Others

నాకు నచ్చిన చిత్రం--స్ర్తిజన్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీ రామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన స్ర్తిజన్మ 1967లో విడుదలైంది. కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రమిది. అలాగే హీరో కృష్ణ ఎన్టీఆర్‌కు తమ్ముడిగా నటించిన మొదటి చిత్రం కూడా ఇదే. విభిన్నమైన కథతో యాంటి సెంటిమెంట్‌తో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో యావరేజ్‌గా ఆడింది. కుటుంబ కథా చిత్రమే అయినా ఈ సినిమాలో హీరో తాగిన మత్తులో ఒక స్టేజీ డాన్సర్‌పై మోజుపడి ఆమెకోసం వెళ్లి తన భార్య స్నేహితురాలిని బలవంతం చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. జరిగిన తప్పుకు బాధపడుతుంటాడు.
తన భార్యకు చెప్పకుండా మోసం చేశానని కుమిలిపోతుంటాడు. విభిన్నమైన కథ అయినా ఏ వర్గంవారికీ నచ్చక తిరస్కరించబడటం వల్ల బహుశా ఈ సినిమా విజయవంతం కాలేదేమో! మాస్ హీరో ఎన్టీఆర్‌మీద ఈ ప్రయోగం వికటించింది. ఈ సినిమాలో కృష్ణకు జోడీగా ఎల్ విజయలక్ష్మి నటించడమే కాకుండా మంచి పాటలన్నీ వీరిపైనే చిత్రీకరించడం విశేషం. ఈ సినిమా తర్వాత సురేష్ సంస్థలో ఎన్టీఆర్ ఏ చిత్రంలోనూ నటించలేదు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో సినిమాలో పాటలన్నీ హిట్టయ్యాయి.
కాలానుగుణమైన మార్పులతో ఇదే కథతో కొన్ని చిత్రాలు విజయవంతం కూడా అయ్యాయి. హిట్‌కాకపోయినా స్ర్తిజన్మ మంచి చిత్రమే. ఇప్పుడు చూస్తే ఈ కథలోని విలువలు అర్థమవుతాయి.

-పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి