనాలపై తర్జనభర్జనల అనంతరం తమిళ ‘కత్తి’నే తెలుగులోనూ ఝుళిపించడానికి చిరు సిద్ధమవడంతో -కథపై పెద్దగా కసరత్తు చేయాల్సిన పని తప్పింది. సో.. ఈనెల లేదా వచ్చెనెలలో సబ్జెక్టు సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలూ గుప్పుమంటున్నాయి. ‘కత్తి’ టైటిల్‌తో గతంలో కల్యాణ్‌రామ్ ఒక సినిమా చేసి ఉండటం, ఇదే టైటిల్‌ను మరొకరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉన్నారన్న కథనాల నేపథ్యంలో టైటిల్‌పై మాత్రం కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. అభిమానుల వర్షన్ కోసం ‘కత్తిలాంటోడు’ టైటిల్‌ని గాసిప్‌గా వదిలినా.. ఫ్యాన్స్‌నుంచి సంతృప్తి వ్యక్తం కాకపోవడం, ప్రస్తుత చిరు ఆహార్యానికి టైటిల్ ఆప్ట్‌గా లేకపోవటంతో పునరాలోచనలు సాగుతున్నాయన్నది ఇండస్ట్రీ టాక్. ఇదిలావుంటే, డ్యాన్స్‌ల్లో తన ఇమేజ్‌కి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఉండాలన్న యోచనతో -జుంటా డ్యాన్స్‌పై చిరు దృష్టి పెట్టారన్నది మరో కథనం. బాడీని అదుపులోకి తెచ్చి, వయసురీత్యా శరీరంలోని వివిధ భాగాల్లోకి చేరే ఫ్యాట్‌ను కరిగించి ఫిట్‌నెస్ అందించే లాటిన్ అమెరికన్ రిథమిక్ డ్యాన్స్ స్టయిల్ ‘జుంటా’పై చిరు సీరియస్‌గానే వర్కవుట్స్ చేస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. పుష్కరకాలం క్రితం ‘్ఠగూర్’తో సెనే్సషనల్ హిట్‌నిచ్చిన వివి వినాయక్‌కే దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తూ -చిరు 150వ ప్రాజెక్టుపైనా అంచనాలు పెంచేశారు.
***
రెండు ప్రాజెక్టులపైనా అటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ఇటు టెక్నికల్ టీంలు ఎవరి పనితనాన్ని ప్రదర్శించేందుకు వాళ్లు సిద్ధమవుతుంటే -వయా మీడియాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ సైతం కంపోజిషన్ కసరత్తుల్లో తలమునకలయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. రెండు ప్రాజెక్టులకూ మ్యూజిక్ అందించాల్సి రావడం దేవిశ్రీ కెరీర్‌కు ఒక ప్లస్, ఒక ఎగ్జామ్ కూడా. సర్దార్ ఆడియో వేదికపై చిరంజీవి మాట్లాడుతూ తన సినిమాకూ సంగీతం అందించాలంటూ దేవిశ్రీని కోరడం చూస్తే -చిరు 150వ సినిమాకు సంగీత దర్శకుడు దేవిశ్రీయేనని ఖరారైంది. ఇక ఉత్తమ చిత్రంగా కంచె ఎంపికైన సందర్భంలో క్రిష్‌కు అభినందనలు తెలుపుతూ దేవిశ్రీ ట్వీట్ చేశాడు. దానికి ప్రతిస్పందనగా.. కలిసి పని చేస్తే అవార్డులు రివార్డులు దక్కుతాయంటూనే.. ఆ దూరం ఎంతో దూరం లేదంటూ క్రిష్ ట్వీట్ చేయడాన్ని చూస్తే.. శాతకర్ణి చిత్రానికి దేవిశ్రీయే మ్యూజిక్ అందిస్తాడన్న విషయం స్పష్టమైంది.
ఇవన్నీ చూస్తుంటే మళ్లీ చిరు.. బాలయ్యల మధ్య 80వ దశకం నాటి పోటీ రిపీట్ కానుందా? అనిపిస్తుంది. బాలయ్య 100వ సినిమా, చిరు 150 సినిమా ఒకేసారి సెట్‌పైకి ఎక్కితే అభిమానుల్లో మళ్ళీ కొత్త ఉత్సాహం రేకెత్తకపోదు. మళ్ళీ రన్నింగ్ డేట్స్.. కలెక్షన్స్‌పై ఆసక్తిలాంటి కథనాలు మామూలే. ఇప్పుడు టాలీవుడ్ ఉన్న పరిస్థితుల్లో ఒకే డేట్‌కిగాని.. ఒకే నెలలోగాని ఇద్దరి సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. అయినాగానీ ఫ్యాన్స్‌లో మాత్రం ఆ వేడి రేకెత్తకమానదు.
ప్రస్తుత ప్రేక్షకులకు బాలయ్య ఇప్పటివరకు టచ్‌లోనే ఉన్నాడు. చిరు మాత్రం ఏళ్ళ తరబడి ప్రేక్షకులకు దూరంగా ఉండటంతో సినిమా నిర్మాణంపట్ల కొంత గందరగోళానికి గురవుతున్నట్టే కనిపిస్తోంది. రీసెంట్ ట్రెండ్‌లో బాలయ్యకు భారీ సక్సెస్‌లు ఇచ్చిన బోయపాటిని చివరిక్షణంలో పక్కనపెట్టి.. దర్శకత్వ బాధ్యతలు క్రిష్‌కు అప్పగించాడు. అక్కినేని అఖిల్‌ను డిజాస్టర్‌నే ఇచ్చినా.. చిరు మాత్రం తనకు బ్లాక్‌బస్టర్ ఇచ్చాడన్న నమ్మకంతో వివి వినాయక్‌నే ఎంచుకున్నాడు. కంచెతో దక్కిన గౌరవాన్ని శాతకర్ణితో మరింత ఎత్తుకు తీసుకెళ్లే యోచనలో క్రిష్‌వుంటే, అఖిల్‌కు ఇచ్చిన ప్లాప్ ముద్రను చెరిపేసుకోవడానికి వినాయక్ మంచి మీద ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎంత ఆడియన్స్ నాడి తెలిసిన దర్శకులైనా.. స్టోరీ వీకైతే పల్స్ పడిపోవడం ఖాయమన్న విషయాన్ని అనేక సినిమాలు రుజువు చేస్తున్న ప్రస్తుత తరుణంలో.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై ఇద్దరు సీనియర్ హీరోల్లోనూ ఒకింత టెన్షన్ కనిపిస్తోన్న మాట వాస్తవం. మొత్తానికి రెండు సినిమాలూ ఇంచుమించు ఒకే సమయానికి సెట్స్‌కి వెళ్తే ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న దానిపైనా ఆసక్తి రేకెత్తడం ఖాయం. క్లాప్ కొట్టిన టైంనుంచి బాక్సాఫీస్‌కు వచ్చే టైం వరకూ మధ్యలో ఎన్నో గాసిప్పులూ అభిమానులను గందరగోళానికి గురిచేస్తాయనడంలో సందేహం లేదు. అంచనాలను ఆకాశానికి చేర్చేస్తాయి. ఈ పరిస్థితుల్లో రెండు సినిమాలూ నిర్మాణం నుంచి విడుదల వరకూ టాలీవుడ్ సంచలన వార్తలకు కేంద్రం కానున్నదన్నది కాదనలేని సత్యం.

-మహాదేవ, పోలిశెట్టి